Bolero Maxx Pik Up సరికొత్త బొలెరో మోడల్ విడుదల.. సూపర్ ఫీచర్స్, ధర కేవలం 7.86 లక్షలు మాత్రమే..

సరసమైన ధరల్లో ఎక్కువగా శక్తిని అందించే వాహనాలను విడుదల చేయడంలో భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రాకు కొట్టిన పిండి అని చెప్పవచ్చు. తాజాగా సరికొత్త శ్రేణి బొలెరో MaXX Pik-Up ట్రక్కులను ఆ సంస్థ విడుదల చేసింది. శక్తివంతమైన ఇంజన్ పనితీరుతో పాటు.. అద్భఉతమైన ఫీచర్లు కలిగి ఉంది. ఈ కొత్త మోడల్ హెచ్‌డి సిరీస్, సిటీ సిరీస్‌లలో అందుబాటులో ఉండనున్నాయి.

డీజిల్ నుంచి సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్లలో ఈ బొలెరోలు అందుబాటులో ఉండనున్నాయి. సరికొత్త Bolero MaXX Pik-Up శ్రేణి పేలోడ్ సామర్థ్యం, ​​ఇంధన సామర్థ్యం, ​​భద్రతతో పాటు మంచి డ్రైవింగ్ అనుభవం కోసం కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుంది. దీని ప్రారంభ ధర రూ. 7.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది.

bolero maxx pik up

దీనిని సొంతం చేసుకోవాలనుకునే వారు రూ.24,999 డౌన్ పేమెంట్‌తో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ శ్రేణిలో అధిక మైలేజీ, అత్యంత విశ్వసనీయమైన, సమర్థవంతమైన రవాణా అనుభూతిని కలిగిస్తుంది. మెరుగైన పనితీరుతో ట్రక్కు డ్రైవర్లకు మంచి ఆన్-రోడ్ అనుభవాన్ని అందిస్తుంది.

అధిక లోడింగ్ వాహనాన్ని తీసుకోవాలి అంటే మీరు ఈ కొత్త Bolero MaXX Pik-Up శ్రేణిని కొనుగోలు చేయవచ్చు. ఇది 1.3 టన్నుల నుంచి 2టన్నుల పేలోడ్ సామర్థ్యాలను అందిస్తుంది. వెనకాల ఉన్న కార్గో బెడ్ పొడవు 3050 mm వరకు ఉంటుంది. ఇది ఎక్కువ వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ శ్రేణి మహీంద్రా అధునాతన m2Di ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది డీజిల్ తో పాటు CNG ఎంపికలలో అందుబాటులో ఉంది. డీజిల్ ఇంజన్ 70 bhp వద్ద 200Nm, 80 bhp వద్ద 220Nm టార్క్ గరిష్ట శక్తిని విడుదల చేయనుంది.

iMAXX యాప్ ద్వారా కనెక్ట్ చేయబడిన స్మార్ట్ కనెక్టివిటీతో ఆప్షన్ ఉంటుంది. కస్టమర్‌లు లేదా యజమానులు వారి ఫోన్‌లలో దీనిని ఉపయోగించి వాహనాలను పర్యవేక్షించవచ్చు. ఈ యాప్ ఆరు భాషల్లో అందుబాటులో ఉంది. దీనిని ఆపరేట్ చేయడం చాలా సులభంగా ఉండటంతో వినియోగదారులకు కలిసి రానుంది. iMAXX ద్వారా వాహన ట్రాకింగ్, రూట్ ప్లానింగ్, వ్యయ నిర్వహణ, జియో-ఫెన్సింగ్, ఆరోగ్య పర్యవేక్షణను వంటి 50 కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి.

Bolero MaXX Pik-Up CMVR సర్టిఫైడ్ D+2 సీటింగ్ రానుంది. ఇక డ్రైవర్ కోసం హైట్-అడ్జస్టబుల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లోకి సులభంగా ప్రవేశించవచ్చు. ఆన్-రోడ్ లో చూడటానికి సురక్షితమైన లైట్లు ఉన్నాయి.ఈ వాహనం ప్రత్యేకంగా భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. మెరుగైన దృఢత్వం కోసం సింగిల్-పీస్ BSO ఫీచర్, స్ట్రెస్-పీన్డ్ సస్పెన్షన్, షార్ట్ రియర్ ఓవర్‌హాంగ్‌లు ఉన్నాయి.

మహీంద్రా ఐకానిక్ మోడల్ బొలెరోను 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టినప్పటి నుంచి 1.4 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను సాధించింది. అలానే 2023 ఆర్థిక సంవత్సరంలో 1 లక్ష యూనిట్ల విక్రయ మైలురాయిని చేరుకుంది. బొలెరో-బ్యాడ్జ్ గల SUVలు ప్రభుత్వ, చట్టపరైమైన ఇతర సంస్థలలో క్లిష్టమైన కార్యకలాపాల కోసం విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి.

Bolero తాజా విక్రయాల ఫీట్ Bolero Neo భారీ ఆకర్షణను పొందింది. ఈ విజయం ద్వారా ఆధునిక డిజైన్, మృదువైన రైడ్ లతో యువ కస్టమర్లను ఆకర్షించింది. తాజాగా ఈ హాహనం విడుదలతో సేల్స్ పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ విభాగంలో ఇది సత్తా చాటనుంది. ముఖ్యంగా మార్కెట్ అవసరాల కోసం ఇది ప్రత్యేకమైన డిజైన్ గా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 26, 2023, 10:13 [IST]
English summary
All new bolero maxx pik up range starting at inr 7 85 lakh details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+