తుపాన్ కంటే వేగంతో దూసుకెళ్లే ఆస్టన్ మార్టిన్ సూపర్ స్పోర్ట్స్ కారు DB12.. దీని ప్రత్యేకతలేంటో తెలుసా..!
భారతీయ లగ్జరీ ఆటోమొబైల్ పరిశ్రమలో DBX & DBX707 లాంచ్‌తో బ్రిటిష్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీదారు ఆస్టన్ మార్టిన్ తన ఉనికిని చాటుకుంది. మరో లగ్జరీ స్పోర్ట్స్ కారు DB12 పరిచయంతో దేశీయ మార్కెట్లో అల్ట్రా-లగ్జరీ సెగ్మెంట్‌లో ట్రయిల్‌బ్లేజర్‌గా తన బ్రాండ్ స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది.
ఆస్టిన్ మార్టిన్ రాబోయే వారాల్లో భారత్‌లోని మీడియా, కస్టమర్ల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ టూరర్ అయిన DB12 ని ప్రదర్శిస్తోంది. న్యూ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో ఈ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారును లాంచ్ చేయనుంది. కాగా ఈ రోజు బెంగళూరులో అధికారికంగా DB12 ను ప్రదర్శించింది.

దేశంలో అల్ట్రా-లగ్జరీ ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంలో Aston Martin ముందంజలో ఉంది. సూపర్ టూరర్ DB12 డిజైన్, పనితీరు ఇంకా సరికొత్త ప్రమాణాలను సెట్ చేస్తూ గేమ్ ఛేంజర్‌గా మారడానికి సిద్ధంగా ఉంది. మెరుగైన పనితీరుతో పాటు హ్యాండ్లింగ్, డైనమిక్స్, బోర్డర్ డిజైన్, ఆకర్షణీయమైన ఇంటీరియర్, అధునాతన టెక్నాలజీతో DB12 ఆస్టన్ మార్టిన్‌కు మరింత గౌరవాన్ని తీసుకొచ్చింది.
కాగా ఆస్టన్ మార్టిన్ భారత మార్కెట్లో DB12 సూపర్ టూరర్ లాంచ్ అవ్వగా దీని ధర రూ. 4.59 కోట్లు (ఎక్స్-షోరూమ్). కాగా అంతర్జాతీయ మార్కెట్లో DB12ని మొట్టమొదటి సూపర్ టూరర్‌గా కంపెనీ పేర్కొంది. ఇక ఈ సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కారు డిజైన్, ఇంజిన్, పర్ఫామెన్స్‌ను ఈ కథనంలో మీరు తెలుసుకోవచ్చు.

DB12 సూపర్ టూరర్ యొక్క శక్తివంతమైన 4.0-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌ను Mercedes-AMG నుండి తీసుకున్నారు. ఇది 670bhp మరియు 800Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు శక్తి సరఫరా అవుతుంది.
ఆస్టన్ మార్టిన్ DB12 కేవలం 3.5 సెకన్లలో o నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ సూపర్ స్పోర్టస్ కారు గరిష్ఠ వేగం 325 km/h. DB12కి ముందు భాగంలో 6-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా 400mm డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో 4-పిస్టన్ కాలిపర్‌ల ద్వారా 360mm డిస్క్ బ్రేక్‌లను అమర్చింది.

ఆస్టన్ మార్టిన్ DB12 స్పోర్ట్స్ కారులో వెట్, GT, స్పోర్ట్, స్పోర్ట్స్ ప్లస్ మరియు individual డ్రైవింగ్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇంకా అధునాతన ADAS ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఫార్వార్డ్ కొలీజన్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్టాప్ & గో ఫంక్షన్, లేన్ డిపార్చర్ హెచ్చరికతో పాటు క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా లేన్ కీప్ అసిస్ట్ ఆటో హై బీమ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, డోర్ ఓపెన్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్ట్, డ్రైవర్ డ్రస్‌నెస్ డిటెక్షన్, 360˚ 3D యాంగిల్ వ్యూ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 21 అంగుళాల వీల్స్‌ను ఇందులో ఉపయోగించారు.

ఇక ఆస్టిన్ మార్టిన్ DB12 ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులో సీట్లు ప్యూర్ లెదర్‌తో తయారు చేశారు. ఆస్టిన్ మార్టిన్ ఆడియో సిస్టమ్ మరో ప్రత్యేకత. సీట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, లెదర్ సీట్ బెల్ట్ వంటి హై క్లాస్ ఫర్నీచర్‌తో ఇంటీరియర్‌ను చాలా హుందాగా తీర్చిదిద్దారు.



Click it and Unblock the Notifications








