Hyundai Grand i10 Nios: హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌పై రూ. 48,000 వరకు భారీ తగ్గింపు.. కొద్ది రోజులే ఛాన్స్

2023 సంవత్సరం ముగుస్తుండటంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు ఈ ఏడాది చివర్లో వివిధ కార్లపై భారీ తగ్గింపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)పై భారీ తగ్గింపు ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కొత్త కారు కొనుగోలు చేయాలనుకునేవారికి డిసెంబర్‌ నెల సరైన అవకాశం. ఇప్పటికే చాలా ప్రముఖ కంపెనీలు.. స్టాక్‌ను క్లియర్‌ చేసుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీసంస్థ హ్యుందాయ్‌.. దేశవ్యాప్తంగా తన డీలర్‌షిప్‌ల ద్వారా గ్రాండ్‌ i10 నియోస్‌పై రూ. 48,000 తగ్గింపును అందిస్తోంది.

Hyundai-Grand-i10-Nios

డిసెంబర్‌ నెలలో కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 Nios పై కస్టమర్లు మొత్తం రూ.48,000 తగ్గింపును పొందవచ్చు. మాన్యువల్ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.20,000 నగదు తగ్గింపును ప్రకటించింది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ. 10,000, కార్పొరేట్ ఆఫర్‌ కింద రూ. 3,000 ప్రయోజనాన్ని అందిస్తోంది.

హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్‌పై రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌తో పాటు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక CNG వేరియంట్‌లో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 3000 కార్పొరేట్‌ తగ్గింపును పొందవచ్చు.

Hyundai-Grand-i10-Nios

అయితే ఈ డిస్కౌంట్ ప్రయోజనాలు డిసెంబర్ నెలకు మాత్రమే వర్తిస్తాయి. డీలర్‌షిప్, స్టాక్ లభ్యత, మరిన్ని వివరాల కోసం సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించండి. ఈ తగ్గింపు ఆఫర్ అనేది రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారత మార్కెట్లో రూ. 5.84 లక్షల నుండి రూ. 8.51 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది.

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సిస్టమ్‌, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఇంకా పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.

Hyundai-Grand-i10-Nios

కొత్త హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), హిల్ అసిస్ట్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) మరియు ISOFIX చైల్డ్ సీట్ వంటి వివిధ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్జ్, ఆస్టా, 6-మోనోటోన్ ఇంకా 2-డ్యూయల్-టోన్ రంగులతో సహా 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 83 PS గరిష్ట శక్తిని మరియు 114 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది.

Hyundai-Grand-i10-Nios

ఇక హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ CNG వేరియంట్ కూడా అదే ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇది 69 PS పవర్ మరియు 95 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారు వేరియంట్‌లను బట్టి 16.0 - 18.0 kmpl మైలేజీని పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Sunday, December 24, 2023, 8:01 [IST]
English summary
Attractive offers on hyundai grand i10 nios up to rs 48000 in december 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+