Audi Q8 e-tron లగ్జరీ ఎలక్ట్రిక్ కారు విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌తో 600 కి.మీ రేంజ్.!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి తన కొత్త ఎలక్ట్రిక్ కారు Audi Q8 E-Tronను విడుదల చేసింది. ఈ కారు ఎస్‌యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రెండు వేరియంట్లు సహా 50, 55 ఆప్షన్లలో లభిస్తుంది. 95kWh లేదా 114kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. 114kWh బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 600 కి.మీ రేంజ్ అందిస్తుంది.
ఆడి ఎలక్ట్రిక్ కారు DC ఫాస్ట్ ఛార్జర్‌తో గరిష్ఠంగా 31 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేయగలదు. అదే ఆడి Q8 ఇ-ట్రాన్ SUV 22kW AC ఛార్జర్‌తో వస్తుంది. ఇది ఆరు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయగలదు. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తుంది.

ఈ కారు 55 వేరియంట్ డ్యూయల్ మోటార్ సెటప్‌ను కలిగి ఉంటుంది. 402bhp శక్తి, 664Nm టార్క్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు కేవలం 5.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ కారు గరిష్ఠ వేగం 200 kmph గా ఉంది.
ఈ కారు SUV మోడల్ 50, 55 వేరియంట్ల రేంజ్ 491 కి.మీ మరియు 582 కి.మీ ఇస్తుంది. అదే స్పోర్ట్‌బ్యాక్ 50, 55 వేరియంట్ వరుసగా 550 కి.మీ, 600 కి.మీ రేంజ్ ఇస్తుంది.ఈ కారు ప్రారంభ ధర రూ.1.137 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది.

ఆడి Q8 ఇ- ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, స్పోర్ట్‌బ్యాక్ మోడల్ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మోనోక్రోమ్ 2D ఎఫెక్ట్ బ్యాడ్జ్, లైట్లు.. LED హెడ్‌లైట్లకు కనెక్ట్ అయి ఉంటాయి. ఎస్‌యూవీ, స్పోర్ట్‌బ్యాక్ రెండు వేరియంట్లు 20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. ఆడి Q8 ఇ- ట్రాన్ ఫాంట్‌తో బ్లాక్ పిల్లర్‌ను కలిగి ఉంటుంది.
ఆడి కొత్త ఎలక్ట్రిక్ కారు లోపలి భాగం ట్రిపుల్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మొదటిది వర్చువల్ కాప్‌పిట్.. ఇది స్టీరింగ్ వెనుక ఉంటుంది. రెండోది 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, మూడవది 8.6 అంగుళాల యూనిట్. మల్టీజోన్ HVAC సిస్టమ్ సహా మరికొన్ని ఫీచర్‌లను నియంత్రించేందుకు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది.

ఈ కారు బ్యాంగ్ & ఒలుఫ్‌సెన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, 4- జోన్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్లు ఉంటాయి. ఆడి Q8 e-Tron కారు ఇంటీరియర్ మూడు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. ఓకాపి బ్రౌన్, పెరల్ బీజ్, బ్లాక్‌లో అందుబాటులో ఉంటుంది.
అలాగే కారు మొత్తం తొమ్మిది రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మదీరా బ్రౌన్, క్రోనోస్ గ్రే, గ్రేసియర్ వైట్, మైథోస్ బ్లాక్, ప్లాస్మా బ్లూ, సోనెరా రెడ్, మాగ్నెట్ గ్రే, సియామ్ బీజ్, మాన్‌హట్టన్ గ్రే రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








