ఆటో ఎక్స్‌పో 2023: రూ. 34.49 లక్షల వద్ద BYD Atto 3 స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఇది కేవలం 1200 మందికి మాత్రమే

ఆటో ఎక్స్‌పో 2023 వేదికగా BYD కంపెనీ తన అటో 3 ఎలక్ట్రిక్ SUV యొక్క ప్రత్యేక ఎడిషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ విడుదల్ చేసిన ఈ ఎలక్ట్రిక్ SUV ధర రూ. 34.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ స్పెషల్ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

BYD కంపెనీ విడుదల చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ కేవలం 1,200 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉంటుంది. అంటే ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ని కేవలం 1,200 మంచి కస్టమర్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లేటెస్ట్ SUV మంచి డిజైన్ కలిగి కొత్త కలర్ ఆప్సన్ పొందుతుంది. ఈ BYD Atto3 స్పెషల్ ఎడిషన్ ఇప్పుడు ఫారెస్ట్ గ్రీన్ కలర్ లో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని ORVM బ్లాక్ కలర్ పొందుతాయి.

రూ. 34.49 లక్షల వద్ద BYD Atto 3 స్పెషల్ ఎడిషన్ లాంచ్

ఈ స్పెషల్ ఎడిషన్ స్టైలిష్ లుకింగ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. రియర్ ప్రొఫైల్ లో వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ ఉంటుంది. దాని పైన బిల్డ్ యువర్ డ్రీమ్ అనే బ్యాడ్జ్ కూడా ఉంటుంది. కింది భాగంలో సిల్వర్ కలర్ చూడవచ్చు. మొత్తం మీద ఈ స్పెషల్ ఎడిషన్ స్పెషల్ అట్రాక్షన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.

కొత్త BYD Atto 3 ఎలక్ట్రిక్ SUV యొక్క స్పెషల్ ఎడిషన్ లో కొంత వరకు కాస్మొటిక్ అప్డేట్స్ ఉన్నప్పటికీ యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేదనే చెప్పాలి. కావున కొత్త BYD అటో 3 స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ SUV లోని ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రూ. 34.49 లక్షల వద్ద BYD Atto 3 స్పెషల్ ఎడిషన్ లాంచ్

ఇది పెద్ద 60.48 kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ SUV కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లవరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది చైనా బ్రాండ్ కారు అయినప్పటికీ మంచి పనితీరుని అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్‌ వంటి వాటిని కూడా అందిస్తుంది.

రూ. 34.49 లక్షల వద్ద BYD Atto 3 స్పెషల్ ఎడిషన్ లాంచ్

ఫీచర్స్ విషయానికి వస్తే, BYD Atto 3 స్పెషల్ ఎడిషన్ కూడా దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అదే 12.8-ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

ఇటీవల BYD Atto 3 కి నిర్వహించిన యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరింది. ఇందులో ఫ్రంట్ మరియు సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. అంతే కాకుండా బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 10:24 [IST]
English summary
Auto expo 2023 byd atto3 special edition launched price features details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+