కారెన్స్ అంబులెన్స్ & పోలీస్ వెహికల్ ఆవిష్కరించిన కియా మోటార్స్.. 2023 ఆటో ఎక్స్‌పోలో అందరి దృష్టి వీటిపైనే

సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ భారతదేశంలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2023 లో అందరిని దృష్టిని అమితంగా ఆకర్శించింది. కంపెనీ ఈ వీడిక మీద కియా కారెన్స్ అంబులెన్స్ మరియు పోలీస్ కార్ వెర్షన్లను ఆవిష్కరించింది. వీటిని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం.

కంపెనీ ఆవిష్కరించిన ఈ రెండు కార్లు కూడా పూర్తిగా అనుకూలీకరించబడ్డాయని స్పష్టంగా తెలుస్తోంది. కియా కారెన్స్ అంబులెన్స్ మీద ఎల్లో మరియు రెడ్ కలర్ గీతలను గమనించవచ్చు. అయితే పోలీస్ కార్ల మీద రెడ్ మరియు బ్లూ కలర్ డెకాల్స్ చూడవచ్చు. అయితే ఈ రెండు కూడా విరాట్ కలర్ లో ఉన్నాయి. అంబులెన్స్ మీద బ్లూ అండ్ రెడ్ లైట్స్ మరియు పోలీస్ కార్ల మీద కూడా ఈ లైటింగ్ సెటప్ చూడవచ్చు.

కారెన్స్ అంబులెన్స్ & పోలీస్ వెహికల్ ఆవిష్కరించిన Kia Motors

కియా కారెన్స్ అంబులెన్స్ వాహనాల వెనుక అంబులెన్స్ అని పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటుంది. అదే పోలీస్ వాహనం మీద వెనుక మరియు సైడ్ లో పోలీస్ అని పెద్ద అక్షరాలతో ఉండటం గమనించవచ్చు. కియా కారెన్స్ అంబులెన్స్ లోపల అనేక మార్పులకు గురైంది. ఇందులో మనకు కనిపించే కారు 7 సీటర్ అని తెలుస్తోంది. కానీ ఇందులో వెనుక ఉన్న సీట్లను తొలగించి స్ట్రెచర్ పట్టడానికి సరిపడే విధంగా తాయారు చేశారు.

అంతే కాకుండా పేషంట్ పక్కన కూర్చోవడానికి ఇక్కడ ఒక సీటు కూడా ఉంది. ఇందులో ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉండటం గమనించవచ్చు. ఈ అంబులెన్స్ పైన సాధారణ అంబులెన్సు మాదిరిగానే ఎమర్జెన్సీ లైట్ బార్ ఉంటుంది. దీనికి పెద్ద సైరన్ తో అనుసంధానించబడి ఉంటుంది. మొత్తం మీద కియా కారెన్స్ అంబులెన్స్ గా చాలా అద్భుతంగా మారిపోయింది.

కారెన్స్ అంబులెన్స్ & పోలీస్ వెహికల్ ఆవిష్కరించిన Kia Motors

ఇక కియా కారెన్స్ యొక్క పోలీస్ వెహికల్ విషయానికి వస్తే, ఇందులో ఒక రూఫ్-మౌంటెడ్ లైట్ బార్‌ ఉంటుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఇందులో బ్లూ మరియు రెడ్ కలర్ లైట్స్ ఉన్నాయి. వీటికి కూడా సైరన్ అనుసంధానించబడి ఉంటుంది. ఈ లైట్ బార్ సాధారణంగా ఇప్పుడు అందుబాటులో వున్న పోలీస్ వాహనాలకంటే కూడా ఆధునికంగా ఉండటం చూడవచ్చు. ఈ పోలీస్ వెహికల్ లో ఎమర్జెన్సీ కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి ఒక వాకీ టాకీ వంటిది కూడా అమర్చారు.

కియా కారెన్స్ పోలీస్ వాహనం మరియు అంబులెన్స్ యొక్క లోపల పెద్ద మార్పులు చేసినప్పటికీ వెలుపల దాదాపు సాని సాధారణ మోడల్ మాదిరిగానే అదే హెడ్ లైట్స్, టైల్ లైట్స్ వంటి వంటిని కలిగి ఉంటుంది. ఫీచర్స్ విషయానికీ వస్తే ఇందులో కూడా దాదాపు ఎటువంటి మార్పులు లేదనే తెలుస్తోంది. కియా కారెన్స్ అంబులెన్స్ వెహికల్ తో పోలిస్తే, పోలీస్ వెహికల్ లోపల పెద్దగా మార్పులు జరిగినట్లు అనిపించడం లేదు.

కారెన్స్ అంబులెన్స్ & పోలీస్ వెహికల్ ఆవిష్కరించిన Kia Motors

కియా కారెన్స్ అంబులెన్స్ మరియు పోలీస్ వాహనాల యొక్క డిజైన్ మరేమియు ఫీచర్స్ మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే కంపెనీ ఇందులో ఉన్న ఇంజిన్ గురించి ప్రస్తావించలేదు. బహుశా కియా కారెన్స్ లో వినియోగిస్తున్న అదే ఇంజిన్ ఉపయోగించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. అయితే దీని గురించి కంపెనీ ఎలాంటి సమాచారం అందించలేదు. బహుశా దీని గురించి కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 12, 2023, 21:30 [IST]
English summary
Auto expo 2023 kia carens ambulance police car telugu details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+