ఆటో ఎక్స్‌పో 2023: టాటా అవిన్య గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ చూడండి
టాటా మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పో వేదికగా 'అవిన్య కాన్సెప్ట్ EV' ప్రదర్సించింది. కంపెనీ ఈ ఆధునిక మోడల్ ని 2022 ఏప్రిల్ నెలలోనే వెల్లడించింది. ఈ టాటా అవిన్య కాన్సెప్ట్ EV గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
నిజానికి టాటా మోటార్స్ ప్రపంచ మార్కెట్లో పరిచయం చేసిన జనరేషన్ 3 ఎలక్ట్రిక్ వాహనాల్లో 'అవిన్య' మొదటిది చెప్పవచ్చు. 2022 లోనే వెల్లడైన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఆటో ఎక్స్‌పోలో కూడా అందరి దృష్టిని ఆకర్శించింది. అవిన్య అనే పేరును టాటా మోటార్స్ సంస్కృతం నుండి సేకరించింది, ఈ పేరుకి అర్థం ఆవిష్కరణ అని కంపెనీ గతంలోనే తెలిపింది. ఇది చాలా వరకు కొత్త డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది.

టాటా మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం కంపెనీ తయారు చేసిన సరికొత్త స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తి 2025 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ కొత్త జనరేషన్ 3 ఎలక్ట్రిక్ వెహికల్ 500 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ఇదివరకే తెలిపింది. కావున ఇది తప్పకుండా మార్కెట్లో విజయవంతమైన మోడల్ గా అవతరించనుంది.
టాటా అవిన్య 4.3 మీటర్ల పొడవును కలిగి ఉండి, బయటి వైపు నుండి చాలా మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, టాటా అవిన్య ఎక్కువగా లోపలి భాగం నుండి డిజైన్ చేయబడిందని కంపెనీ పేర్కొంది. అంటే, దీని డిజైన్ మరియు ఫీచర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఇంటీరియర్ లో కనిపిస్తాయి. ఇవన్నీ చాలా ఆధునికంగా ఉంటాయి. డిజైన్ పరంగా కూడా ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది.

టాటా అవిన్య T షేప్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు కలిగి ఉంటుంది. ఇది ఈ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారు ముందు భాగం అంతటా విస్తరించినట్లు ఉంటుంది. ఈ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్ల అంచుల వద్ద సొగసైన ఎల్ఈడి హెడ్‌లైట్‌ల సెట్ కనిపిస్తుంది. టాటా అవిన్యలో భారీగా షేప్ చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు వాహనం ముందు భాగంలో ఉండే పెద్ద బ్లాక్ ప్యానెల్‌లు ముందు డిజైన్‌ను డామినేట్ చేస్తాయి. ఈ ప్యానెల్‌లో అనేక ఎల్ఈడి లైట్లు కూడా ఉంటాయి.
టాటా అవిన్య సైడ్ ప్రొఫైల్ లో పక్కపక్కనే ఉండే రెండు డోర్లు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఖరీదైన రోల్స్ రాయిస్ వంటి కార్లలో కనిపించే సూసైడ్ డోర్స్ ఇందులో హైలైట్‌గా నిలుస్తాయి. ఇక ఇక్కడ మనల్ని ఆకట్టుకునే మరొక అంశం దాని స్పోర్టీ అల్లాయ్ వీల్స్. ఈ అల్లాయ్ వీల్స్ అవిన్య కాన్సెప్ట్ కారు యొక్క అంచులలో అమర్చబడి ఉంటాయి. కాబట్టి, ఇది ముందు మరియు వెనుక భాగంలో అతి తక్కువ ఓవర్‌హాంగ్‌లను కలిగి ఉంటుంది.

టాటా అవిన్య లో రెండు చివరి అంచులలో టైర్లు అమర్చబడి ఉండటం వల్ల ఎక్కువ వీల్‌బేస్ లభిస్తుంది. ఈ కారణంగానే క్యాబిన్ లోపల ఎక్కువ ఇంటీరియర్ స్పేస్ లభిస్తుంది. టాటా అవిన్య కారులో బి-పిల్లర్ ఉండదు కాబట్టి, ఇది మొత్తం ఇంటీరియర్‌ను ఒకేసారి చూపించేందుకు కోచ్ డోర్లను కలిగి ఉంటుంది. ఈ వెడల్పాటి డోర్ల వలన కారు లోపలకి ప్రవేశించడం మరియు బయటకు రావడం చాలా సులభంగా ఉంటుంది.
టాటా అవిన్య రియర్ ప్రొఫైల్ లో T షేప్ లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణంగా ఉంటుంది. ఈ టైల్‌లైట్ వెంటనే మీ దృష్టిని ఆకర్షిస్తుంది మరియు టైల్‌లైట్‌లు స్పాయిలర్ ఎలిమెంట్‌ను ఏర్పరుస్తాయి. ఇవి అవిన్య యొక్క ఓవరాల్ డిజైన్ నైపుణ్యాన్ని పెంచుతుంది. కాన్సెప్ట్ కారు వెనుక భాగం బంపర్ విభాగంలోకి వంగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. మొత్తం మీద టాటా అవిన్య డిజైన్ చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, టాటా అవిన్య లోపలి వైపు ఎలాంటి బటన్లు మరియు భారీ డిస్‌ప్లే యూనిట్లు కనిపించవు. అయితే ఇందులో ఆధునిక టెక్నాలజీ ఉపయోగించబడింది. ఈ కాన్సెప్ట్ ఈవీ ముందు వైపున రెండు పెద్ద వ్యక్తిగత సీట్లు మరియు వెనుక వైపున విశాలమైన మరియు చాలా సౌకర్యవంతమైన బెంచ్ టైప్ సీట్స్ ఉంటాయి. ఇందులోని అన్ని సీట్లకు సౌండ్ బార్ స్టైల్ స్పీకర్‌లు అమర్చబడి ఉంటాయి.
టాటా అవిన్య డ్యాష్‌బోర్డ్ అంతా చాలా ప్లెయిన్‌గా కనిపిస్తుంది. సెంట్రల్ ఏసి టైప్ సిస్టమ్ ఇందులో మరొక అదనపు ఆకర్షణంగా ఉంటుంది. టాటా అవిన్య స్థిరమైన మూలాధారాల నుండి తయారు చేయబడిన అప్‌హోలెస్ట్రీని కలిగి ఉంటుంది. దానితో పాటుగా ఇందులో అనేక ఇతర ఫీచర్లు మరియు లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. టాటా అవిన్య గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








