ప్రపంచ దేశాలకు వేదికగా భారత్.. 2023 ఆటో ఎక్స్‌పో గురించి ఆసక్తిమైన విషయాలు

కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత భారతదేశంలో జరుగుతున్న '2023 ఆటో ఎక్స్‌పో' ప్రారంభం కావడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. ఇందులో ప్రపంచంలోని చాలా దేశాల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ సారి జరగనున్న 16 వ ఆటో ఎక్స్‌పో గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో జరిగే ప్రదేశం:

ఈ 16 వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పో రేపు ప్రారంభం కానుంది. నిజానికి రేపు, ఎల్లుండి (జనవరి 11 వ మరియు 12 వ తేదీలు) మీడియా కోసం కేటాయించబడతాయి. ఈ 2023 ఆటో ఎక్స్‌పో గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో జరగనున్నట్లు ఇప్పటికే అందరికి తెలుసు. ఆ తరువాత సందర్శకుల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అనేక కొత్త మోడల్స్ అడుగుపెట్టనున్నట్లు కూడా సమాచారం.

2023 ఆటో ఎక్స్‌పో గురించి ఆసక్తిమైన విషయాలు

ఆటో ఎక్స్‌పో 2023 లో పాల్గొనే దేశాలు:

సుదీర్ఘ విరామం తరువాత జరుగుతున్న 16 వ మరియు 2023 ఆటో ఎక్స్‌పోలో ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, పోలాండ్, దక్షిణ కొరియా మరియు యూకే వంటి 15 దేశాలు పాల్గొనే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ 15 దేశాలకు సంబంధించిన 800 కంపెనీలు ఈ సంవత్సరం జరగనున్న ఆటో ఎక్స్‌పో ఎగ్జిబిషన్‌లో పాల్గొంటాయని 'ఆటోమోటీవ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చురీర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (ACMA) తెలిపింది.

2023 ఆటో ఎక్స్‌పోలో పాల్గొనే కంపెనీలు:

భారతదేశంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభం కానున్న 2023 ఆటో ఎక్స్‌పోలో అనేక విదేశీ కంపెనీలతో పాటు భారతీయ కంపెనీలు కూడా పాల్గొననున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పోలో 'టాటా మోటార్స్' తన టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడంతో పాటు హారియర్ ఫేస్‌లిఫ్ట్ మరియు సఫారి ఫేస్‌లిఫ్ట్‌ వంటి వాటిని ప్రదర్శించనుంచి. అదే సమయంలో 'లైగర్ మొబిలిటీ' తన సెల్ఫ్ బ్యాలెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ప్రదర్శించనుంది.

భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 16 వాహనాలను ప్రదర్శించే అవకాశం ఉంది. ఇందులో ఒకటి జిమ్నీ 5 డోర్ వెర్షన్. దీనితో పాటు కంపెనీ బాలెనో ఆధారిత క్రాస్ఓవర్ మరియు ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ వంటి వాటిని కూడా ప్రదర్శిస్తుంది. హ్యుందాయ్ కంపెనీ హ్యుందాయ్ స్టార్‌గేజర్ MPV మరియు కాస్పర్ మైక్రో SUV వంటి వాటితో పాటు ఐయోనిక్ 5 విడుదల చేయనుంది.

కియా మోటార్స్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మరియు సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ వంటి వాటిని ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. MG మోటార్ కూడా హెక్టర్ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల చేయనుంది. టయోటా కంపెనీ కొత్త ఫార్చ్యూనర్ ను ప్రదర్శించనుంది, అదే సమయంలో లెక్సస్ కంపెనీ కూడా తన ఆధునిక మోడల్స్ ఈ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. ఇవి మాత్రమే కాకుండా చాలా చిన్న కంపెనీలు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

2023 ఆటో ఎక్స్‌పోలో పాల్గొనని కంపెనీలు:

2020 తరువాత జరుగుతున్న ఈ 2023 ఆటో ఎక్స్‌పోలో కొన్ని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు పాల్గొనే అవకాశం లేదు. ఇందులో హీరో మోటోకార్ప్, హోండా మోటార్సైకిల్, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీలు ఉన్నాయి. అంతే కాకుండా చాలా మంది తయారీదారులు వివిధ కారణాల వల్ల ఈ ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నట్లు సమాచారం. ఈ ఆటో ఎక్స్‌పోలో చైనా కంపెనీలు కూడా పాల్గొనే అవకాశం లేదు.

2023 ఆటో ఎక్స్‌పోలో 40 కి పైగా దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ప్రభుత్వ అధికారులు, మీడియాతో సహా దాదాపు ఒక లక్ష మందికి పైగా సందర్శకులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సారి జరగనున్న ఈ ఆటో ఎక్స్‌పోలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలే కనిపించనున్నాయి. కావున 2023 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎడిఎఎస్, బయోఫ్యూయెల్ & ఫ్లెక్స్ ఫ్యూయల్ బేస్డ్ ఇంజిన్ టెక్నాలజీలు, వెహికల్ సేఫ్టీ టెక్నాలజీ మొదలైనవన్నీ కూడా ఇక్కడ ప్రతి బింబిస్తాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి మా డ్రైవ్‌స్పార్క్ బృందం సిద్ధంగా ఉంది. 2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలయ్యే మరియు ఆవిష్కరించబడే వాహనాలను గురించి తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

More from DriveSpark

Article Published On: Tuesday, January 10, 2023, 16:15 [IST]
English summary
Auto expo 2023 venue participations details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+