డ్రైవర్‌ అవసరం లేని వాహనం 'zPod'.. భారత్‌లో తొలిసారిగా ఆవిష్కరణ..!!

మనం ఇటీవల కాలంలో డ్రైవర్‌ అవసరం లేని వాహనాల ఆవిష్కరణపై అప్పుడప్పుడూ వింటున్నాం. టెక్నాలజీ మరియు సెన్సార్ల సాయంతో ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు సెల్ఫ్‌ డ్రైవింగ్ లేదా అటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ కలిగిన వాహనాల రూపకల్పనపై దృష్టిపెడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లోనే ఇటువంటి ఆవిష్కరణ జరుగుతుండగా.. బెంగళూరుకు చెందిన స్టార్ట్‌ఆప్‌ అటానమస్‌ డ్రైవింగ్‌ వాహనాన్ని ఆవిష్కరించింది.

బెంగళూరుకు చెందిన అటానమస్‌ డ్రైవింగ్‌ స్టార్ట్‌ అప్‌ Minus Zero.. zPod వాహనాన్ని ఆవిష్కరించింది. భారత్‌లోనే zPod తొలి అటానమస్‌ వాహనం లేదా సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కారుగా సంస్థ పేర్కొంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా ఈ వాహనం డ్రైవింగ్‌ చేస్తుందని మైనస్‌ జీరో సంస్థ తెలిపింది.

autonomous driving car zPod

బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్‌ను తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను మరియు మరణాలను తగ్గించడమే ఈ zPod వాహనం ఉద్దేశమని మైనస్‌ జీరో సంస్థ తెలిపింది. నగరంలో ప్రతి రోజు ట్రాఫిక్‌లో సుమారు 2.5 లక్షల లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుందని మైనస్‌ జీవో సీవోవో గుర్సిమ్రాన్‌ కల్రా తెలిపారు. సంవత్సరానికి దేశంలో 22 బిలియన్ల నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇతర అటానమస్‌ డ్రైవింగ్‌ వాహనాల మాదిరిగా zPod.. LIDAR (లైట్‌ డిటెక్షన్‌ అండ్ రేంజింగ్‌) టెక్నాలజీని ఉపయోగించదని, కానీ ఈ వాహనం చుట్టు ఆరు ‌‌కెమెరాలు ఉంటాయని సంస్థ తెలిపింది. వాహనం ముందు, వెనుక రెండు కెమెరాలు మరియు వాహనం చుట్టు పక్కల మరో నాలుగు కెమెరాలు ఉంటాయని మైనస్‌ జీరో సంస్థ వివరించింది.

autonomous driving car zPod

zPod వాహనానికి ఉన్న కెమెరాలు.. సెన్సార్లుగా పనిచేస్తాయని వాటి ద్వారానే రోడ్లపై అడ్డంకులను దాటగలదని మైనస్‌ జీరో సంస్థ తెలిపింది. ఈ అటానమస్‌ డ్రైవింగ్ టెక్నాలజీని ఎలక్ట్రిక్‌ వాహనం లేదా పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలకు కూడా అందించవచ్చని తెలిపింది. అయితే వాహనం అటానమస్‌ టెక్నాలజీని సపోర్ట్ చేయాల్సి ఉంటుందని వివరించింది.

అటానమస్‌ డ్రైవింగ్‌ వాహనం zPod తనకున్న కెమెరాల సెటప్‌తో ఎటువంటి బౌగోళిక, వాతావరణ పరిస్థితుల్లోనైనా ప్రయాణం చేయగలదని సంస్థ మైనస్‌ జీరో తెలిపింది. ఈ వాహనం డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఎటువంటి మానవ ప్రవేయం అవసరం లేదని స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతోనే డ్రైవింగ్‌ చేస్తుందని పేర్కొంది.

autonomous driving car zPod

zPod అటానమస్‌ డ్రైవింగ్‌ వాహనంలో నలుగురు ప్రయాణం చేయవచ్చు. ఇతర కార్ల మాదిరిగా ఎటువంటి నియంత్రణ వ్యవస్థలు ఉండవు. ఈ వాహనం తనకున్న కెమెరా సూట్‌ సెటప్‌తో మరియు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా నిర్ణయం తీసుకొని డ్రైవింగ్‌ చేస్తుంది. కెమెరా సూట్‌ను వినియోగించడం వల్ల ఈ వాహనం ధర భారీగా తగ్గుతుందని సంస్థ వివరించింది.

భవిష్యత్‌లో ఈ వాహనం క్యాంపస్‌ మొబిలిటీకి పరిమితం చేయబడుతుందని మైనస్‌ జీరో అభిప్రాయపడింది. అంటే రోడ్లపై కాకుండా టెక్‌ పార్క్‌లు, నివాస ప్రాంతాలు, ఎడ్యుకేషనల్‌ క్యాంపస్‌లో zPod వాహనాన్ని ఉపయోగించవచ్చని పేర్కొంది. మైనస్‌ జీరో.. ఆటోమొబైల్‌ తయారీ సంస్థ కాదని, అటానమస్‌ డ్రైవింగ్ (సెల్ఫ్‌ డ్రైవింగ్‌) టెక్నాలజీ అందించే సంస్థ మాత్రమేనని తెలిపింది. ADAS (Advanced Driver Assistance system)ను ఉపయోగించే ఇతర కంపెనీలకు సాయం చేస్తుందని పేర్కొంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా పనిచేసే అటానమస్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ కలిగిన zPod కేవలం ప్రదర్శన మాత్రమేనని.. ఈ వాహనాన్ని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశం తమకు లేదని సంస్థ మైనస్‌ జీరో తెలిపింది. ఇటువంటి వాహనాల తయారీపై దృష్టిపెడుతున్న సంస్థలకు zPod ఒక ప్రేరణ మాత్రమేనని పేర్కొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 5, 2023, 16:44 [IST]
English summary
Bangalore firm minus zero unveils autonomous driving vehicle zpod
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+