సీనియర్ సిటిజన్లకు కార్లు కొనుగోలు చేస్తున్నారా.. ఈ వాహనాలైతే చాలా సేఫ్..!
కొంత మంది సీనియర్ సిటిజన్ల కార్లు నడిపేందుకు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ వారి వయసు రీత్యా అన్ని కార్లును వారు డ్రైవింగ్ చేయలేదు. అలాంటి వారికి ఎలాంటి కార్లు కొనుగోలు చేయాలి, వారి కార్లలో ఏఏ సౌకర్యాలు ఉండాలి. ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్ ఏ వేరియంట్ కొనుగోలు చేయాలనే దానిపై తీవ్రంగా ఆలోచిస్తుంటాం.
సీనియర్ సిటిజన్ల కోసం కార్లు కొనుగోలు చేసేటప్పుడు వాహనంలోని సౌకర్యాలు, ఇతర భద్రతా ఫీచర్లను తనిఖీ చేయడం చాలా ముఖ్యం. కొత్తగా కొనుగోలు చేస్తున్న కార్లలో వారికి అవసరమయ్యే నియంత్రణ వ్యవస్థ సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కార్లను వీరికి కొనుగోలు చేయడం చాలా ఉత్తమం.

చాలా మంది సీనియర్ సిటిజన్లు కార్లను నడిపేందుకు ఆసక్తి చూపిస్తారు. అటువంటి వారికి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్ కలిగిన కార్లు చాలా సౌకర్యంగా ఉంటాయి. ఎంత ట్రాఫిక్‌లోనైనా ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. అటువంటి ఆటోమేటిక్ కార్ల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
సెడాన్‌లు, SUVలు నడపడం కంటే హ్యాచ్‌బ్యాక్‌లు డ్రైవింగ్ చేయడం కొంత సులభంగా ఉంటుంది. హ్యా్చ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ సీనియర్ సీటిజన్ల కోసం కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు కార్లు ఆటోమేటిక్ వేరియంట్‌లను కలిగి ఉంటాయి. కాంపాక్ట్‌గా కూడా వస్తాయి. మరియు నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.

హ్యాచ్‌బ్యాక్ కార్లలో డ్రైవింగ్ సౌకర్యవంతంగా ఉంటుంది. పవర్ స్టీరింగ్, పుష్ స్టార్ట్ బటన్‌లతో వస్తాయి. ఈ కార్లలో భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు ABS వ్యవస్థ కూడా ఉంటుంది. హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కారణంగా ఎలాంటి రోడ్లపై నైనా సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు.
ఈ కార్లు మెరుగైన మైలేజ్‌ను ఇస్తాయి. మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్ర్కీన్లు ఉపయోగించడం చాలా సులభం మరియు టచ్‌స్క్రీన్ నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ VXI AGS వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ధర రూ.7.45 లక్షలు (ఎక్స్‌షోరూం). హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మాగ్నా AMT, నియోస్ స్పోర్ట్స్ AMT రెండు వేరియంట్లు.. ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. మాగ్నా AMT ధర రూ.7.28 లక్షలు, స్పోర్ట్స్ వేరియంట్ ధర రూ.7.79 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్ VXI AGS వేరియంట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వెనుక పార్కింగ్ కెమెరాలను వంటి సౌకర్యాలు లేవు. అయితే ఈ కారు 22.56కkmpl మైలేజీని ఇస్తుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 మాత్రం బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. కానీ రివర్స్ పార్కింగ్ కెమెరాలు, సెన్సార్లను కలిగి లేదు. హ్యుందాయ్ రెండు వేరియంట్లు 21kmpl మైలేజీని ఇస్తాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








