కారు కొనుగోలు చేస్తున్నారా.. రూ.6 లక్షల ధర కలిగిన కార్లపై ఓ లుక్కేయండి!

భారత్‌లో పండుగ సమయంలో అధిక శాతం వాహన విక్రయాలు జరుగుతుంటాయి. అందువల్ల వాహన తయారీ సంస్థ కూడా తమ ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. రూ.6 లక్షల ధర కలిగిన కొన్ని ఉత్తమ కార్ల జాబితా మీకోసం.

పండుగ సీజన్‌లో ఈ కార్లపై ఎక్స్చేంజ్ ఆఫర్‌, కార్పొరేట్‌ బోనస్‌ సహా ఇతర ఆఫర్‌లపై రూ.50,000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్లు ప్రాంతాలు, డీలర్‌ పైకూడా ఆధారపడి ఉంటుంది. వాహన తయారీ సంస్థలను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

maruti s presso

మారుతి సుజుకి S ప్రెస్సో : మారుతి సుజుకి S ప్రెస్సో మంచి స్టైలిష్‌ లుక్‌ను కలిగి ఉంటుంది. మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కారు 1.0 లీటర్ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 68PS శక్తి, 90Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT జతచేయబడుతుంది.

7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌, ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్టు చేస్తుంది. కీలెస్‌ ఎంట్రీ, డ్యూయల్‌ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్‌ సెన్సార్లు, EBDతో కూడిన ABS- యాంటీ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఉన్నాయి. VXi ప్లస్‌ ధర రూ.6.10 లక్షలు, VXi (O) AMT వేరియంట్‌ రూ.6.39 లక్షలుగా ఉంది. LXi S- CNG రూ.6.55 లక్షలుగా ఉంది.

maruti celerio

మారుతి సుజుకి సెలెరియా : మారుతి సుజుకి సెలెరియో పరిమాణం పరంగా చిన్న హ్యాచ్‌బ్యాక్‌గా వస్తుంది. ఈ కారు సెలెరియో 1.0 లీటర్‌ ఇంజిన్‌ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 67PS శక్తి, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్‌ మాన్యువల్‌ లేదా 5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. CNG వెర్షన్‌తో తక్కువ అవుట్‌పుట్‌ని ఇ‌స్తుంది. ఈ వెర్షన్‌లో 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మారుతి సెలెరియో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌, పుష్‌ బటన్‌ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ, డ్యూయల్‌ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, రియర్‌ పార్కింగ్ సెన్సార్లు మరియు EBDతో కూడిన ABS వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉన్నాయి. మారుతి సెలెరియో LXi ధర రూ.5.9 లక్షలు, VXi ధర రూ.6.45 లక్షలుగా ఉంది.

maruti wagon R

మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌ : ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 67PS శక్తి, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్‌ మాన్యువల్ లేదా 5-స్పీడ్‌ AMT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. మరో 1.2 లీటర్‌ k12 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 90PS శక్తి, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కారు CNG ఎంపికతోనూ లభిస్తుంది. ఈ ఇంజిన్‌ 57PS శక్తి, 82Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. వ్యాగన్‌ఆర్‌ రెండు వేరియంట్ల ధరలు రూ.6.13 లక్షలు, రూ.6.61 లక్షలుగా ఉంది. 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, రిమోట్‌ కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్‌ మౌంటెడ్‌ కంట్రోల్‌, పవర్డ్‌ విండోస్‌, రియర్‌ పార్కింగ్ సెన్సార్లు ఫీచర్లను కలిగి ఉంటుంది.

renault kwid

రెనాల్ట్‌ క్విడ్‌ క్లైంబర్ : పండుగ సీజన్ సందర్భంగా ఈ రెనాల్ట్‌ క్విడ్‌ క్లైంబర్ కారును రూ.50000 తగ్గింపు ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ కారు 1.0 లీటర్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజిన్‌ 67bhp శక్తి, 91Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ.6.58 లక్షలుగా ఉంది.

టాటా టియాగో : పండుగ సీజన్‌ సందర్భంగా టాటా టియాగో XT(O) వేరియంట్‌పై సుమారుగా రూ.70 వేల తగ్గింపును పొందవచ్చు. ఈ కారు 4 స్టార్‌ క్రాష్‌ టెస్ట్‌ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ధర రూ.6.66 లక్షలుగా ఉంది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర వాహనాలతో పోలిస్తే ఈ వేరియంట్ మంచి పనితీరును కనబరుస్తుంది.

tata tiago

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 24, 2023, 13:46 [IST]
English summary
Best cars around rs 6 lakh on road price in festival season 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+