బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు కొనాలనుకుంటే వీటిపై ఓ లుక్కేయండి.. ధర రూ. 6 లక్షల లోపే.!!
భారత మార్కెట్లో తరచూ కొత్త మోడల్ కార్లు వస్తూనే ఉంటున్నాయి. సాధారణ కార్ల నుంచి మొదలుకొని ప్రీమియం కార్ల వరకూ వినూత్న మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనుగోలు చేయాలని మధ్య తరగతి ప్రజలు అనుకుంటారు. అయితే ఏ కారు కొనాలనే విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు.
ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సొంతంగా ఓ కారు ఉండాలని అనుకుంటారు. పెరుగుతున్న అవసరాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు కారు నిత్యావసరంగా మారింది. ఈ నేపథ్యంలో కార్ల ధరలు కూడా పెరుగుతుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. అందుకే ఇక్కడ మీకు రూ. 6 లక్షలు అంతకంటే తక్కువ ధరలో లభించే కొన్ని కార్ల వివరాలు అందిస్తున్నాం.

మారుతి సుజుకి ఆల్టో కె10: మారుతి సుజుకి నుంచి సరసమైన ధరలో అందుబాటులో ఉన్న కారు Alto K10. మార్కెట్లో ఆల్టో కె10 రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్ మరియు CNG వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఆల్టో కె10 పెట్రోల్ వేరియంట్ 24.90 kmpl మైలేజ్‌ని, CNG వేరియంట్ 33.85 km/kg మైలేజీని అందిస్తుంది. ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీలెస్ ఎంట్రీ అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్సింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్‌ల వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

మారుతి సుజుకి స్విఫ్ట్: భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉన్న కారు మారుతి సుజుకి Swift. వేరియంట్లను బట్టి ధర రూ .5.99 లక్షల నుండి రూ. 9.03 లక్షల వరకూ ఉంది. మారుతి స్విఫ్ట్ పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
మారుతి సుజుకి స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ 22.56 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. కాగా CNG వేరియంట్ 30.90 km/kg మైలేజ్‌ను అందిస్తుంది. ఇందులో ఫీచర్లను పరిశీలిస్తే.. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా పలు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో: Maruti Suzuki S Presso.. మార్కెట్లో ఈ కారును రూ. 4.26 లక్షల నుండి రూ.6.12 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో పెట్రోల్, CNG ఇంజిన్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో.. మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో జత చేయబడి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది గరిష్ఠంగా 25.30 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. కాగా ఎస్ ప్రెస్సో CNG వేరియంట్ 32.73 km/kg మైలేజ్‌ని అందిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో: దేశీయ మార్కెట్లో Maruti Suzuki Celerio ధర రూ.5.37 లక్షల నుండి రూ.7.14 లక్షల ధరలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు పెట్రోల్, CNG ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ 26 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. CNG వేరియంట్ 35.6 km/kg వరకు మైలేజ్‌ను అందిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్: హ్యుందాయ్ నుంచి మార్కెట్లో సరసమైన ధరలో అందుబాటులో ఉన్న కారు హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్. ధర రూ.5.84 లక్షల నుండి రూ.8.51 లక్షల వరకూ ఉంది. మీరు పెట్రోల్ మరియు CNG ఇంజిన్ ఆప్షన్లలో మీకు అనుకూలమైనది ఎంచుకోవచ్చు. పెట్రోల్ వేరియంట్ 21 kmpl మైలేజ్, CNG వేరియంట్ 28 km/kg మైలేజ్‌ను ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్: భారత మార్కెట్లో సరసమైన ధరలో లభించే మరో కారు Renault Kwid. ధర రూ. 4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో జత చేయబడి ఉంటుంది. లీటర్‌కు 22 kmpl మైలేజ్‌ని అందిస్తుంది.

పైన పేర్కొన్న మారుతి సుజుకి ఆల్టో కె10, స్విఫ్ట్, ఎస్-ప్రెస్సో, సెలెరియో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, రెనాల్ట్ క్విడ్ కార్లు ఒకదానికొకటి ఆకర్షణీయంగా, అధునాతన ఫీచర్లతో ఉంటాయి. మీ బడ్జెట్ ధరలో, పనితీరు ఆధారంగా ఖచ్చితమైన కార్లను ఎంచుకోండి. ముందుగా సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించడం ద్వారా ఆఫర్లపై మరింత సమాచారం పొందవచ్చు.


Click it and Unblock the Notifications








