Best Mileage CNG Cars రూ.10 లక్షల లోపు అధిక మైలేజ్ ఇచ్చే కొత్త CNG కార్లు..

దేశంలోని పెట్రోల్‌ కార్లతో పోలిస్తే, సీఎన్‌జీ కార్లు అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి. వినియోగదారులు ఎక్కువగా సీఎన్‌జీ కార్లపైనే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మీరు తక్కువ ధరలో అధిక మైలేజీని అందించే కారు కోసం చూస్తున్నట్లయితే, రూ.10 లక్షల లోపు ప్రముఖ కంపెనీల CNG కార్ల వివరాలు ఇక్కడ మీకోసం.

మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ SUVలలో ఒకటైన ఫ్రాంక్స్‌(Fronx)ని గత ఏప్రిల్‌లో రూ. 7.46 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విడుదల చేసింది. ఇటీవల దీనిని సీఎన్‌జీ పవర్డ్‌ వెర్షన్‌గా విడుదల చేసింది. ఈ కారు సిగ్మా మరియు డెల్టా సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వరుసగా రూ. 8.42 లక్షల నుంచి రూ. 9.28 లక్షల ఎక్స్-షోరూమ్ ధరల్లో కొనుగోలు చేయవచ్చు.

Best-Mileage-CNG-Cars

CNG పవర్డ్ మారుతి సుజుకి ఫ్రాంక్స్ SUV యొక్క పనితీరు విషయానికొస్తే ఇది 1.2 లీటర్ న్యాచురల్లీ అస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో 75 hp గరిష్ఠ శక్తి వద్ద 98.5 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. మైలేజీ 28.51 km/kg (ARAI) అందిస్తుంది.

మారుతీ సుజుకి గత మార్చిలో భారతీయ మార్కెట్లో బ్రెజ్జా యొక్క CNG వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కారు రూ.9.24 లక్షల నుంచి రూ.12.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (CNG) గరిష్ఠంగా 85.5 hp శక్తి వద్ద 121 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో అందుబాటులో ఉన్న మారుతి సుజుకి బ్రెజ్జా కారు 25.51 km/kg (ARAI) మైలేజీని అందిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే, మారుతి సుజుకి బ్రెజా టచ్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో సహా డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇటీవల భారత మార్కెట్లోకి ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని రూ.5.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని S మరియు SX వేరియంట్‌లు CNG ఎంపికతో లభిస్తాయి. ఈ వేరియంట్లు వరుసగా ధర రూ. 8.24 లక్షల నుంచి రూ. 8.97 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ Exter మైక్రో SUV (CNG) పనితీరు గురించి చూసుకుంటే, దాని 1.2 లీటర్ డబుల్‌-ఇంధన పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 67 hp శక్తి వద్ద 95 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో వస్తుంది. ఈ కారు యొక్క CNG వేరియంట్లు 27.1 km/kg (ARAI) మైలేజీని అందిస్తాయి.

మొత్తం మీద, మారుతి సుజుకి ఫ్రాంక్స్‌, బ్రెజ్జా మరియు హ్యుందాయ్ ఎక్స్‌టర్ దేశంలో అత్యంత చౌకైన CNG కార్లు. ఇవి అధిక మైలేజీని కూడా అందిస్తాయి. ఈ క్రమంలో మీరు కొత్త సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాలనుకుంటే అందుబాటులో ఉన్న అధునాతన ఫీచర్‌లతో, మీ బడ్జెట్‌లో సరిపోయే కారును ఎంచుకోండి.

Article Published On: Thursday, July 20, 2023, 10:00 [IST]
English summary
Best mileage cng suvs india under rs 10 lakh maruti fronx to hyundai exter ful details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+