డీజిల్‌ కారును కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అధిక మైలేజీ ఇచ్చే SUVలు ఇవే!

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో SUVలకు క్రేజ్‌ అంతా ఇంతా కాదు. యువత సహా ఎక్కువ మంది కస్టమర్లు ఎస్‌యూవీల్లో ప్రయాణానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అయితే సాధారణంగా డీజిల్‌ ఇంజిన్ SUVలు పెట్రోల్‌ వేరియంట్‌ SUVల కంటే మెరుగైన మైలేజీని ఇస్తాయి.

మైలేజీ సహ ఇతర కారణాల వల్ల దేశంలో డీజిల్ కార్లకు ఆదరణ ఎక్కువగా ఉంది.ముఖ్యంగా కార్లను కొనుగోలు చేసే సమయంలో డిజైన్‌, భద్రతా ఫీచర్లతోపాటు మైలేజీకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమ డీజిల్‌ ఎస్‌యూవీల (Best Mileage Diesel SUVs) జాబితా మీకోసం.

kia sonet

కియా సోనెట్‌ : కియో సోనెట్‌ (kia Sonet) మంచి మైలేజ్‌ ఇచ్చే డీజిల్‌ SUVలల్లో ఒకటిగా ఉంది. ఈ కారు 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 115 hp శక్తి మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, iMT ఆప్షన్‌తో వస్తుంది. ఈ కారు 24.1kmpl మైలేజీని అందిస్తుంది.

టాటా నెక్సాన్‌ : టాటా నెక్సాన్ (Tata Nexon) భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అధిక మైలేజీ ఇచ్చే వాహనాల్లో రెండవదిగా ఉంది. ఈ SUV 1.5 లీటర్ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 115hp శక్తి మరియు 260Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నెక్సాన్‌ డీజిల్‌ 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ను కలిగి ఉంది. ఆటోమేటిక్‌ వేరియంట్ 24.07 kmpl మైలేజీని ఇస్తుంది.

mahindra XUV300

మహీంద్రా XUV300 : మహీంద్రా XUV300 (Mahindra XUV300) అత్యధిక మైలేజ్‌ డీజిల్‌ SUVలలో ఒకటిగా ఉంది. ఇందులో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. 117hp శక్తి, 300Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 20 kmpl మైలేజీని ఇస్తుంది.

హ్యుందాయ్‌ వెన్యూ : హ్యుందాయ్‌ వెన్యూ (Hyundai Venue) భారతదేశంలో అత్యధిక మైలేజ్‌ ఇచ్చే డీజిల్‌ ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది. ఈ ఎస్‌యూవీ 1.5 లీటర్ డీజిల్‌ ఇంజిన్‌తో 6-స్పీడ్‌ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జతచేయబడుతుంది. ఈ ఇంజిన్‌ 115 hp శక్తి, 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 23.4kmpl మైలేజీని ఇస్తుంది.

Hyundai venue

పైనున్న నాలుగు ఎస్‌యూవీలు ప్రస్తుతం భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో అత్యధిక మైలేజీ ఇచ్చే వాహనాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే ప్రాంతాల వారీగా వేర్వేరు ధరలను కలిగి ఉంటాయి. పైన పేర్కొన్న వాహనాలను కొనుగోలు చేయాలనుకున్న కస్టమర్లు అధికారిక వెబ్‌సైట్‌ లేదా సమీపంలోని డీలర్‌ను సంప్రదించండి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, November 20, 2023, 15:47 [IST]
English summary
Best mileage diesel suvs available in india here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+