రేపటి నుంచి Bharat NCAP టెస్టింగ్‌లు ప్రారంభం.. 5- స్టార్‌ రేటింగ్‌ పొందాలంటే ఏమేం కలిగి ఉండాలో తెలుసా?

భారత్‌లో ఇటీవల అందుబాటులోకి వచ్చిన భారత్ NCAP (BNCAP- భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రాం) డిసెంబర్‌ 15 నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఆగస్టు 22న భారత్‌లో BNCAP ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధికారికంగా ప్రారంభించారు.

5వ దేశంగా భారత్‌ : అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ వంటి సంస్థలు ఇప్పటికే సొంత వాహనాల భద్రతను పరీక్షించే ప్రత్యేక ఏజెన్సీలను కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా వీటి సరసన చేరింది. ఇప్పటి వరకు భారత్‌లో తయారీ చేయబడిన కార్లను గ్లోబల్‌ NCAP పరీక్షించింది.

Bharat NCAP to start testing from Dec 15

ఇప్పటికే వరుస కట్టిన సంస్థలు : భారత్ NCAP ద్వారా తమ కార్లను పరీక్ష చేయించనున్నట్లు హ్యాందాయ్‌ సంస్థ గతంలోనే ప్రకటన చేసింది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌, క్రెటా కొత్త ఎస్‌యూవీ, హ్యుందాయ్‌ వెర్నా వాహనాలను క్రాష్‌ టెస్టింగ్‌ కోసం BNCAP ఏజెన్సీకి పంపనున్నట్లు హ్యుందాయ్‌ తెలిపింది.

టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, మహీంద్రా సంస్థలు కూడా తమ 10 వాహనాలను BNCAP పరీక్షలకు పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. కియా సంస్థ తన రెండు ఫ్లాగ్‌షిప్ SUVలు, సెల్టోస్‌ మరియు సోనెట్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ను భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌కు పంపాలని భావిస్తోంది.

Bharat NCAP kia sonet

ఏయే పరీక్షలు నిర్వహిస్తారు : భారత్‌ NCAP వేర్వేరు స్థాయిలో క్రాష్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఫ్రంట్‌ ఇంపాక్ట్‌, సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌, సైడ్‌ బారియర్ ఇంపాక్ట్‌, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. రియర్‌ క్రాష్‌ ప్రొటెక్షన్‌, అటానమస్‌ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తోపాటు లేన్‌ డిపాచర్‌ వార్నింగ్ వంటి ఫీచర్లను తర్వాత స్టేజీలో కలిగి ఉండేలా చూడనుంది.

2 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి : 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన వాహనాలకు భారత్‌ NCAP 5-స్టార్‌ రేటింగ్‌ ఇస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో ప్రతి కారు 2 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేసింది. అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో కనీసం 27 పాయింట్లు మరియు చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రాటెక్షన్‌లో 41 పాయింట్లు సాధించిన కార్లకు భారత్‌ NCAP 5-స్టార్‌ రేటింగ్‌ ఇస్తుంది.

Bharat NCAP testing

30కి పైగా మోడళ్లు : అదే కనీసం 3-స్టార్‌ రేటింగ్‌ను పొందాలంటే.. 6- ఎయిర్‌బ్యాగ్‌లతోపాటు, ఫ్రంట్‌ అండ్‌ బ్యాక్‌ సీట్‌బెల్ట్‌ రిమైండర్‌ సహా మరిన్ని భద్రతా ఫీచర్లను కలిగి ఉండాలి. భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌ను పొందేందుకు ఇప్పటికే 30కి పైగా వివిధ సంస్థల మోడళ్లు నమోదుచేసుకున్నట్లు తెలుస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, December 14, 2023, 16:42 [IST]
English summary
Bharat ncap crash test to begin from tomorrow all you need to know
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+