భారత్‌లో BMW 740d M స్పోర్ట్స్‌ మరియు i7 M70 xDrive కార్లు విడుదల.. ధర ఏంటో తెలుసా?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ భారత్‌లో కొత్త BMW 7 సిరీస్ 740d M స్పోర్ట్స్‌ వేరియంట్‌తో పాటు i7 M70 xDrive కారును లాంచ్‌ చేసింది. మరింత సమాచారం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

BMW 740d M స్పోర్ట్స్‌ వేరియంట్‌ను చెన్నైలోని BMW ప్లాంట్‌లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నారు. అదే కొత్త ఎలక్ట్రిక్‌ BMW i7 M70 xDrive వాహనాన్ని పూర్తిగా బిల్ట్‌ అప్‌ యూనిట్‌గా అందుబాటులో ఉంది. ఈ రెండు కార్లు బీఎండబ్ల్యూ ఇండియా షోరూంలో అందుబాటులో ఉండనున్నాయి. బీఎండబ్ల్యూ 740d M స్పోర్ట్‌ కారు ధర రూ.1,81,00,000 (ఎక్స్‌షోరూం), BMW i7 M70 xDrive ధర రూ.2,50,00,000 (ఎక్స్‌షోరూం) గా ఉంది.

BMW 740d M sports

బీఎండబ్ల్యూ 740d M స్పోర్ట్‌ 3 లీటర్‌ 6 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 286bhp శక్తి, 650Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6 సెకన్లలో 0- 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

అదే బీఎండబ్ల్యూ i7 M70 xDrive కారు M స్పెసిఫిక్‌ డ్రైవ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది 660 hp శక్తి, 1100Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.7 సెకన్లలో 0- 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

BMW i7 M70 xDrive car

ఈ కారు లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 560 కి.మీ రేంజ్‌ ఇవ్వనుంది. బీఎండబ్ల్యూ 740d M స్పోర్ట్స్‌ మోడల్‌లో బీఎండబ్ల్యూ కనెక్టెడ్‌ డ్రైవ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దీంతోపాటు బీఎండబ్ల్యూ ID, మైబీఎండబ్ల్యూ, డిజిటల్‌ కీ ప్లస్‌, ఎమర్జెన్సీ కాల్‌, రియల్‌టైం ట్రాఫిక్‌ సమాచారం సహా మరెన్నో ఫీచర్లున్నాయి.

బీఎండబ్ల్యూ i7 M70 xDrive క్రూయిజ్‌ కంట్రోల్‌ మరియు పార్కింగ్ అసిస్టెంట్‌ ప్రొఫెషనల్‌ సహా ADAS వంటి కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. బీఎండబ్ల్యూ ఇంటిగ్రల్‌ యాక్టివ్‌ స్టీరింగ్, ఎగ్జిక్యూటివ్‌ డ్రై ప్రో సస్పెన్షన్‌ ప్యాకేజీ వంటి అనేక భద్రతా ఫీచర్లున్నాయి.

BMW i7 M70 xDrive

బీఎండబ్ల్యూ 740d M స్పోర్ట్‌ కారు ఆక్సైడ్‌ గ్రే, మినరల్‌ వైట్‌, బ్లాక్ సఫైర్‌ మరియు ఇండివిజువల్ టాంజానైట్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. అదే BMW i7 M70 xDrive స్టాండర్డ్‌గా బీఎండబ్ల్యూ ఇండివిజువల్‌ పెయింట్‌వర్క్‌తో డ్యూయల్‌ టోన్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ సఫైర్‌ రూఫ్‌ లేదా ఆక్సైడ్ గ్రే రూఫ్‌ కలర్‌ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ఉంటుంది.

బీఎండబ్ల్యూ 740d M స్పోర్ట్‌ కారు రెండు సంవత్సరాల స్టాండర్డ్‌ వారంటీతో వస్తుంది. 3-5 సంవత్సరాల వరకు ఆప్షనల్‌గా ఉంటుంది. బీఎండబ్ల్యూ i7 M70 xDrive అధిక ఓల్టేజ్‌ బ్యాటరీ 8 సంవత్సరాలు లేదా 1,60,000 కి.మీ వరకు వారంటీ కలిగి ఉంది.

BMW 740d M sports car

కొత్త బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ దాని కొత్త డిజైన్‌, పవర్ పుల్‌ డైనమిక్స్‌, కంఫర్ట్‌ మరియు డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌తో హై ఎండ్‌ సెగ్మెంట్‌ ఆకట్టుకుంటుందని బీఎండబ్ల్యూ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవాహ్‌ అన్నారు. ఎన్నో కీలక ఫీచర్లు, మెరుగైన పనితీరు కనబరుస్తుందని తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2023, 18:10 [IST]
English summary
Bmw 740d m sports and i7 m70 xdrive hits indian market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+