దేశీయ మార్కెట్లో BMW i7 విడుదల: ధర రూ. 1.95 కోట్లు

2023 కొత్త సంవత్సరంలో BMW కంపెనీ అధునాతన ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సంసిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే కంపెనీ భారతీయ విఫణిలో కొత్త i7 సెడాన్‌ విడుదల చేసింది. BMW యొక్క కొత్త i7 సెడాన్‌ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో విడుదలైన BMW i7 సెడాన్‌ ధర రూ. 1.95 కోట్లు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది xDrive 60 అనే ఒకే వేరియంట్ లో అందించబడుతుంది. అంతే కాకుండా ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్ గా మన దేశానికి వస్తుంది. ఈ సెడాన్ చూడటానికి చాలా అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కావున వాహన వినియోగదారులను తప్పకుండా ఆకర్శించే అవకాశం ఉంది.

దేశీయ మార్కెట్లో BMW i7 విడుదల

BMW i7 యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో ఎక్కువ భాగం బ్లూ యాక్సెంట్స్ చూడవచ్చు. అంతే కాకుండా ఫ్రంట్ గ్రిల్ మీద ఐ బ్యాడ్జ్ ఉంటుంది. అంతే కాకుండా ఈ సెడాన్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్‌ కలిగి కొత్త అల్లాయ్ వీల్స్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్ లాంగ్-వీల్‌బేస్ డిజైన్‌ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ లో 7 సిరీస్‌తో సమానంగా ఉంటుంది, i7 బ్యాడ్జ్‌ ఉంటుంది.

BMW i7 సెడాన్‌ ఇంటీరియర్ కూడా చాలా లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఇందులో 14.9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మరియు 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో BMW యొక్క లేటెస్ట్ iDrive 8 ఆపరేటింగ్ సిస్టమ్‌ కూడా ఉంటుంది. అంతే కాకుండా 31.3 ఇంచెస్ 8K 'సినిమా' స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది పైకప్పుపై అమర్చబడి అమెజాన్ ఫైర్ టీవీ ద్వారా వీడియో స్ట్రీమింగ్‌ను అందించడానికి అనుకూలంగా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో BMW i7 విడుదల

వెనుక డోర్స్ 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌లను కలిగి ఉంటాయి. ఇవి కేవలం ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను మాత్రమే కాకుండా క్లైమేట్ కంట్రోల్ మరియు సీటింగ్ కంట్రోల్ వంటి వాటి కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో 31.3 ఇంచెస్ 8K 'సినిమా' స్క్రీన్‌ పైకి ముడుచుకోవడానికి కూడా అనుకూలంగా రూపొందించబడింది. మొత్తం మీద BMW i7 సెడాన్‌లో అందుబాటులో ఉన్న ఇవన్నీ కూడా ప్రయాణికులకు మంచి లగ్జరీ అనుభూతిని అందించడంలో సహాయపడతాయి.

2023 BMW i7 సెడాన్ రెండు మోటార్‌లను కలిగి 544 హెచ్‌పి పవర్ మరియు 745 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇందులో 101.7kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కూడా అమర్చబడి ఉంటుంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 591 కిమీ నుండి 625 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. ఈ సెడాన్ యొక్క గరిష్ట వేగం గంటకు 239 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 4.7-సెకన్లలో గంటకు 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

దేశీయ మార్కెట్లో BMW i7 విడుదల

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ సెడాన్ బ్యాటరీ కూడా చాలా వేగంగా ఛార్జ్ చేసుకుంటుంది. కావున ఈ సెడాన్ ఛార్జింగ్ పరంగా కూడా చాలా ఎక్కువ సమయం ఆదా చేస్తుంది. ఈ BMW i7 పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ సెడాన్ పొడవు 5,391 మిమీ, వెడల్పు 1,950 మిమీ మరియు ఎత్తు 1,544 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త బిఎండబ్ల్యు ఐ7 సెడాన్ మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా పోర్స్చే టైకాన్‌ మరియు ఆడి ఇ-ట్రాన్ GT వంటి వాటికి కూడా ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కొత్త సంవత్సరంలో విడుదలైన ఈ లగ్జరీ సెడాన్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, January 7, 2023, 14:56 [IST]
English summary
Bmw i7 launched in india at rs 1 95 crore and all details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+