BMW iX1 ఎలక్ట్రిక్ SUV గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!
భారత్ మార్కెట్‌లో ఇటీవల BMW iX1 xDrive30 ఎలక్ట్రిక్ SUVని గత నెలలో విడుదల చేసింది. ఈ కారు ధర రూ.66.90 లక్షలుగా ఉంది. ఈ కారు కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ SUV 440 కి.మీ రేంజ్‌ను కలిగి ఉంటుంది.
ఈ బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ కారు అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ధృడమైన 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది. మరియు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు గ్రే, బ్లాక్, సిల్వర్, వైట్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ కారు లోపలి భాగంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. 10.7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. మరియు డ్యాష్‌బోర్డు అల్యూమినియం మెష్‌ఫెక్ట్ ఫినిష్‌తో వస్తుంది. మరియు క్రోమ్ హైలెట్‌ను కలిగి ఉంటుంది. ఈ మోడల్ 10.25 అంగుళాల డిజిటల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
దీంతోపాటు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్లైమేట్ కంట్రోల్, ఫ్రంట్ సీట్ల మసాజ్‌ఫంక్షన్‌తో వస్తాయి. మరియు మెరుగైన ఆడియో సిస్టమ్ కోసం 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అనేక రకాల లైటింగ్ మోడ్‌లు వంటి అద్భుతమైన ఫీచర్లున్నాయి. అడాప్టివ్ LED హెడ్‌లైట్లు, పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్ ఆపరేషన్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

భద్రతా పరంగా ఈ బీఎండబ్ల్యూ iX1 ఎలక్ట్రిక్ SUV.. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ట్రాక్షన్ కంట్రోల్, ఎయిర్‌బ్యాగ్‌లు సహా ADAS- అడ్వాన్సడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్ కారును అత్యంత మెరుగైన భద్రతను ఇవ్వనుంది.
కొత్త బీఎండబ్ల్యూ iX1 ఎలక్ట్రిక్ కారు ఆల్ వీల్ డ్రైవ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫ్రంట్, రియర్ యాక్సి్ల్‌పైన రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 313bhp శక్తి, 494Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ 66.4kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. పూర్తి ఛార్జింగ్‌తో 440 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది.

11kW AC ఛార్జర్‌తో ఈ కారు సుమారు 6.3 గంటల్లో 0-100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. అదే 130kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 29 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. ఈ బీఎండబ్ల్యూ కొత్త ఎలక్ట్రిక్ SUV కేవలం 5.6 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది. మరియు ఈ కారు గరిష్ఠంగా 180 km/h వేగంతో ప్రయాణం చేయగలదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








