భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన జర్మన్ బ్రాండ్ కారు 'బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్' (BMW XM) యొక్క డెలివరీలను గురించి కంపెనీ ఎట్టకేలకు వెల్లడించింది. ఈ ఆధునిక లగ్జరీ BMW XM యొక్క డెలివరీలు దేశీయ విఫణిలో ఎప్పుడు ప్రారంభమవుతాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, కొత్త బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్ డెలివరీలు ఈ సంవత్సరం ఐదవ నెల నుంచి అంటే '2023 మే' లో ప్రారంభమవుతాయి. భారతదేశంలో BMW XM ధర రూ. 2.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది 1978 లో ప్రారభించబడిన M1 తరువాత M బ్రాండ్ లో రెండవ స్వతంత్య్ర ఉత్పత్తి, అయితే హైబ్రిడ్ టెక్నలజీతో M బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి SUV ఇదే అవుతుంది.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

బిఎండబ్ల్యు XM అనేది ప్రస్తుతం 50e ట్రిమ్ స్థాయిలో మాత్రమే అందించబడుతోంది. ఇది మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ తో అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించబడింది. డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కిడ్నీ గ్రిల్‌ చూడవచ్చు. ఇందులో గోల్డ్ యాక్సెంట్స్ మరియు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ కూడా ఉంది.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

ముందు బంపర్ దిగువ భాగంలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్‌ను కూడా చూడవచ్చు. వెనుకవైపు BMW బ్యాడ్జెస్ మరియు LED టెయిల్‌లైట్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ 21-ఇంచెస్ వీల్స్ పొందుతుంది. కానీ వినియోగదారులు ఇందులో 22-ఇంచెస్ లేదా 23-ఇంచెస్ వీల్స్ ఎందుకోవచ్చు.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

బిఎండబ్ల్యు XM లోపలి భాగంలో డ్రైవింగ్ డిస్‌ప్లే మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఉన్న14.5 ఇంచెస్ స్క్రీన్‌లను చూడవచ్చు. లోపలి భాగం వింటేజ్ కాఫీ మెరినో లెదర్ మరియు సాఫ్ట్ బ్లూ నాప్పా లెదర్ అపోల్స్ట్రే తో చాలా వరకు డ్యూయెల్ థీమ్ పొందుతుంది. ఇందులో ADAS టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్ S68 ట్విన్ టర్బోచార్జ్డ్ 4.4 లీటర్ V8 ఇంజన్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. S68 ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 644 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. ఇది M xDrive సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

ఈ లగ్జరీ కారు కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ SUV యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది M డ్రైవర్ ప్యాకేజీతో గంటకు 270 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది హైబ్రిడ్ వెర్షన్ కావున ఇందులో 29.5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లో 88 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

మార్కెట్లో విడుదలైన ఈ BMW XM ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఈ SUV మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే, ఆస్టన్ మార్టిన్ DBX 707 మరియు పోర్షే కయెన్నే టర్బో GT వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది.

భారత్‌లో BMW XM డెలివరీలు ఎప్పుడో తెలిసిపోయింది

బిఎండబ్ల్యు దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త వాహనాలను దేశీయ మార్కెట్లో ఈ సంవత్సరం విడుదల చేయడానికి తగిన సన్నాహాలు కూడా సిద్ధం చేస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, January 4, 2023, 16:51 [IST]
English summary
Bmw xm suv deliveries will begin from may 2023 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+