దేశంలో తయారయ్యే కార్లపై సన్నీ లియోన్ హాట్ కామెంట్స్.. విదేశీ కార్లు వద్దు భారత్ కార్లు ముద్దు అంటున్న బ్యూటీ..
దేశంలో వర్షాకాలంలో రోడ్లపై వరదల కారణంగా ప్రతి ఏటా దేశవ్యాప్తంగా కార్ల యజమానులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలు సామాన్యులకే కాదు సెలబ్రిటీలకూ సమస్య తెచ్చిపెట్టింది. లక్షల విలువ చేసే కార్లకే వరదల కారణంగా రిపేర్లు అయితే మరమ్మతులకు సైతం భారీగా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ కోట్లు విలువ చేసే వరదల్లో కొట్టుకుపోయాయి.
ఇటీవల బాలీవుడ్ బ్యూటీ నటి సన్నీ లియోన్ సైతం ముంబయిలో భారీ వర్షాలకు చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన మూడు ఇంపోర్టెడ్ లగ్జరీ కార్లను కోల్పోయినట్లు తెలిపింది. రెండు రోజుల వ్యవధిలో ఈ ఘోరం జరిగినట్లు పేర్కొంది.

సన్నీ లియోన్ సహజంగా తనకు వర్షాకాలం అంటే ఎంతో ఇష్టమని, పైగా ముంబయి వాతావరణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తానని చెప్పారు. ముంబయిలో స్థిరపడటానికి, బీచ్ దగ్గరగా ప్లాట్ తీసుకోవడానికి అదే ప్రధాన కారణమని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. తనను భయపెట్టాయని.. ఇంత భారీ వర్షం పడుతుందని అసలు ఊహించలేకపోయానని వెల్లడించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో సముద్రం భయానకంగా మారిందని సన్నీ లియోన్ అన్నారు. భారీ వర్షానికి ఇంటి గోడలు మొత్తం తడిచి ముద్ద అయ్యాయని, ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాలేనంతగా భయపడ్డానని చెప్పారు. వర్షాల వల్ల తాను నివసిస్తున్న ప్లాట్‌లోకి నీళ్లు వచ్చాయని, రెండు రోజుల్లో మూడు కార్లు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకేరోజు రెండు లగ్జరీ కార్లు వరదలో కొట్టుకునిపోతుంటే చూస్తూ ఉండిపోయానే తప్ప ఏమీ చేయలేకపోయినట్లు సన్నీ లియాన్ విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత భయానకమని.. వరదనీటిలో కొట్టుకుపోతున్న కార్లను చూస్తే ఏడుపొచ్చిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే విదేశాల నుంచి కార్లను కొనుగోలు చేసినప్పుడు వాటికి కట్టే పన్ను చాలా ఎక్కువగా ఉంటుంది.
సన్నీ లియోన్ లగ్జరీ కార్ల జాబితాలో 8 సీట్ల మెర్సిడెస్ GL క్లాస్ ఒకటి. ఆ కారు అంటే తనకు చాలా ఇష్టమని సన్నీ చెప్పారు. ఎంతో ప్రేమగా చూసుకున్న ఆ కారు వరదలో కొట్టుకుపోవడం తలచుకుంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు దేశంలో తయారైన కార్లను కొనడానికే ఇష్టపడుతున్నానని, అవి వర్షాకాల సీజన్‌కు అనుగుణంగా ఉంటాయని చెెప్పారు.

ముంబయిలో భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయిన మరో రెండు వాహనాల వివరాలను సన్నీ వెల్లడించనప్పటికీ, వాటిలో ఆమె గతంలో కొనుగోలు చేసిన BMW 7-సిరీస్ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఆమె మూడవ కారు ప్రత్యేకతలు ఇంకా వెల్లడించలేదు. ఏదేమైనా ముంబయి వరదలు సామాన్యులకే కాదు ధనికులకూ ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
మన దేశంలో కార్లు వర్షాకాలానికి తట్టుకునేలా డిజైన్ చేశారని సన్నీ అన్నారు. ఇప్పుడు సన్నీ లియన్ MG గ్లోస్టర్ అనే పెద్ద SUVని ఉపయోగిస్తున్నారు. ఈ BMW కారులో కొన్ని సార్లు సన్నీ తళుక్కుమంది. ఇప్పుడు ఎక్కువగా ఆమె MG గ్లోస్టర్ SUVని ఉపయోగిస్తున్నారు.
MG గ్లోస్టర్ ప్రస్తుతం భారతదేశంలోని తయారీదారుల నుండి ప్రముఖ SUVగా నిలిచింది. పూర్తి-పరిమాణ SUV టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లతో పోటీపడుతోంది. ఫోర్డ్ ఎండీవర్ కూడా పోటీదారుగా ఉంది. భారత మార్కెట్లో గ్లోస్టర్ SUV మోడల్ సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు సావీ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ ఎంపికలతో SUV మోడళ్లలో అత్యధిక వీల్‌బేస్‌ను కలిగి ఉంది. SUV అటానమస్ లెవల్ 1 టెక్నాలజీతో సురక్షితమైన కారు మోడల్‌గా రేట్ చేయబడింది, కొత్త గ్లోస్టర్ SUV ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్ట్ (APA), ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) మరియు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








