చెన్నైలో జరగనున్న F4 రేసుకు ఎంపికైన రోహన్‌ మాదేష్‌.. భారత్‌ నుంచి తొలిసారిగా.!!

ఈ నెల(డిసెంబర్‌) 9, 10 తేదీల్లో చెన్నైలో జరిగే ప్రతిష్ఠాత్మక F4 రేసుకు బెంగళూరులోని కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి రోహన్ మాదేష్ ఎంపికయ్యాడు. కాగా తొలి సీజన్‌లో ఈ పోటీలో పాల్గొన్న మొదటి భారతీయుడు రోహన్‌ కావడం విశేషం.

రోహన్‌ మాదేష్‌ ఇప్పటికే మోటర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన పలు పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఈ ఏడాది రోహన్, సీనియర్ రోటాక్స్ మాక్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇటీవల పోర్చుగల్‌లో జరిగిన ప్రపంచ ఫైనల్స్‌లో భారత్‌కు రోహన్‌ ప్రాతినిధ్యం వహించాడు. కాగా 76 దేశాలకు చెందిన రేసర్లు పాల్గొన్న ఈ పోటీలో రోహన్ రెండో స్థానంలో నిలిచి భారత కీర్తి ప్రతిష్ఠలకు ప్రపంచానికి చాటాడు.

F4-Race-Rohaan Madesh

పదహారేళ్ల రోహన్‌ మాదేష్‌(Rohaan Madesh) గతేడాది మెరిడాస్ కప్‌లో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు.. ఇటీవల దుబాయ్‌లో జరిగిన రోటాక్స్ ఇంటర్నేషనల్ పోటీలో కూడా పాల్గొన్నాడు. అంతేకాకుండా 2021లో, S30 నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను ఈ పదహారేళ్ల కుర్రాడు గెలుచుకున్నాడు. ఇంకా రోటాక్స్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 2వ రన్నరప్‌గా నిలవగా.. 2020లో రోహన్‌ X30 నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో వైస్ ఛాంపియన్‌గా నిలవడం గర్వకారణం.

ఇంకా రోహన్ సాధించిన విజయాలను పరిశీలిస్తే.. 2019లో ఫ్రాన్స్‌లో జరిగిన రోటాక్స్ వరల్డ్ ఫైనల్స్‌లో భారత్‌ తరపున ఈ కుర్రాడు ప్రాతినిధ్యం వహించాడు. అలాగే, 2018లో, ఫ్రాన్స్‌లో జరిగిన X30 వరల్డ్ ఫైనల్స్‌లో దేశం తరపున పోటీలో పాల్గొన్నాడు. ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రోహన్‌ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు.. ఈ తరం యువతకి ఆదర్శంగా నిలిచాడు.

F4-Race-Rohaan Madesh

F4 రేసుకు సంబంధించి రోహన్‌ మాట్లాడారు. తాను రేసింగ్‌లో చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. తాను పాల్గొనే ప్రతి రేసులో మంచి పనితీరు కనబరిచేందుకు ఎలా విశ్లేషించాలో తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. రేసింగ్ పోటీల్లో పాల్గొనాలంటే ఫిట్‌నెస్ చాలా అవసరమని.. దాని కోసం రోజూ కసరత్తులు చేస్తానని చెప్పారు. తన విజయానికి ఫ్యామిలీ, స్కూల్‌ ఎంతగానో సపోర్ట్‌ చేశాయని తెలిపారు.

కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన రోహన్ ఏడేళ్లప్పుడే రేసింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్లలో పాల్గొనేందుకు రోహన్‌ మలేషియాలో శిక్షణ తీసుకున్నారు. ఇంకా రోహన్ F1 (ఫార్ములా 1) రేసులు, యూరోపియన్ కార్టింగ్ పోటీలను తరచూ వీక్షించడం ద్వారా రేసింగ్‌పై ఆసక్తిని పెంచుకున్నట్లు రోహన్‌ చెబుతాడు. ఇప్పుడు ఏకంగా F4 రేసుల్లో పాల్గొనడం అతని విజయాలకు నిదర్శనమనే చెప్పవచ్చు.

F4-Race-Rohaan Madesh

రోహన్ సాధించిన ఘనత గురించి కెనడియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎండీ శ్వేతా శాస్త్రి హర్షం వ్యక్తం చేశారు. రోహన్ చిన్న వయసులోనే మోటార్ రేసింగ్‌లో గొప్ప విజయాలు సాధించాడని తెలిపారు. రేసింగ్ పట్ల అతని నిబద్ధత, అంకితభావమే.. అతడిని చాలా ఎత్తుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే F4 రేసును చూడటానికి తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 5, 2023, 18:04 [IST]
English summary
Canadian international school student rohaan madesh selected for f4 motor racing in chennai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+