కారు కొనుగోలు చేస్తున్నారా.. అధిక రీసేల్ వ్యాల్యూ కలిగిన వాహనాల గురించి తెలుసా?
భారత్‌లో అత్యధిక శాతం మంది కార్లను కొనుగోలు చేసే సమయంలో మైలేజీ, డిజైన్, ఫీచర్లు సహా మెయింటెనెన్స్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు. వీటితోపాటు తాము కొనుగోలు చేస్తున్న కారు రీసేల్ వాల్యూ ఎంత ఉంటుందో కూడా తెలుసుకొని.. కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే భవిష్యత్‌లో కొత్త కార్లను కొనుగోలు చేసే సమయంలో పాత కారు విక్రయిస్తుంటారు. అలాంటి సమయంలో ఎక్కువ నష్టాలు రాకుండా ముందే జాగ్రత్తపడతారు.
భారత్‌లో ప్రతి సంవత్సరంలో అనేక కొత్త మోడల్ కార్లు విడుదల అవుతున్నాయి. ఫలితంగా చాలా మంది తమ పాత కార్లను విక్రయించేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటి సమయంలో మనం ప్రస్తుతం వినియోగిస్తున్న రీసేల్ వ్యాల్యూ (cars with high resale) చాలా కీలకం. అయితే ఈ కథనంలో ఎక్కువ రీసేల్ వ్యాల్యూ కలిగిన జాబితాను మీకోసం అందిస్తున్నాం.

హోండా సిటీ : సెడాన్ సెగ్మెంట్‌లో ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆకర్షణీయమైన మోడళ్లలో హోండా సిటీ ఒకటిగా నిలిచింది. ఈ కారు అనేక కీలక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. లెదర్‌తో కూడిన స్టీరింగ్ వీల్, గేర్‌నాబ్, డోర్ ప్యాడ్ మరియు ఆటో డిమ్మింగ్ IRVM, ఫోల్డబుల్ ORVM మరియు అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది.
హోండాసిటీ ఫేస్‌లిఫ్ట్ 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 120bhp శక్తి, 145Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు CVT గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ హోండా సిటీ అధిక రీసేల్ వ్యాల్యూను కలిగి ఉంటుంది.

మహీంద్రా స్కార్పియో : గత కొన్ని సంవత్సరాలుగా మహీంద్రా స్కార్పియో సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో బలంగా ఉంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. డిజైన్ సహా మెరుగైన బిల్డ్ క్వాలిటీ కూడా కారణం. గత కొన్నేళ్లుగా మహీంద్రా స్కార్పియో రీసేల్ వ్యాల్యూ అధికంగా ఉంటోంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ : భారత్ మార్కెట్లో ప్రస్తుతం ఎక్కువ ప్రజాదరణ కలిగిన వాహనాల జాబితాలో మారుతి సుజుకి స్విఫ్ట్ తొలి వరుసలో ఉంటుంది ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు డిజైన్ సహా ఫీచర్లు, మైలేజీ అంశాలతో విశేషంగా ఆదరణ పొందింది.

టయోటా ఇన్నోవా క్రిస్టా : టయోటా ఇన్నోవా క్రిస్టా GX, VX, ZX వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 2005లో క్వాలిస్ స్థానంలో ఈ ఇన్నోవాను ప్రీమియం MPVగా పరిచయం చేసింది. డిజిల్ ఇంజిన్‌తోనూ ఈ కారు అందుబాటులో ఉంది.
అప్పటి నుంచి ఈ కారుకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ట్రావెల్ సంస్థల్లో మోస్ట్ యుటిలిటీ వాహనంగా మారింది. క్రిస్టా MPV సూపర్ వైట్, ఆటిట్యూడ్ బ్లాక్, అవాంట్ గార్డ్ బ్రాంజ్, సిల్వర్, వైట్ పెర్ల క్రిస్టల్ షైన్ ఆప్షన్‌లలో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








