కారు కొనుగోలు చేస్తున్నారా.. తక్కువ ధరలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన కార్ల లిస్ట్‌..!

ఎయిర్‌బ్యాగ్స్‌ వినియోగం కారణంగా ప్రమాదాల నుంచి సురక్షితంగా బయటపడుతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ ఫలితాల కారణంగా ఎయిర్‌బ్యాగ్స్‌ (Airbags in cars) వినియోగం తప్పనిసరిగా మారింది. ఎయిర్‌బ్యాగ్స్‌ వినియోగం కారణంగా మరణాల రేటు తగ్గుముఖం పడుతుందని గణాంకాలు సైతం వెల్లడిస్తు్న్నాయి.

భారత్‌లో విక్రయించే అన్ని కార్లలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా అమర్చాలని కార్ల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖరీదైన, లగ్జరీ కార్లలో 6 లేదా ఆరు కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్నాయి. అయితే చౌకైన కార్లలోనూ (low price range cars) 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందించేందుకు వాహన తయారీ సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి.

hyundai exter

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీ : 2023 జులైలో హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.10.15 లక్షల (ఎక్స్‌షోరూం) ధరగా ఉంది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌లో అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. మరియు ఈ కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ : భారత మార్కెట్‌లో ఈ కారు ధర రూ.5.84 లక్షల నుంచి రూ.8.51 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. భారత్‌ మార్కెట్‌లో ఎక్కువగా విక్రయాలు నమోదు చేస్తున్న కార్లలో ఒకటిగా ఉంది. ఈ కారు ఆరు ఎయిర్‌బ్యాగ్‌ను కలిగి ఉంటుంది. మరియు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

, low price range cars with six airbags

హ్యుందాయ్‌ ఆరా: భారత్ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో ఉంది. ఈ మోడల్‌ అన్ని వేరియంట్లు 6 ఎయిర్‌బ్యాగ్స్‌ను కలిగి ఉంటాయి. ఈ కారు 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో అందించబడుతుంది. ఈ సెడాన్‌ ధర రూ.6.44 నుంచి రూ.9 లక్షల (ఎక్స్‌షోరూం) గా ఉంది.

హ్యుందాయ్‌ i20 మరియు i20 ఎన్‌ లైన్‌ : హ్యుందాయ్‌ i20 కారు ధర రూ.6.99 లక్షల నుంచి రూ.11.16 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. i20 N- లైన్‌ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.47 లక్షలుగా (ఎక్స్‌షోరూం)ఉంది. i20 కారు 1.2 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌, i20 ఎన్‌లైన్‌ శక్తివంతమైన 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ కార్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటాయి.

, low price range cars with six airbags cars

హ్యుందాయ్‌ వెన్యూ మరియు వెన్యూ ఎన్‌లైన్‌ : భారత్‌ మార్కెట్‌లో వెన్యూ ధర రూ.7.89 లక్షల నుంచి రూ.13.48 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. అదే వెన్యూ ఎన్‌లైన్‌ ధర రూ.12.08 లక్షల నుంచి రూ.13.90 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ రెండు వెర్షన్‌ల కార్లు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటాయి.

టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీ : భారత్‌ మార్కెట్‌లో ఈ కార్ల ధరలు రూ. 8.10 లక్షల నుంచి రూ.15.50 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.14.74 లక్షల నుంచి రూ.19.94 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ కారు అధునాతన ఫీచర్లు సహా కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంటుంది.

6 airbags and cheapest cars in india

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, November 17, 2023, 9:41 [IST]
English summary
Cheapest cars in india with 6 airbags here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+