ఫార్ములా -4 నైట్‌ రేసింగ్ టికెట్ల విక్రయం ప్రారంభం.. భారత్‌లో తొలిసారి..!

భారత్‌లో తొలిసారిగా ఫార్ములా 4 మరియు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ నైట్‌ రేసు చెన్నైలో జరగనుంది. డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో ఈ రేస్‌ జరగనుండగా.. ఇందుకు సంబంధించిన టికెట్ల విక్రయం ప్రారంభం అయింది. చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్‌లో నిర్వహించే రేసింగ్‌లో.. ఇండియన్‌ ఫార్ములా 4 ఛాంపియన్‌షిప్‌ మరియు ఇండియన్ రేసింగ్ లీగ్‌ల నుంచి టీంలు పాల్గొంటాయి.

భారత్‌లోనే పొడవైన..! : చెన్నైలోని ఫార్ములా రేసింగ్‌ సర్క్యూట్‌ 3.5 కి.మీ పొడవుతో భారత్‌లోనే పొడవైనదిగా ఉంది. ఈ రేసింగ్ ట్రాక్‌ 19 కార్నర్‌లను కలిగి ఉంది. చైన్నై ఐలాండ్‌ గార్డెన్‌ గ్రౌండ్‌లో ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఫ్లాగ్‌ స్టాఫ్‌ రోడ్, అన్నా సాలై, శివానంద సాలై మరియు నేపియర్‌ బ్రిడ్జ్‌ మీదుగా రేస్‌కార్‌లు దూసుకెళ్లనున్నాయి.

Chennai Formula 4 night race tickets

ప్రతి టీం నుంచి ఒక మహిళ.. : ఈ రేసింగ్‌లో ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (IRL) ఆరు ఫ్రాంచైజీలతో రూపొందించబడుతుంది. హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌, స్పీడ్‌ డెమన్స్ ఢిల్లీ, చెన్నై టర్బరైడర్స్‌, గాడ్‌స్పీడ్‌ కొచ్చి, గోవా ఏసెస్‌ మరియు బెంగళూరు స్పీడ్‌స్టర్స్ లీగ్‌ నిబంధనల ప్రకారం మొత్తం ఆరు ఫ్రాంచైజీలు తమ జట్లలో మహిళా రేసర్‌ను కలిగి ఉంటాయి.

ఫార్ములా 4 నైట్‌ రేస్‌ టికెట్‌ ధర: చెన్నైలో నైట్‌ రేస్‌ టిక్కెట్లు తాజాగా Paytmలో తెరవబడ్డాయి. మరియు ప్రేక్షకుల కోసం సీటింగ్‌ ప్రాంతాలను 4 విభాగాలను విభజించారు. గ్రాండ్ స్టాండ్‌లు (8), ప్రీమియం స్టాండ్, గోల్డ్‌ లాంజ్‌ మరియు ప్లాటినం లాంజ్‌లుగా విభజించారు. గ్రాండ్‌ స్టాండ్‌లు 2,4,5 కోసం రూ.2125 ధర చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రీమియం స్టాండ్‌లోని టికెట్ల కోసం రూ.5449 చెల్లించాల్సి ఉంటుంది.

Chennai Formula 4 night race

రోజువారీ, వారంతపు గోల్డ్‌, ప్లాటినం టిక్కె్ట్లు కలిగిన వారు ఫుడ్‌ మరియు హాస్పిటాలిటీ ప్రాంతాలకు అనుమతి ఉంటుంది. దాంతోపాటు టీం సభ్యులు, టీం సిబ్బందితో మీట్ అండ్‌ గ్రీట్‌ అవకాశాన్ని పొందుతారు. గోల్డ్‌ లాంచ్‌ పాస్‌లు కలిగినవారు టీమ్‌, టీమ్‌ సిబ్బందితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ అవకాశంతోపాటు ప్రత్యేకమైన ఫుడ్ మరియు హాస్పిటాలిటీకి యాక్సెస్‌ ఉంటుంది.

ప్లాటినం పాస్‌ కలిగినవారు గోల్డ్‌ పాస్‌కు ఉన్న అన్ని ప్రయోజనాలను పొందుతారు. దాంతోపాటు ప్యాడ్‌డాక్‌ మరియ పిట్‌లైన్‌ వాక్‌తోపాటు సర్య్కూట్‌లో ప్రీమియం లోకేషన్‌ నుంచి వీక్షించే అవకాశాన్ని కలిగి ఉంటారు. గోల్డ్‌ మరియు ప్లాటినం లాంజ్‌ల రోజువారీ పాస్‌ల ధర రూ.6799 మరియు రూ.10,999గా ఉంది. అదే గోల్డ్‌ లాంజ్‌లోని వీకెండ్ పాస్‌ల కోసం రూ.11,899 చెల్లించాలి. అదే ప్లాటినం లాంజ్‌ వీకెండ్ పాస్‌ల కోసం రూ.16,999గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, December 3, 2023, 15:03 [IST]
English summary
Chennai formula 4 night race tickets sale on live
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+