Citroen C3 Air Cross ముచ్చటగా మూడో కారుని ఆవిష్కరించిన సిట్రోయిన్.. ఆకర్షించే డిజైన్‌లో విడుదల, వాటికి పోటీగా

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయిన్ సరికొత్త కారును ఆవిష్కరించింది. దేశంలో ఇప్పటికే అరంగేట్రం చేసిన సీ3 హ్యాచ్‌బ్యాక్‌, సీ5 ఎయిర్‌క్రాస్ తరువాత బ్రాండ్ మూడవ మోడల్‌ కారును తీసుకురానుంది. సీ 3 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ పేరుతో విడుదల చేయనుంది. దీనిని 2023 ద్వితీయార్ధంలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది.


సరికొత్త లుక్‌లో ఈ కారు అందుబాటులో రానుంది. ఈ కారు సీ3 కారు ప్రేరణతో తీసుకువచ్చింది. ఈ కారు 5, 7 సీటర్ ఆప్షన్లతో అందుబాటులో ఉండనుంది. కొత్త సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ 4.3 మీటర్ల పొడవు ఉండనుంది. ఇది క్రెటాతో సమానంగా ఉంటుంది. స్టైలింగ్ విషయానికొస్తే, సీ 3 ఎయిర్ క్రాస్ సీ3 పోలినట్లు ఉంటుంది. ముందు భాగంలో కంపెనీ లోగో గ్రిల్ కు అనుసంధానించడి ఉంటుంది. ఇది క్రోమ్, పియానో బ్లాక్ ఇన్సర్ట్ లతో నిండిన రెండు-లేయర్ల డిజైన్ ను కలిగి వస్తుంది.

Citroen C3 Air Cross

ఆకర్షణీయమైన ఎక్స్‌టీరియర్ లుక్ లో ఈ కారు కస్టమర్లను ఆకట్టుకోనుంది. సిట్రోయెన్ స్టైల్ Y-ఆకారంలో డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ లను పొందుతుంది. దానికింద హెడ్ ల్యాంప్స్ ఉండనున్నాయి. ఎయిర్ క్రాస్ లో హాలోజెన్ హెడ్ ల్యాంప్ లను మాత్రమే పొందుతుంది, ఫ్రంట్ బంపర్ చాలా పొడవుగా ఉండనుంది. ఈ ఎస్‌యూవీ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఎక్స్ ఆకారపు డిజైన్‌తో రానుంది.

డ్యాష్ బోర్డ్ డిజైన్ తో కూడిన 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది. 7-సీటర్ వెర్షన్ లో బ్లోయర్ కంట్రోల్ తో రెండవ, మూడవ వరుస ప్రయాణీకుల కోసం రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్ లు ఉంటాయి. థర్డ్ లైన్ ప్రయాణికులకు USB ఛార్జింగ్ పోర్టులు ఉంటాయి. అలానే IVRM, క్రూయిజ్ కంట్రోల్స్ తో వస్తుంది.

Citroen C3 Air Cross Interior

ఇక ఈ కారు ఇంటీరియర్ రెండు సీటింగ్ ఆప్షన్లతో సిట్రోయిన్ సీ3 తీసుకువచ్చింది. 5+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ గా మూడు వరుసల లేఅవుట్ తో వస్తుంది. అలానే ఐదు సీట్లు ఆప్షన్ కలిగి ఉంటుంది. 5 సీట్ల సీ 3 ఎయిర్‌క్రాస్ 444 లీటర్ల బూట‌్‌ స్పేస్‌ని కలిగి ఉంది. 7 సీట్ల వేరియంట్ 511 లీటర్లతో రానుంది.

సిట్రోయిన్ సీ3 ఎయిర్ క్రాస్ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 110 bhp వద్ద 190 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇదే పవర్ కల్గిన ఇంజన్ సీ3లో కూడా ఉండనుంది. ఈ కారులో మొదటగా 6 స్పీడ్ మాన్యువల్ గేర్లలో విక్రయించబడుతుంది. త్వరలోనే ఇది ఆటోమేటిక్ మోడ్ ట్రాన్స్ మిషన్ లో రానుంది. ఇందులో డీజిల్ ఇంజన్ లేకపోవడం కొంత నిరాశకు గురిచేస్తుంది.

Citroen C3 Air Cross Engine

హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్ వ్యాగన్ టైగన్, స్కొడా కుషాక్ వంటి ప్రత్యర్థులతో సీ3 ఎయిర్ క్రాస్ పోటీపడుతుంది. ఈ కారు ధర కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇతర కార్లతో పోల్చితే ఎయిర్ క్రాస్ దాని ప్రత్యర్థులతో పాటు మంచి ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్ తో వస్తుంది.

ఈ సందర్భంగా ఆటోకార్ ఇండియాతో మాట్లాడిన సిట్రోయెన్ బ్రాండ్ సీఈవో థియరీ కోస్కాస్ ప్రస్తుతం దేశంలో 30 మంది డీలర్లు ఉన్నారని చెప్పారు. త్వరలోనే మరిన్ని డీలర్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ సంవత్సరం చివరి నాటికి మాకు కచ్చితంగా 100 డీలర్‌షిప్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశంలో సేల్స్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Friday, April 28, 2023, 11:13 [IST]
English summary
Citroen c3 air cross unveiled in india full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+