Citroen C3 Aircross సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ రివ్యూ వీడియో..
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇటీవల భారత్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న C3 ఎయిర్‌క్రాస్ SUVని ఆవిష్కరించింది. Citroen C3 ఎయిర్‌క్రాస్ ఫ్రెంచ్ వాహన తయారీదారు నుంచి నాల్గవ మోడల్. సిట్రోయెన్ ఈ మోడల్‌ను త్వరలో దేశీయ మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సిట్రోయెన్ సీ3 ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్లతో రంగంలోకి దిగుతోంది. అందుకు సంబంధించిన ఫుల్ రివ్యూను వీడియోలో చూడవచ్చు.
డిజైన్: ఎయిర్‌క్రాస్ ఫ్రంట్ డిజైన్ దాని రెగ్యులర్ C3 తో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. సీ3 ఎయిర్ క్రాస్‌లో పెద్ద గ్రిల్ బంపర్ హౌసింగ్ యొక్క రిజిస్ట్రేషన్ ప్లేట్ విభాగం ద్వారా విడిపోయి ఉంటుంది. దిగువన సిల్వర్ ఫాక్స్ బాష్ ప్లేట్ మరియు సర్కిల్ ఆకారంలో ఫాగ్ ల్యాంప్‌లు ఉంటాయి. సీ3 ఎయిర్‌క్రాస్ సైడ్స్ ద్వారా ఈ ఎస్‌యూవీ 200mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను స్పష్టంగా పరిశీలించవచ్చు. చతుర్భుజ డైమండ్ కట్ ఆకారంలో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.
ఫీచర్లు: ఇక సీ3 ఎయిర్ క్రాస్‌లో దాని ఫ్రంట్ సీట్లను పరిశీలిస్తే.. సీ3 హ్యాచ్‌బ్యాక్‌తో పోలిస్తే దాదాపు ఇది అదే డిజైన్‌లో ఉంటుంది. 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌ను సీ3 హ్యాచ్ నుంచి తీసుకున్నారు. అయితే 7 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లేను మాత్రం కొత్తగా రూపొందించారు. కాగా టచ్‌స్క్రీన్ యూనిట్ ఈ సెగ్మెంట్‌లో బెస్ట్ కాదనే చెప్పవచ్చు. కానీ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టవిటీతో మీరు డిస్టర్బెన్స్ లేని మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు: ఇంకా సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో అనేక భద్రతా లక్షణాలను తీసుకువచ్చింది. కానీ ఇది ఒక వేరియంట్‌లో మాత్రమే ఉంటుంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD తో కూడిన ABS, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, TPMS, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, రేర్ వ్యూ కెమెరా, రేర్ పార్కింగ్ సెన్సార్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లతో ఈ కారు ప్రయాణికులకు ఫుల్ సేఫ్టీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








