విడుదలకు సిద్ధమవుతున్న సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ SUV.. ఈ కార్లకు గట్టిపోటీ..!

ప్రముఖ ఫ్రెండ్‌ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ భారత్‌లో తన కొత్త C3 Aircross SUV ఇటీవల ఆవిష్కరించింది. ఇది సిట్రోయెన్‌ నాలుగో మోడల్‌. త్వరలో ఈ కొత్త ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ లైవ్‌, ఫీల్‌, షైన్‌ అనే మూడు వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. ఎయిర్‌క్రాస్‌ SUV కోసం సెప్టెంబర్‌ నుంచి బుకింగ్‌లను ప్రారంభించనుంది. అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ భారత మార్కెట్లో హ్యుందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా సహా మరికొన్ని కార్ల కంటే కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ కారు ముందు భాగంలో పియానో బ్లాక్‌ కలర్‌తో కూడిన క్రోమ్‌ గ్రిల్‌, స్ప్లిట్‌ సెటప్‌తో హెడ్‌ల్యాంప్‌ క్లస్టర్‌, Y ఆకారంలో DRLను కలిగి ఉంటుంది.

Citroen C3 Aircross SUV

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ SUV అల్లాయ్‌ వీల్స్‌ X ఆకారపు డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు ఫ్రంట్‌ బంపర్‌ అల్యూమినియం ఫినిషింగ్‌తో వస్తుంది. వృత్తాకారంలో ఉన్న ఫాగ్‌ ల్యాంప్‌ క్లస్టర్‌లతో కూడిన డెడికేటెడ్‌ ఎయిర్‌ ఇన్‌టేక్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో రౌండ్‌ వీల్‌ ఆర్చ్‌లు, డోర్‌ల వద్ద బ్లాక్‌ క్లాడింగ్‌ను గమనించవచ్చు.

ఈ కొత్త ఎస్‌యూవీ వెనుక వైపు స్క్వారీష్‌ టెయిల్‌ ల్యాంప్‌లు, పొడవైన బంపర్‌ ఉంటుంది. C3 ఎయిర్‌క్రాస్‌ ఎస్‌యూవీ 200mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ కారు లోపలి భాగంలో టాకోమీటర్‌తో డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది. ఆపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోను సపోర్టు చేస్తుంది.

Citroen C3 Aircross SUV

దీంతోపాటు 10.2 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.
సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ 7 సీటర్‌లో బ్లోవర్‌ కంట్రోల్‌తో రెండు, మూడో వరుసలో రూఫ్‌ మౌంటెడ్‌ AC వెంట్లు ఉంటాయి. మూడో వరుస ప్రయాణికుల కోసం ఛార్జింగ్‌ పోర్టులను కూడా ఈ కారు కలిగి ఉంటుంది. డే అండ్‌ నైట్‌ IRVM సహా క్రూయిజ్‌ కంట్రోల్‌తో వస్తుంది.

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ SUV 5 సీటర్‌ వెర్షన్‌ 444 లీటర్ల బూట్‌ స్పేస్‌తో వస్తుంది. 7 సీటర్‌ వెర్షన్‌ మూడు వరుసల సీట్లతో 511 లీటర్ల బూట్‌ స్పేస్‌ను కలిగి ఉంటుంది. భద్రతా పరంగా కూడా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రొగ్రాం, పార్కింగ్‌ సెన్సార్లతో కూడిన రియర్‌ వ్యూ కెమెరా, హిల్‌ హోల్డ్ అసిస్ట్‌ ఫీచర్లు ఉన్నాయి.

Citroen C3 Aircross SUV

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ SUV 1.2 లీటర్‌ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్‌ 109bhp శక్తి, 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌ను 2024లో ఆవిష్కరించే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 4, 2023, 13:56 [IST]
English summary
Citroen c3 aircross suv variants revealed and booking start from september
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+