కొత్త సంవత్సరంలో సిట్రోయెన్ కొత్త ధరలు - ఇక్కడ చూడండి
2023 ప్రారంభం నుంచే దేశీయ విఫణిలో కార్ల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే చాలా కంపెనీలు తెలిపాయి. ఇందులో భాగంగానే సిట్రోయెన్ కంపెనీ తన సి3 మరియు సి5 ఎయిర్‌క్రాస్ ధరలను పెంచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సిట్రోయెన్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన C5 ఎయిర్‌క్రాస్ ధరలను ఇప్పుడు రూ. 50,000 వరకు పెంచింది. ఈ ధరల పెరుగుదల 2023 జనవరి 01 నుంచి అమలులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ధరలు మొత్తం వేరియంట్ లైనప్‌కు వర్తిస్తుంది. ధరల పెరుగుదల తరువాత C5 ఎయిర్‌క్రాస్ ధర రూ. 37.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్త సంవత్సరంలో సిట్రోయెన్ కార్లు మరింత ఖరీదైనవిగా మారిపోయాయి.

ఇక సిట్రోయెన్ కంపెనీ యొక్క సి3 విషయానికి వస్తే, ఈ హ్యాచ్‌బ్యాక్ ధర మునుపటి కంటే రూ. 27,500 ఖరీదైనదిగా మారింది. అయితే ఈ మోడల్ లో నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 27,500 మరియు టర్బో-పెట్రోల్ వేరియంట్ అవుట్‌గోయింగ్ ధరల కంటే రూ. 20,000 ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 9,000 నుంచి రూ. 17,000 వరకు పెరిగాయి.
మొత్తానికి అనుకున్న విధంగానే సిట్రోయెన్ కంపెనీ తమ వాహన ధరలను పెంచింది. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో కొత్త ధరలతో అందుబాటులో ఉన్న కంపెనీ కార్లు ఎలాంటి అమ్మకాలను పొందుతాయి అనేది తెలియాల్సిన విషయం. బహుశా ముడిసరుకులు ధరల పెరుగుదల వల్ల కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచి ఉండే అవకాశం ఉందని భావిస్తున్నాము. రాబోయే సంక్రాంతి వంటి పండుగలలో ఈ కార్లు తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతాయని ఆశిస్తున్నాము.
'సిట్రోయెన్' (Citroen) కంపెనీ దేశీయ మార్కెట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతున్నాయి. అయితే గత సంవత్సరం విడుదల చేసిన చిన్న కారు సి3 మైక్రో SUV ఆశాజనకమైన అమ్మకాలు పొందింది. ఈ SUV చూడటానికి చిన్నదైనా అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి ఉంటుంది. పనితీరు అందించడంలో కూడా సిట్రోయెన్ సి3 వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
సిట్రోయెన్ సి3 రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఒకటి 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజిన్, కాగా మరొకటి 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇక 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 108 బిహెచ్‌పి మరియు 190 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.
సిట్రోయెన్ సి3 మైక్రో ఎస్‌యూవీని లైవ్ మరియు ఫీల్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ SUV ముందు భాగంలోని బంపర్‌లపై కలర్-కోడెడ్ ఇన్‌సర్ట్‌లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్ ఉన్నాయి. ఇది 15-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.
సి3 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులోని 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్ వంటివి మాత్రమే కాకుండా మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.


Click it and Unblock the Notifications