సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌పై పండుగ ధమాకా ఆఫర్లు.. ఇప్పుడు కొనుగోలు చేస్తే 2024 లో డబ్బులు కట్టేయొచ్చు.!!

పండుగ సీజన్‌ సందర్భంగా సిట్రోయెన్‌ సంస్థ తన C3 ఎయిర్‌ క్రాస్‌ మిడ్‌సైజ్‌ ఎస్‌యూవీపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. మరి ఆ ఆఫర్‌ వివరాలేంటో ఈ కథనంలో అందిస్తున్నాం.

తాజాగా Citroen నుంచి మార్కెట్లోకి విడుదలైన సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ మిడ్‌ సైజ్‌ SUV ను ఇప్పుడు మీరు చాలా తక్కువ ధరలో సొంతం చేసుకోవచ్చు. దీనిపై ఇప్పుడు రూ. 55,000 వరకు భారీ తగ్గింపును అందిస్తుంది. C3 ఎయిర్‌క్రాస్ మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ ఐదు-సీట్లు మరియు ఏడు-సీట్లు మోడల్‌లో అందుబాటులో ఉంది.

Citroen-C3-Aircross

ఇది ఈ సెగ్మెంట్‌లో మొదటి ఎస్‌యూవీ. తాజా తగ్గింపు వివరాల్లో పండుగ ఒప్పందాలు, కార్పొరేట్ బోనస్‌లు, నగదు ఒప్పందాలు మరియు ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్‌లు తదితరమైన ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. కొత్త C3 ఎయిర్‌క్రాస్ మిడ్-సైజ్ SUV హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్, MG ఆస్టర్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌ వంటి అధునాతన కార్లతో పోటీపడుతోంది.

దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 12.76 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎక్స్-షోరూమ్‌ ధర. వీటిలో ఐదు సీట్ల వేరియంట్‌.. రూ. 9.99 లక్షల నుండి రూ. 12.41 లక్షల వరకు లభిస్తుంది. ఇక ఏడు సీట్ల వేరియంట్‌లు రూ. 11.69 లక్షల నుండి రూ. 12.76 లక్షల వరకు అందుబాటులో ఉంది.

Citroen-C3-Aircross

C3 ఎయిర్‌క్రాస్ ఇంజిన్‌ స్పెసిఫికేషన్‌ వివరాల్లోకి వస్తే.. ఇది ఒకే పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.. ఇందులో డీజిల్ ఇంజన్ లేదు. కాగా పవర్‌ట్రెయిన్ 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 109bhp వద్ద 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సిట్రోయెన్‌ C3 ఎయిర్ క్రాస్‌ మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ప్రస్తుతానికి దీనిని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌లో అందించేందుకు సంస్థ కృషి చేస్తోంది. ఇక మైలేజ్‌ విషయానికొస్తే C3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ 18.5 kmpl మైలేజ్‌ ఇస్తుంది.

Citroen-C3-Aircross

కాగా Citroen సంస్థ కస్టమర్ల కోసం కేర్ ఫెస్టివల్‌ను సైతం ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులకు కాంప్లిమెంటరీ 40-పాయింట్ వెహికల్ హెల్త్ ప్యాకేజీని అందిస్తుంది. అంతే కాకుండా ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్‌లపై హామీతో కూడిన బహుమతులు లభిస్తాయి. కార్ కేర్ ఉత్పత్తులపై 15 శాతం తగ్గింపు, ఎంపిక చేసిన ఉపకరణాలపై 10 శాతం తగ్గింపు, లేబర్‌ ఛార్జీలపై 10 శాతం తగ్గింపు వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తోంది.

అంతేకాకుండా C3 ఎయిర్‌క్రాస్‌ హ్యాచ్‌బ్యాక్‌ని కొనుగోలు చేసేందుకు.. 2024లో EMIలను చెల్లించేందుకు Peace Of Mind అనే డీల్‌ను కస్టమర్లు ఎంచుకోవచ్చు. పీస్ ఆఫ్ మైండ్ డీల్‌పై కస్టమర్లకు మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. దీని ద్వారా 5 సంవత్సరాలు/50,000 కిమీలు, ఇంకా 5 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్‌ వారంటీ/1 లక్ష కి.మీ షెడ్యూల్డ్‌ మెయింటెనెన్స్‌ ఆప్షన్‌ను అందిస్తుంది.

Citroen-C3-Aircross

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 25, 2023, 14:17 [IST]
English summary
Citroen festival discounts on c3 aircross mid size suv off up to rs 55000 full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+