బంపర్ ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్, మార్చి నెల డెడ్ లైన్..!
బంపర్ ఆఫర్.. ఆ కార్లపై ఏకంగా రూ.2 లక్షల వరకు డిస్కౌంట్
భారత్ లో BS6 స్టేజ్ 2 ఉద్గార ప్రమాణాలను కచ్చితం చేయడంతో కార్ల కంపెనీలు 2022 మోడల్ తో పాటు తాజా కార్లపై భారీ ఆఫర్ లను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే మారుతి,హోండా సిటీ, హ్యుందాయ్ కంపెనీలు ఎంపిక చేసిన కార్లపై భారీ ఆఫర్ లను ప్రకటించాయి. అలానే ఫ్రేమ్ తాజాగా ఫ్రెంచ్ కు చెందిన సిట్రోయిన్ భారీ డిస్కౌంట్ ను ఇస్తుంది.
ఆ కంపెనీ నుంచి విడుదలైన సిట్రోయిన్ C5 ఎయిర్ క్రాస్ మాన్ ఫాక్టరింగ్ 2022 మోడల్‌లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపును ఆ సంస్థ అందిస్తోంది. దీనితో పాటు డీలర్లు ఇచ్చే అదనపు డిస్కౌంట్లు కాంప్లిమెంటరీ ప్యాకేజీలను కలిపి ఏకంగా రెండు లక్షలకు పైగా ఈ కారుపై ఆఫర్ ను పొందవచ్చు.

కొనుగోలు దారులను ఆకర్షించేందుకు..
మార్కెట ధరతో పోల్చుకుంటే అతి తక్కువగా అందుబాటులో ఉండటం ఈ సంస్థకు కలిసి రానుంది. కొనుగోలుదారులను ఈ కారు ఆకర్షిస్తుదనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారీగా ఈ కార్ల స్టాక్ ను సంస్థ మార్కెట్ విడుదల చేసింది. ఇప్పటికే చాలా నగరాల్లోనీ డీలర్ల వద్ద ఈ కారు అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో కారు సేల్స్ ఊపందుకునే అవకాశం ఉంది. ఎక్స్ షోరూమ్ లో ఈ కారు ధర దాదాపు 37 లక్షలుగా ఉంది.
ఇక Citroen C3 విషయానికి వస్తే, ఈ మోడల్ ఫ్రెంచ్ కారు భారత మార్కెట్ లో చాలా విజయవంతమైంది. ఈ వెర్షన్ లోని అమ్మకాలను పెంచే ప్రయత్నంలో కంపెనీ రూ. 50,000 వరకు ప్రత్యేక బెనిఫిట్స్ ను అందిస్తోంది. అంతేకాకుండా, అర్హత కలిగిన కస్టమర్ లు 100 శాతం ఆన్-రోడ్ ఫండింగ్‌ను కూడా పొందవచ్చు. ఈ కారు ధర 5.98 నుంచి ప్రారంభం కానుంది.

మార్చి ఆఖరు వరకు డిస్కౌంట్స్..
సిట్రోయిన్ ఇండియా ప్రకారం, Citroen C5 Aircross SUV, Citroen C3 హ్యాచ్ బ్యాక్ పై అప్ డేట్ చేయబడిన ఆఫర్ లు మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఆఫర్ లకు సంబంధించి మరింత సమాచారాన్ని పొందడానికి సమీపంలోని సిట్రోయెన్ ఇండియా షోరూమ్‌ని సందర్శించవచ్చు.
మార్చి నెలలో కార్ల కంపెనీలు చాలా రాయితీలను కల్పిస్తున్నాయి అందులో మారుతి సుజుకి కూడా కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్స్ సేమ్ సిట్రోయిన్ లా ఈ నెల (మార్చి) చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయనీ సంస్థ పేర్కొంది. ఆ కంపెనీ డిస్కౌంట్ అందిస్తున్న కార్లు ఏవో తెలుసా..
54,000 వరకు డిస్కౌంట్..
ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్ పై మారుతి సుజుకి భారీ డిస్కౌంట్ ను సంస్థ అందిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ. 54,000 డిస్కౌంట్ పొందవచ్చు. టోటల్ డిస్కౌంట్ లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ను సంస్థ కల్పిస్తోంది. దీంతోపాటు ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ పొందనున్నారు.
హోండా సిటీ కూడా తమ ఫేస్ లిఫ్ట్ కారుపై మార్చిలో దాదాపు రూ.17వేల వరకు ఆఫర్ ను పొందవచ్చు. రూ.5 వేలు కస్టమర్ లాయల్టీ బోనస్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.7,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ను సంస్థ ఆఫర్ చేస్తోంది. ఇకపోతే హోండా అందించే సరికొత్త డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు సిటీ పెట్రోల్‌పై మాత్రమే కంపెనీ పరిమితం చేసింది. సిటీ హైబ్రిడ్‌పై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో లేవని సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications








