ఇంట్లో కరెంట్ తో.. 320కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు..!!

ఎలక్ట్రిక్ కారు విభాగంలో సామాన్యులు ఎక్కువగా ఎంచుకునే కారు టాటా టియగో. దీనికి ధీటుగా తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ లో అంతకు మించిన కారును ఫ్రెంచ్ కు చెందిన సిట్రోన్ అనే సంస్థ E-C3 EV కారును ప్రవేశ పెట్టింది. ఈ కారును సంస్థ హోమ్ డెలివరీ చేయనుంది. టాటా టియాగోకు ప్రత్యామ్నాయంగా దీనిని ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. అయితే ఈ కారులో ఉన్న ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా..

నాలుగు వేరియంట్లలో ఈ కారును కంపెనీ తీసుకువచ్చింది. రూ.11.50 లక్షలతో (ఎక్స్ షోరూమ్) ఈ కారు ధర ప్రారంభమవనుంది. లైవ్, ఫీల్, ఫీల్ వైబ్ ప్యాక్, ఫీల్ డ్యుయల్ టోన్ వైబ్ ప్యాక్ వెర్షన్ లలో డిఫరెంట్ ధరల్లో కారు లభిస్తుంది. ఈ కార్లు అన్ని ఎంపిక చేయబడిన షోరూమ్‌ లలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

టాటా సిట్రోన్

ఎకో, స్టాండర్డ్ మోడల్ లభ్యం..

రూ.25,000 చెల్లించి బుకింగ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 100 శాతం DC ఫాస్ట్ ఛార్జింగ్ తో పనిచేస్తుంది. 15 AMP హోమ్ ఛార్జింగ్‌ కు ఈ కారు సపోర్ట్ చేస్తుంది. Citroen eC3 29.2kWh బ్యాటరీని పొందుతుంది. 57hp వద్ద 143Nm గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ శక్తి ఈ కారు మోటారుకు అందిస్తుంది.

ఈ స్పీడ్ సిట్రోన్ కారు 6.8 సెకన్లలో 0-60 kph వేగంతో ప్రయాణిస్తూ 107kph గరిష్ట వేగాన్ని అందుకోగలదు. Citroen eC3 రెండు డ్రైవింగ్ మోడ్‌ లలో లాభిస్తుంది. ఎకో, స్టాండర్డ్ డ్రైవింగ్ మోడ్ లు ఇందులో అమర్చారు. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ సిస్టం ఈ కారులో కలదు.

320 కి.మీ రేంజ్..

ARAI నియమాల ప్రకారం ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320km రేంజ్ వరకు వస్తుంది. రెండు ఛార్జింగ్ ఎంపికల్లో ఈ కారు వస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్ 57 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. ఇక CCS2 ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం కలిగిన 3.3kW ఆన్‌ బోర్డ్ AC ఛార్జర్ 10.5 గంటల సమయంలో 10-100 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

గత ఏడాది డిసెంబర్‌ లోనే ఈ కారుకు సంబంధించిన వివరాలను సంస్థ విడుదల చేసింది. అయితే దీని బుకింగ్ గత నెల 22 జనవరి 2023న ప్రారంభమైంది. 3981 mm పొడవు, 1733 mm వెడల్పు మరియు 1604 mm ఎత్తును కలిగి ఉంది.. 2540 mm వీల్‌బేస్, 315 లీటర్ల బూట్ స్పేస్ స్పోర్ట్స్ 195/65 R15 టైర్లను ఈ కారుకు అమర్చారు.

సిట్రోన్

13 కలర్లలో అందుబాటులో..

ఈ కారు 13 కలర్లలో లభిస్తుంది. వాటిని ఓసారి పరిశీలిస్తే పోలార్ వైట్, జెస్టీ ఆరెంజ్, ప్లాటినం గ్రే, స్టీల్ గ్రే, పోలార్ వైట్ విత్ జెస్టీ ఆరెంజ్ రూఫ్, ప్లాటినం గ్రే విత్ జెస్టీ ఆరెంజ్ రూఫ్, స్టీల్ గ్రే విత్ జెస్టీ ఆరెంజ్ రూఫ్, పోలార్ వైట్ విత్ ప్లాటినం గ్రే రూఫ్, జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్, ప్లాటినం గ్రే రూఫ్‌తో, పోలార్ వైట్ రూఫ్‌తో జెస్టీ ఆరెంజ్, పోలార్ వైట్ రూఫ్‌తో ప్లాటినం గ్రే మరియు పోలార్ వైట్ రూఫ్‌తో స్టీల్ గ్రే లో లభిస్తుంది.

ఈ సరికొత్త C3 ఎలక్ట్రిక్ కస్టమర్‌ లకు ఒత్తిడి లేకుండా ఉండేందుకు 100శాతం విడిభాగాలను అందుబాటులో ఉంచనుంది. దీని వల్ల సులభంగా ప్రత్యేక సేవలను కస్టమర్లు పొందనున్నారు. Citroen Service on Wheels అనే పేరిట కస్టమర్ల ఇంటి వద్దకే అన్నీ సౌకర్యాలను తీసుకురానుంది. ఇది కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ భావిస్తోంది.


More from DriveSpark

Article Published On: Wednesday, March 1, 2023, 14:59 [IST]
English summary
Citrone india launched the much awaited new citroen ec3 all electric car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+