CNG Cars తగ్గిన సీఎన్‌జీ ధరలు.. రూ.5 నుంచి 6 లక్షలోపు అందుబాటులో ఉన్న కార్లు ఇవే..
దేశంలో రోజు రోజుకు సీఎన్ జీ వినియోగం పెరిగిపోతుంది. ఇటీవలే ధరల పెంపుదల మరలా CNG ధరలను 10 శాతం వరకు దేశమంతటగా తగ్గించారు. ఈ నిర్ణయంతో CNG వాహనాన్ని కలిగి ఉన్న వారికి కాస్త ఊరటను కలిగించినట్లు అయ్యిది. చాలా మంది వినియోగదారులకు ఈ కబురు ఉపశమనం కలిగిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఆల్టో 800 CNG..
పెట్రోల్, డీజిల్ వాహనాలకు ధీటుగా CNG కార్ సెగ్మెంట్ ఇటీవలి కాలంలో గణనీయమైన పెరుగుదలను సాధించింది. తాజాగా ధరల తగ్గింపుతో CNG కారు కోసం కొనాలనుకునే వారిని ఈ సౌలభ్యం ప్రోత్సహించనుంది. తక్కువ ధరలో మార్కెట్ లో లభిస్తున్న కార్ల వివరాలు మీకు అందిస్తున్నాం.

ఈ జాబితాలో మొదటగా మాట్లాడుకోవాల్సింది మారుతి సుజుకి నుంచి వచ్చిన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఆల్టో 800 కారు. ఇది భారతదేశంలో లభిస్తున్న CNG కార్లలో అత్యంత సరసమైన కారుగా ఉంది. BS-6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనల కచ్చితం చేయడంతో ఈ కార్‌మేకర్ కంపెనీ ఇటీవల పెట్రోల్ మోడల్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
స్టాక్‌లు ఉన్నంత వరకు ఎవరైనా ఆల్టో 800 CNGని క తీసుకెళ్లవచ్చు. ₹5.13 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ధర, ఆల్టో 800 సీఎన్‌జీ కారు కిలోకు 30 కిమీల కంటే ఎక్కువ మైలేజీని అందిస్తోంది. ఇతర సీఎన్‌జీ కార్లలో అధిక మైలేజ్ ని అందిస్తున్న కారు ఇదే కావడం గమనార్హం. ఆఫర్‌లో దాదాపు 40 bhp వద్ద 60 nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి S-Presso CNG..
ఈ జాబితాలో లభిస్తున్న మరో మారుతి కారు S-Presso CNG ఈ కారు కేవలం రూ. 6 లక్షల కంటే తక్కువ ధర (ఎక్స్-షోరూమ్)లలో లభించనుంది. S-Presso CNG కోసం మారుతి సుజుకి కొత్త తరం S-CNG కిట్‌లను ఉపయోగిస్తుంది.
S-ప్రెస్సో CNG వెర్షన్ LXi వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 56 bhp వద్ద 82 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఈ మారుతి S-Presso CNG మోడల్స్ కిలోకు 32 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీని అందించనుంది.
ఆల్టో K10..
తక్కువ ధరలో లభించే మరో కారు ఆల్టో కె10 హ్యాచ్‌బ్యాక్. గత సంవత్సరం మారుతి S-CNG టెక్నాలజీని విడుదల చేసింది. కొత్త 1.0-లీటర్ K10 సిరీస్ ఇంజన్ దాదాపు 56 bhp వద్ద 82 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది కిలోకు దాదాపు 34 కిమీల మైలేజీని అందిస్తుంది. ఈ కారు ధర మార్కెట్ లో రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్)తో ఉండనుంది. ఆల్టో కె10 ఎస్-సీఎన్‌జీ చాలా మంది వాహన కొనుగోలుదారులకు ప్రత్యేక ఆకర్షణ నిలువనుంది.
వేగనర్ ఆర్..
దేశంలో వేగనర్ ఆర్ కారుకి ఉన్న అత్యంత ప్రజాదరణ కారణంగా చిన్న కార్ మోడళ్లలో ఒకటైన ఈ బాక్సీ హ్యాచ్‌బ్యాక్ CNG వెర్షన్‌ను కూడా సులభంగా ఎంచుకోవచ్చు. సెలెరియో తరహా మోడళ్లకు ఉపయోగించే అదే 1.0-లీటర్ K సిరీస్ ఇంజన్‌తో ఆల్టో K10 వస్తుంది. WagonR CNG మోడల్స్ 56 bhp శక్తిని మరియు 82 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు. 34.05 kms/kg అందిచనుంది.

టాటా టియాగో iCNG..
హ్యుందాయ్ శాంత్రో నుంచి మార్కెట్ లో నిలిపివేయడంతో, టాటా తన కంపెనీ నుంచి అతి చిన్న హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు అత్యంత సరసమైన సీఎన్‌జీలలో మంచి ఎంపికలలో ఒకటిగా ఉంది. టాటా టియాగో iCNG మోడల్‌లు 1.2-లీటర్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 72 bhp వద్ద 95 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియాగో CNG 26.49 kms/kg మైలేజీని అందిస్తుందని సంస్థ పేర్కొంది. Tiago i-CNG వేరియంట్‌ను ₹6.44 లక్షల(ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








