Deepika Padukone: హ్యుందాయ్‌ మోటార్స్ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె..

దేశీయ మార్కెట్లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్‌కు బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. అయితే షారూఖ్ ఖాన్ ఇప్పటికే 20 ఏళ్లుగా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, ఇప్పుడు తాజాగా దీపికా పదుకొణె షారుఖ్‌కు తోడుగా చేరింది. హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న తదుపరి కార్‌ మోడల్‌ లాంచ్‌ దీపికాతోనే జరగననుట్లుగా సమాచారం.

భారత మార్కెట్లోని ప్రముఖ ఆటో మేకర్లు తమ బ్రాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. ఎక్కువగా సెలబ్రిటీలనే ఎంచుకుంటున్నాయి. సినీ లేదా స్పోర్ట్స్‌ రంగాల్లోని ప్రముఖులను బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమించుకుంటున్నాయి. ఈ కోవలో హ్యుందాయ్‌ కంపెనీకి గత 20 ఏళ్లుగా షారుక్‌ ఖాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు.

Deepika-Padukone-Hyundai-Motors

అయితే 20 ఏళ్లుగా హ్యుందాయ్ కార్లకు షారూఖ్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటుండగా.. ఇప్పుడు ఈ బాద్‌షాకు తోడుగా దీపికా వచ్చి చేరింది. ఈ మేరకు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ తన 2024 క్రెటా(Hyundai Creta Facelift) కారును జనవరి 16న మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ క్రమంలో ఇప్పుడు దీపికా పదుకొణెకి సంబంధించి వెల్లడైన ఆసక్తికర సమాచారం వైరల్‌ అవుతోంది.

ఈ నేపథ్యంలో 2024 జనవరి 16న హ్యుందాయ్‌ తన కొత్త కారును లాంచ్‌ చేసేందుకు సిద్ధంగా ఉంది. కొత్తగా వస్తున్న హ్యుందాయ్‌ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ కారులో పలు ఆకర్షణీయమైన మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎక్స్‌టీరియర్‌ పరంగా చాలా మార్పులు చూడవచ్చని సమాచారం. ఇంకా ఈ కారు అడాస్‌(ADAS) టెక్నాలజీతో రానున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ధర కంటే కొత్త వెర్షన్‌ ధర ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

Deepika-Padukone-Hyundai-Motors

భారత్‌లో ప్రతిభావంతులైన గ్లోబల్‌ ఇండియన్‌ ఐకాన్ దీపికా పదుకొణే(Deepika Padukone) తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు తాము గర్విస్తున్నట్లు హ్యుందాయ్‌ కంపెనీ సీఓఓ తరుణ్‌ గార్గ్‌ అన్నారు. దీపికాకు ఉన్న అద్భుతమైన చరిష్మా మరియు ఆమె ఇమేజ్ తమ హ్యుందాయ్ మోటార్స్‌కు సరైన ఆప్షన్‌గా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

దీపికా సినిమా రంగంలోనే కాకుండా సమాజంలో చాలా మందికి రోల్‌ మోడల్‌గా నిలుస్తోందని తరుణ్‌ కర్‌ అనారు. దీపికా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం ద్వారా తమ కంపెనీకి చెందిన ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సులభంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపికాకు ఉన్న క్రేజ్‌ ద్వారా తమ కంపెనీ నుంచి కొత్త కార్లను కస్టమర్లలోకి సులభంగా తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

Deepika-Padukone-Hyundai-Motors

ఆమె తిరుగులేని ఆక‌ర్ష‌ణ శ‌క్తి, అద్భుత‌మైన కెరీర్ హ్యుందాయ్ మోటార్ ఇండియా యంగ్‌, డైన‌మిక్ బ్రాండ్‌కు స‌రితూగుతుంద‌ని తరుణ్‌ గార్గ్‌ పేర్కొన్నారు. దీపికా(Deepika Padukone Brand Ambassador For Hyundai)తో అనుబంధం త‌మ బ్రాండ్ ఉనికిని పెంచి త‌మ టార్గెట్ ఆడియ‌న్స్‌తో క‌నెక్ట్ అవుతుంద‌నే విశ్వాసం ఉంద‌ని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో కొత్త ఏడాది జనవరిలో హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ విడుదల కానుంది. అయితే హ్యుందాయ్‌ క్రెటాకే దీపికా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారా అనే సమాచారం అధికారికంగా అందుబాటులో లేదు. అదే నిజమైతే ఇక హ్యుందాయ్‌ క్రెటా కార్లకు మంచి డిమాండ్‌ ఉంటుందనే చెప్పవచ్చు.

భారత మార్కెట్లో మారుతి సుజుకి తర్వాత అత్యధిక సంఖ్యలో కార్లను తయారు చేసి విక్రయిస్తున్న సంస్థ హ్యుందాయ్‌ మోటార్స్‌. ఈ సంస్థకు ప్రజల్లో మంచి గుర్తింపుతో పాటు డిమాండ్‌ కూడా ఉంది. ఈ సందర్భంలో సినీ సెలబ్రిటీ దీపికా పదుకొణె హ్యుందాయ్‌ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా మారడంతో బ్రాండ్‌కు మంచి ఇమేజ్ వస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.

కాగా త్వరలో హ్యుందాయ్ క్రెటా అరంగేట్రం తర్వాత సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. క్రెటా కొత్త అప్‌డేట్ కోసం కార్‌ ప్రియులు ఎదురుచూస్తున్నారు. కారు లాంచ్‌ అయిన తర్వాత ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభిస్తుండొచ్చని సంస్థ భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 29, 2023, 17:14 [IST]
English summary
Deepika padukone as brand ambassador for hyundai motors check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+