Maruti Suzuki కారుపై రూ.65000 వరకు తగ్గింపు.. ఏంటీ కారు ప్రత్యేకత, ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే?
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇగ్నిస్‌తో (Maruti Suzuki ignis) సహా వివిధ మోడళ్లపై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఈ ఆఫర్ ఎప్పటికి వరకు అందుబాటులో ఉంటుంది. ఈ కారు ప్రత్యేకతలు వంటి పూర్తి వివరాలు మీకోసం.
మారుతి సుజుకి ఇగ్నిస్ కారుపై రూ.65000 వరకు తగ్గింపును కలిగి ఉంది. ఇందులో రూ.40 వేల నగదు తగ్గింపు, రూ.15000 ఎక్స్చేంజీ బోనస్ మరియు రూ.10000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. ఆ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు వినియోగించుకోవాలని సంస్థ కోరింది.

అయితే రాష్ట్రాలు, వేరియంట్, కలర్, లభ్యత ఆధారంగా ఈ తగ్గింపు ప్రయోజనాల్లో మార్పులు ఉంటాయి. పూర్తి వివరాల కోసం దగ్గరిలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాలని మారుతి కోరింది. ప్రస్తుతం మారుతి సుజుకి ఇగ్నిస్ ధర రూ.5.84 లక్షలు నుంచి రూ.8.16 లక్షల ఎక్స్‌షోరూం ధరతో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
మారుతి సుజుకి ఇగ్నిస్.. సిగ్మా, డెల్టా, జిటా, ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. నెక్సా బ్లూ, లూసెంట్ ఆరెంజ్, సిల్కి సిల్వర్, టర్కోయిస్ బ్లూ, గ్లిస్టెనింగ్ గ్రే, పర్ల్ ఆర్కిటిక్ వైట్ వంటి 6 మోనోటోన్ మరియు 3 డ్యూయల్ టోన్ కలర్స్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

సరికొత్త మారుతి సుజుకి ఇగ్నిస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 83ps శక్తి, 113Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజిన్ 20.89 kmpl మైలేజీని అందిస్తుంది.
ఈ ఇగ్నిస్ వాహనం అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. మరియు మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, DRLలను కలిగి ఉంటుంది.

మరియు భద్రత పరంగా మారుతి సుజుకి ఇగ్నిస్ కీలక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS - యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD - ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ సహా మెరుగైన పార్కింగ్ సెన్సార్‌లతోపాటు అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇగ్నిస్‌తోపాటు మారుతి సుజుకి స్విఫ్ట్ పైనా తగ్గింపు ధరను పొందవచ్చు. రూ.49000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు ధర రూ.5.99 నుంచి రూ.9.03 లక్షల ఎక్స్‌షోరూం వద్ద కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 22.38 kmpl మరియు 30.90km/kg మైలేజీని అందిస్తాయి. ఇది 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సహా డజర్ల కొద్ది ఫీచర్లను కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








