మారుతి, హోండా సిటీ కార్లపై భారీ ఆఫర్స్.. రూ.54,000 వరకు డిస్కౌంట్!!

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు హోండా మోటార్స్ ఇండియా, మారుతి సుజుకిలు ఈ నెలలో భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఎంపిక చేసిన కార్లపై భారీ డిస్కౌంట్ లను సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఏఏ కార్లపై ఎంత మొత్తంలో డిస్కౌంట్స్ అందిస్తున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..

మారుతి

కారు కొనాలనుకునే వారికి మారుతి సుజుకి శుభవారర్త చెప్పింది. కొన్ని ఎంపిక చేసిన మోడల్స్ మీద కంపెనీ రూ. 54,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్స్ కేవలం ఈ నెల మార్చి చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయనీ పేర్కొంది.

మారుతి సుజుకి ఇగ్నిస్..

ఇగ్నిస్..

మొత్తం ఈ కంపెనీ కార్లలో అధికంగా మారుతి సుజుకి ఇగ్నిస్ మాన్యువల్ వేరియంట్‌ పై భారీ డిస్కౌంట్ ను సంస్థ అందిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ. 54,000 డిస్కౌంట్ పొందవచ్చు. టోటల్ డిస్కౌంట్ లో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్స్ కొనుగోలుపై రూ. 34,000 బెనిఫిట్స్ లభించనుంది.

మారుతి సుజుకి బాలెనో..

ఇదే కంపెనీ నుంచి వచ్చిన బాలెనో కారు ఫిబ్రవరిలో అధిక అమ్మకాలను రాబట్టింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారు మీద కంపెనీ రూ.35,000 తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలో అందించే ఈ డిస్కౌంట్ కేవలం మాన్యువల్ వేరియంట్‌కి మాత్రమే వర్తించనుంది. ఆటోమేటిక్, CNG మోడల్స్ కొనుగోలుపైన ఎటువంటి డిస్కౌంట్లు అలానే బెనిఫిట్స్ అందుబాటులో లేవు.

సుజుకి బాలెనో

మారుతి సుజుకి సియాజ్..

మరో మోడల్ మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపై రూ. 28,000 తగ్గింపుని పొందవచ్చు. ఈ డిస్కౌంట్స్ మ్యాన్యువల్, ఆటోమాటిక్ రెండు వేరియంట్‌లకి వర్తించనుంది. ఈ డిస్కౌంట్ అమౌంట్ లో రూ.25,000 ఎక్స్‌ ఛేంజ్ ఆఫర్, రూ.3,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ ద్వారా రానుంది. ఈ డిస్కౌంట్స్ అన్ని ఎంపిక చేసిన పట్టణాలను బట్టి మారుతూ ఉంటాయి. కచ్చితమైన ఆఫర్స్ పొందాలంటే స్థానిక డీలర్‌ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

డిస్కౌంట్స్ తో పాటు దేశీయ మార్కెట్లో మరిన్ని కొత్త మోడల్స్ విడుదల చేయడానికి మారుతి సుజుకి సిద్ధంగా ఉంది. వీటిలో మారుతి ఫ్రాంక్స్, మారుతి జిమ్నీ 5-డోర్ కార్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ కొత్త కార్ల కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. త్వరలోనే వీటిని రోడ్లపై చూడవచ్చు.

హోండా సిటీ

హోండా సిటీ..

సరికొత్త హోండా సిటీ 2023 మోడల్ కారును మార్చి 2న భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే, హోండా కొన్ని సరికొత్త ఫీచర్లతో సిటీని అప్‌డేట్ చేసింది. మిడ్-సైజ్ సెడాన్‌కు సంబంధించిన డిస్కౌంట్లు, ఆఫర్‌ లను ఆ సంస్థ అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన హోండా సిటీ మోడల్ కార్లను సొంతం చేసుకోవచ్చు.

ఈ కారును కేవలం ఒక వారం ముందు మాత్రమే మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే, సిటీ సేల్స్ మాత్రం అమాంతం పెరిగిపోయాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు హోండా మోటార్స్ ఇండియా అనేక బెనిఫిట్స్ అఫర్ చేస్తోంది.

హోండా సిటీ మార్చిలో దాదాపు రూ.17వేల వరకు ఆఫర్ ను అందిస్తోంది. రూ.5 వేలు కస్టమర్ లాయల్టీ బోనస్, రూ.5వేలు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.7,000 హోండా కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్ చేస్తోంది. ఇకపోతే హోండా అందించే సరికొత్త డిస్కౌంట్‌లు, ఆఫర్‌లు సిటీ పెట్రోల్‌పై మాత్రమే కంపెనీ పరిమితం చేసింది. సిటీ హైబ్రిడ్‌పై ఎలాంటి డిస్కౌంట్లు అందుబాటులో లేవని సంస్థ తెలిపింది.

సిటీ 2023 1.5-లీటర్ VTEC DOHC పెట్రోల్ ఇంజన్‌ను తో పనిచేస్తుంది. 121PS వద్ద, 145Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ MT, 7-స్పీడ్ CVT గేర్లు దీనికి ఉన్నాయి. ఈ మోడల్ కారు ఆఫర్‌ లో డీజిల్ ఇంజన్ లేదు.

More from DriveSpark

Article Published On: Monday, March 13, 2023, 9:29 [IST]
English summary
Discounts on maruti suzuki and honda city cars in march
Read more on: #కారు #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+