మారుతి సుజుకి కార్లపై దీపావళి ధమాకా ఆఫర్లు.. రూ. 59,000 డిస్కౌంట్, కొద్ది రోజులే ఛాన్స్.!!
మారుతి సుజుకి దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ. పండుగ సీజన్‌లతో పాటు ప్రతి నెలా ఎంపిక చేసిన కార్లపై కస్టమర్లకు మారుతి సుజుకి బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంది. అదే విధంగా ఈ నవంబర్ నెలలో కూడా మారుతి సుజుకి బ్రాండ్ కార్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
Maruti Suzuki Celerio: దీపావళి సందర్భంగా మారుతి సుజుకి సెలెరియా కారుపు రూ. 59,000 డిస్కాంట్‌ను పొందవచ్చు. సెలెరియో కారు VXi, ZXi మరియు ZXi+ వేరియంట్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. కాగా సెలెరియో CNG వెర్షన్‌పై కార్పొరేట్ డిస్కాంట్ వర్తించదని సంస్థ తెలిపింది.

ఆకర్షణీయమైన డిజైన్, సమర్థవంతమైన ఇంజిన్ ఆప్షన్‌లు, విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో పాటు వాటి ముందున్న వెర్షన్‌లతో పోలిస్తే ఇంకా అదనంగా మరిన్ని ఫీచర్లను కలిగి ఉంది. మారుతి సెలెరియో ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. ఆర్కిటిక్ వైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టనింగ్ గ్రే, సాలిడ్ ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ, కెఫిన్ బ్రౌన్ అనే సింగిల్ టోన్ కలర్స్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
Maruti Suzuki Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌పై కూడా రూ. 49,000 వరకు తగ్గింపును ప్రకటించింది. రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బోనస్‌ను పొందవచ్చు. కాగా సీఎన్‌జీ వెర్షన్‌పై కేవలం రూ. 25,000 నగదు తగ్గింపు మాత్రమే వర్తిస్తుంది.

Maruti Suzuki Wagon R: మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌పై రూ. 25,000 వరకు నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బోనస్‌తో మొత్తంగా కలిపి రూ. 49,000 వరకు తగ్గింపును పొందవచ్చు. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో వ్యాగన్ ఆర్ ఒకటి.
Maruti Suzuki Alto K10, Alto 800: దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న కార్లలో ఒకటి ఆల్టో కె10. ఈ కారుపై రూ. 49,000 తగ్గింపును పొందవచ్చు. రూ. 25,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బోనస్‌ను పొందవచ్చు.

కాగా మారుతి సుజుకి ఆల్టో కె10 సీఎన్‌జీ వేరియంట్‌పై రూ. 20,000 నగదు తగ్గింపు మాత్రమే ఉంది. కాగా మరోవైపు ఆల్టో 800 కారుపై రూ. 15,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను మాత్రమే పొందవచ్చు. ఈ కారుపై నగదు తగ్గింపు, కార్పొరేట్ తగ్గింపును ఇవ్వలేదు.
Maruti Suzuki Dzire: భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ సెడాన్‌లలో మారుతి డిజైర్ ఒకటి. ఈ కారు రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసే సుజుకి డిజైర్ కొనుగోలుపై రూ. 10,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

Maruti Suzuki S-Presso: మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో కారుపై కస్టమర్లు రూ. 54,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. రూ. 30,000 నగదు తగ్గింపు, రూ. 20,000 ఎక్స్‌ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బోనస్‌ను అందిస్తుంది. కాగా సీఎన్‌జీ వేరియంట్‌పై కార్పొరేట్ డిస్కాంట్ వర్తించదు. ఆయా డీలర్‌షిప్‌లలో మోడల్స్, ట్రిమ్‌ల లభ్యతపై ఆధారపడి ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని గమనించాలి.


Click it and Unblock the Notifications








