దీపావళి సందర్భంగా ఈ కార్ల ధరలపై భారీగా డిస్కౌంట్లు.. రూ.30 వేల నుంచి లక్ష వరకు తగ్గింపు..!

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో పండుగల సీజన్‌లో ఎక్కువగా విక్రయాలు జరుగుతుంటాయి. కస్లమర్లు కూడా పండుగల సీజన్‌లోనే ఎక్కువగా వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానుంది. కార్ల తయారీ సంస్థలు టాటా, మారుతి, సుజుకి, హ్యుందాయ్, రెనాల్ట్‌ వంటి సంస్థలు తమ ఉత్పత్తులపై మంచి డిస్కౌంట్లను ప్రకటించాయి.

టాటా ఆల్ట్రోజ్‌ : Tata ఆల్ట్రోజ్‌ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మరియు సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.30 వేల వరకు తగ్గింపును కలిగి ఉంది. ఈ కారు ధర రూ. 6.6 లక్షల నుంచి రూ.10.74 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్‌ కారు పెట్రోల్‌, డీజిల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో లభిస్తుంది. 18.05 కి.మీ నుంచి 26.2 kmpl మైలేజీని అందిస్తుంది.

Diwali offer on tata cars

టాటా టియాగో : దీపావళి సందర్భంగా టాటా టియాగో కారుపైన తగ్గింపు ఆఫర్‌ ఇచ్చింది. ఎంట్రీ లెవల్‌, సీఎన్‌జీ వేరియంట్‌పై మాత్రమే రూ.40 వేల తగ్గింపు ప్రయోజనం పొందుతుంది. ఈ కారు ధర రూ.8.10 లక్షల ధరతో ప్రారంభం అవుతుంది. ఈ కారు 26.49 కి.మీ/ కేజీ మైలేజీని ఇస్తుంది.

రెనాల్ట్‌ క్విడ్‌: Renault క్విడ్‌ విక్రయాలను తిరిగి పుంజుకొనేలా చేసేందుకు రూ.50 వేల వరకు తగ్గింపును ప్రకటించారు. ప్రస్తుతం భారత్‌ మార్కె్ట్‌లో ఈ కారు ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల (ఎక్స్‌షోరూం)గా ఉంది. పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ కారు 21.46- 22.3 kmpl మైలేజీని అందిస్తుంది.

renault kiwd

హ్యుందాయ్‌ i20N లైన్‌ : Hyundai i20N లైన్‌ పాత మోడల్‌ కార్లపై డీలర్లు భారీ తగ్గింపును ప్రకటించారు. దీపావళి సందర్భంగా రూ.55,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందుతారని తెలిపారు. ప్రస్తుతం హ్యుందాయ్‌ i20N లైన్‌ కార్లు భారత్‌ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్ల ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.47 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంది.

మారుతి సుజుకి బాలెనో: దీపావళి పండుగ సందర్భంగా మారుతి సుజుకి బాలెనోపై రూ.55 వేల వరకు తగ్గింపు ప్రకటించారు. బాలెనో కారు పెట్రోల్‌, సీఎన్‌జీ ఇంజిన్‌ ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.61 లక్షల నుంచి రూ.9.88 లక్షల మధ్య ఉంటుంది.

Maruti Suzuki baleno

మారుతి సుజుకి వ్యాగన్‌ R : పండుగ సీజన్‌ సందర్భంగా మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌ కారుపైనా రూ.58 వేల వరకు తగ్గింపు ఆఫర్‌ ఉంది. ఈ కారు ధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.42 లక్షల (ఎక్స్‌షోరూం) ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్లలో ఉంది. 23.56 కి.మీ నుంచి 25.19kmpl మైలేజీని ఇస్తుంది. ఈ కారు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి ఇగ్నిస్‌: ఇగ్నిస్‌ కారుపైన రూ.65 వేలు, ఆల్టో k10 పైన రూ.70 వేలు, సెలెరియో కారుపైన రూ.73 వేలు, సిట్రస్‌ C3 పైన లక్ష రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఈ దీపావళి పండుగ సీజన్‌లో మాత్రమే ఈ ఆఫర్ల గడుపు ఉండనుంది. దాంతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఆఫర్లు వేర్వేరుగా ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాలు, డిస్కౌంట్ల కోసం దగ్గరలో ఉన్న డీలర్‌ను సంప్రదించండి.

Maruti Suzuki WagonR car

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2023, 10:04 [IST]
English summary
Diwali 2023 great deals on tata hyundai and maruti renault cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+