హెవీ డ్యూటీ ట్రక్కులు కొనాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌.. ఐచర్‌ నుంచి నాలుగు కొత్త నాన్‌ స్టాప్‌ ట్రక్కులు లాంచ్

దేశంలో ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ ఐచర్(Eicher).. తన కొత్త వాణిజ్య ట్రక్కులను లాంచ్‌ చేసింది. మొత్తం నాలుగు ట్రక్కులు.. ఐచర్ ప్రో 6019XPT టిప్పర్, ఐషర్ ప్రో 6048XP హౌలేజ్ ట్రక్, ఐషర్ ప్రో 6055XP మరియు ఐషర్ ప్రో 6055XP 4x2 ట్రక్కులను విడుదల చేసింది. ఈ ట్రక్కులు ఇంధన-సమర్థవంతమైన, శక్తివంతమైన ఇంజిన్‌లను కలిగి ఉన్నాయని ఐచర్‌ పేర్కొంది.

Eicher Pro 6019XPT: ఈ ట్రక్కు VEDX5, 5.1L 4 సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 240 hp పవర్ అవుట్‌పుట్, 900 Nm ఘన టార్క్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. Eicher Pro 6019XPT టిప్పర్ మెరుగైన పనితీరు, విశ్వసనీయత, మెరుగైన ఆదాయ ఉత్పత్తిని అందించేలా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. దీని విశేషమైన పవర్-టు-వెయిట్ రేషియో మంచి టోయింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Eicher-Launches-Heavy-Duty-Trucks

Eicher Pro 6055XP & Eicher Pro 6055/1 (4X2): ఈ ట్రాక్టర్ ట్రయిలర్‌లు ఎకనామిక్ VEDX8 ఇంజిన్‌తో పనిచేస్తాయి. 300 hp పవర్‌ అవుట్‌పుట్‌, 1200 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.. మెరుగైన పనితీరు కోసం ఈ ట్రక్కులను బలమైన, చక్కటి ట్యూన్డ్ డ్రైవ్‌లైన్‌తో రూపొందించారు.

Eicher Pro 6048XP: ఐచర్‌ ప్రో 6048XP ట్రక్కు 48-టన్నుల GVW కెపాసిటీతో రూపొందించారు. ఈ కమర్షియల్‌ వాహనం ఇంధన-సమర్థవంతమైన VEDX8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. 300 hp శక్తిని, 1200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన పనితీరును, సుదూర రవాణాలో సమర్థవంతంగా పనిచేస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

Eicher-Launches-Heavy-Duty-Trucks

ఐచర్‌ కొత్త కమర్షియల్‌ ట్రక్కుల లాంచ్‌పై VECV, MD & CEO, Mr. వినోద్ అగర్వాల్ మాట్లాడారు. కస్టమర్‌ సాధించే విజయాలతో పాటు తమ అంకితభావాన్ని కూడా చాటిచెప్పేలా ట్రక్కులను రూపొందించినట్లు చెప్పారు. కొత్త పరిశ్రమ బెంచ్‌మార్క్‌లను సెట్‌ చేసే నాన్‌- స్టాప్‌ సిరీస్‌ HD ట్రక్కులను పరిచయం చేయడం సంతోషంగా ఉందనన్నారు.

భారత్‌ లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని, వ్యయాన్ని మెరుగుపరిచే దిశగా పయనిస్తోందని వినోద్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. తమ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న అప్‌టైమ్ సెంటర్ మరియు MyEicher యాప్ మద్దతుతో, ఈ కొత్త శ్రేణి ఐచర్ ట్రక్కులు.. కస్టమర్‌లకు అధిక ప్రొడక్టివిటీ, లాభదాయకతను అందిస్తుందని స్పష్టం చేశారు.

ప్రస్తుతం, ఐచర్‌కు దేశవ్యాప్తంగా 850 టచ్‌పాయింట్‌లు, 425 పైగా అధీకృత సర్వీస్ సెంటర్లు మరియు 8000 కేంద్రాలు ఉన్నాయి. రిమోట్ లొకేషన్‌లలో సహాయం కోసం "Eicher Site Support''ను అందిస్తుంది. 240 కంటే ఎక్కువ సైట్‌లు, 150 కంటే ఎక్కువ కస్టమర్‌లకు సేవలు అందిస్తాయి. అంతేకాకుండా నేరుగా కస్టమర్ సైట్‌లలో 12,000 కంటే ఎక్కువ వాహనాలకు సపోర్ట్‌ ఇస్తున్నాయి.

AI టెక్నాలజీతో నడిచే అన్ని హెవీ-డ్యూటీ వాహనాలకు 100 శాతం కనెక్టివిటీని అందించడం ద్వారా, కంపెనీ ఫ్లీట్ యజమానులకు గరిష్ట సామర్థ్యాన్ని మరియు ఇతర పరిష్కారాలను అందిస్తుందని ఐచర్‌ సంస్థ తెలిపింది. ట్రక్కుల రన్నింగ్ టైమ్‌లు, ఫ్యూయెల్‌ కెపాసిటీ, ​​డ్రైవర్ ప్రవర్తన, శిక్షణ అవసరాలతో సహా ఫ్లీట్ పనితీరు మొత్తం 'MyEicher'తో అనుసంధానించబడి ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 21, 2023, 9:15 [IST]
English summary
Eicher launches non stop heavy duty trucks in india details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+