Electric Cars భారత్‌లో ఎన్నిరకాల ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులో ఉన్నాయో తెలుసా..?

మీరు ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే భారత్‌లో ఏయే ఈవీలు అందుబాటులో ఉన్నాయో.. వాటి రేంజ్‌ మరియు ధర ఎంత ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే మీ కోసమే ఈ స్టోరీ. ఇందులో భారత్‌లో అందుబాటులో ఉన్న 27 ఎలక్ట్రిక్‌ కార్ల గురించి పూర్తి వివరాలు అందించాం.

MG కామెట్‌ : ఈ కారు తాజాగా విడుదలైంది. 17.3kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. అలాగే సింగిల్‌ ఛార్జింగ్‌లో 230 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఆ కారు సింగిల్‌ మోటార్‌ 42 bhp శక్తి మరియు 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు ధర రూ. 7.98 లక్షలు. భారత్‌లో అందుబాటు ధరల్లో ఉన్న వాహనాల్లో ఇది ఒకటి.

MG Comet

Tata టియాగో EV: ఈ కారు ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు. ‌అయితే ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 19.2 kWh బ్యాటరీ, 250 రేంజ్‌. మరియు 24kWh బ్యాటరీ, 315 km రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 3.3kW లేదా 7.2 kW AC ఛార్జర్‌తో వస్తుంది. 60 bhp శక్తి, 110Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata Tiago

ఫ్రెంచ్‌ బ్రాండ్‌కు చెందిన సిట్రయోన్‌ eC3 తొలి ఈవీ. ఈ కారు ప్రధానంగా టియాగో ఈవీకి ప్రత్యర్థి. మరియు పెద్ద పుట్‌ప్రింట్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ఉండే సింగిల్‌ మోటర్‌ 56bhp శక్తి మరియు 143Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata tigor

Tata టిగోర్‌ ఈవీ : ఈ కారు టియాగో ఈవీ యొక్క కౌంటర్‌పార్ట్‌ మరియు ఈ ఈవీ పనితీరు గణనీయంగా ఉంటుంది. 26kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 74 bhp శక్తి మరియు 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టియోగో ఈవీ మాదిరిగానే రేంజ్‌ను కలిగి ఉంటుంది. భారత్‌లో ఉన్న సరసమైన ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇదొకటి.

Tata Nexon Ev Max

టాటా నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌: ఈ ఎలక్ట్రిక్‌ కారు 30.2 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు 312 km రేంజ్‌ అందిస్తుంది. సింగిల్‌ మోటార్‌తో 127 bhp శక్తి మరియు 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 10 సెకన్లలో 0 km/h నుంచి 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

mahindra XUV400

మహీంద్రా ఈవీల్లో.. మహీంద్రా XUV400 రీ ఎంట్రీని సూచిస్తుంది. ఈ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 34.5kWh బ్యాటరీ సామర్థ్యం, 375km రేంజ్‌ మరియు 39.5kWh బ్యాటరీ సామర్థ్యం, 456 km రేంజ్‌లో వేరియంట్లలో ఉన్నాయి. ఈ మహీంద్రా ఈవీ టాటా నెక్సాన్‌ ఈవీ ప్రైమ్‌ మరియు మ్యాక్స్‌కు పోటీగా ఉంటాయి. ఈ కారు 148 bhp శక్తి, 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌: ఈ ఈవీ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న పాపులర్‌ మోడల్. ఈ కారు 40.5kWh బ్యాటరీ సామర్థ్యం మరియు 453 km రేంజ్‌తో వస్తుంది. 141bhp శక్తి మరియు 250Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కారు కేవలం 9 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుందని టాటా తెలిపింది.

MG ZS ఈవీ భారత్‌ దేశంలో MG యొక్క తొలి ఎలక్ట్రిక్‌ వాహనం. ఈ కారు 50.3kWh బ్యాటరీ సామర్థ్యం మరియు 461 కి.మీ రేంజ్‌ కలిగి ఉంటుంది. 174 bhp శక్తి మరియు 280 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హ్యూందాయ్‌ కోనా ఈవీ.. భారత్‌లో హ్యూందాయ్‌ యొక్క తొలి ఎలక్ట్రిక్‌ వాహనం. ఈ కారు ప్రారంభ ధర రూ.23.84 లక్షలు. ఈ ఈవీ బ్యాటరీ ప్యాక్‌, రేంజ్‌లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్‌ మరియు మహీంద్రా XUV400తో సమానంగా ఉంటుంది. అయితే మరో కోనా ఈవీ కూడా అందుబాటులో ఉన్న భారత్‌లో ఆ వాహనం విడదల చేయకపోవచ్చని సమాచారం.

చైనాకు చెందిన BYD e6 భారత్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఈవీ తొలుత కమర్షియల్‌ వినియోగం కోసం అందుబాటులో ఉండేది. అనంతరం పీవీ స్పేస్‌లోకి ప్రవేశించింది. ఈ ఈవీ 71.7kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ఈవీ సింగిల్‌ మోటార్‌ 94 bhp శక్తి మరియు 180 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 415 రేంజ్‌ను ఇస్తుంది.

BYD Atto 3 60.48 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. మరియు 521 రేంజ్ ఇస్తుంది. ఈ మోటర్‌ 201 bhp శక్తి, 310 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ ఎలక్ట్రిక్‌ కారు కేవలం 7 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది. రోటెటింగ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్ర్రీన్‌ మరియు ఆకర్షణీయమైన లోపలి భాగం ఈ కారుకు ప్రత్యేకత తీసుకొచ్చింది.

హ్యూందాయ్‌ ఐయోనిక్ 5... ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు పొందిన ఎలక్ట్రిక్‌ కార్లలో ఒకటి. నియో రెట్రో డిజైన్‌ ఈ కారు సొంతం. మరియు 72.6 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మరియు 631 km రేంజ్‌ను కలిగి ఉంది. 215 bhp, 350 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5.2 సెకన్లలో ఈ ఈవీ 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. దీని థర 45.95 లక్షలు.

మిని కూపర్‌ ఎస్‌ఈ వాహనం ధర రూ. 50.90 లక్షలు. ఈ కారు 32.6kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 270km రేంజ్‌ను అందిస్తుంది. 184 bhp, 270 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 7.3 సెకన్లలో 0-100km/h వేగం అందుకుంటుంది.

వాల్వ్‌ XC40 రీఛార్జి రెండు మోటార్లతో వస్తుంది. భారత్‌లో అత్యంత సరసమైన AWD ఎలక్ట్రిక్‌ వాహనంగా గుర్తింపు పొందింది. ఈ వాహనం 78 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. మరియు 418 రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది. 402 bhp శక్తి, 660 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు కేవలం 4.8 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.

జర్మనీకి చెందిన BMW i4 ఈవీ 83.9 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు 590 km రేంజ్‌ ఇస్తుందని సంస్థ వెల్లడించింది. మరియు డ్యూయల్‌ మోటార్‌తో AWDతో వస్తుంది. 335 bhp శక్తి, 430 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు కేవలం 5.7 సెకన్లలో 0-100 km/h ను కలిగి ఉంటుంది. ఈ i4.. భారత్‌లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్‌ వాహనం.

మెర్సిడెస్‌ బెంజ్‌ EQB కారు.. GLB 3 క్రాస్‌ఓవర్‌ SUV ఎలక్ట్రిక్‌ వెర్షన్‌. త్రీ స్టార్‌ రేటింగ్‌ కలిగిన అత్యంత సరసమైన ఎలక్ట్రిక్‌ కారు ఇది. ఈ ఈవీ 66.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 423 km రేంజ్‌ ఇస్తుంది. 225 bhp శక్తి మరియు 390 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. EQB కారు కేవలం 8 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.

మెర్సిడెస్‌ బెంజ్‌ EQC ఈవీ మెర్క్‌ యొక్క తొలి ఎలక్ట్రిక్‌ వాహనం. ఈ ఈవీ GLC ఎలక్ట్రిఫైడ్‌ వెర్షన్‌. ప్రపంచంలో పాపులర్‌ మిడ్‌ సైజ్‌ లగ్జరీ ఎలక్ట్రిక్‌ SUVల్లో ఈ ఈవీ ఒకటి. ఈ కారు 80kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 450 km రేంజ్‌ ఇస్తుంది, మరియు 402 bhp, 760 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 5.1 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.

Audi e tron

భారత్‌దేశంలో అత్యంత సరసమైన ఈవీలో ఆడీ e-tron ఒకటి. ఈ జర్మనీ సంస్థ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 71kWh బ్యాటరీ, 379km రేంజ్‌ మరియు 95 kWh బ్యాటరీ, 484 km వేరియంట్లలో అందుబాటులో ఉంది. రెండు డ్యూయల్‌ మోటర్‌తో AWD టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఈ కారు రెండు వేరియంట్లు వరుసగా 308 bhp, 540 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 402 bhp, 664Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Jaguar i pace

భారత్‌ సహా విదేశాల్లో జాగ్వార్‌ యొక్క ఏకైన ఎలక్ట్రిక్ వాహనం జాగ్వార్‌ i-pace. ఈ ఈవీ 90kWh బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 470 km రేంజ్‌ ఇస్తుంది. ఈ కారు రెండు మోటర్‌లతో 394 bhp, 696 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆడీ e-tron స్పోర్ట్‌బ్యాక్ ఆకర్షణీయమైన రూఫ్‌లైన్‌ను కలిగి ఉంటుంది. మరియు SUV కి సమానమైన పనితీరును కనబరుస్తుంది. భారత్‌లో ఈ ఈవీ ధర రూ.18 లక్షలు ఉంది.

BMQ iX ఈవీ.. i4 మాదిరిగానే ఉంటుంది. ఈ కారు 76.6 kWh బ్యాటరీ కలిగి ఉంటుంది. మరియు 425 km రేంజ్‌ ఇస్తుంది. 326 bhp, 630 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎండబ్ల్యూ iX కేవలం 6.1 సెకన్లలో 0-100 km/h వేగం అంటుకుంటుంది.

పోర్ష్చే టైకాన్‌ యూరోపియన్‌ మార్కెట్‌లో టెస్లా మోడల్‌ Sకు ప్రత్యేర్థి. మరియు అయితే టెస్లాలో లేని విలాసవంతమైన అనుభూతిని ఇస్తుంది. ఈ కారు 93.4 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరియు 484 km రేంజ్‌ను ఇస్తుంది. 625 bhp శక్తి, 1050 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కేవలం 2.8 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.

మెర్సిడెస్‌ బెంజ్‌ EQS భారత్‌లో అందుబాటలో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్ల కంటే అధిక బ్యాటరీ ప్యాక్‌ను కలిసి ఉంటుంది. 107.8 kWh బ్యాటరీ ప్యాక్‌తో 857 km రేంజ్‌ను అందిస్తుంది. డ్యూయల్‌ మోటార్‌ 516 bhp మరియు 855 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాంతోపాటు 4.3 సెకన్లలో 100 km/h వేగాన్ని అందుకుంటుంది.

ఆడీ e-tron GT.. పోర్ష్చే లుక్‌ లేకపోయినా, చాలా వరకు అదే ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇంటీరియల్‌లో ఎక్కువ నాబ్స్‌ మరియు బటన్లను కలిగి ఉంటుంది.

పోర్ష్చే టేకాన్‌ క్రాస్‌ టురిస్మో యూరోప్‌లో హాటెస్ట్‌ సెగ్మెంట్‌లో ఒకటి. ఈ వెర్షన్‌ భారత్‌లో లేదు. ఇందుకు బదులుగా రగ్గడ్‌ వెర్షన్‌ అయిన క్రాస్‌ టురిస్మో కలిసి ఉంది.

BMW i7 ఈవీ 101.78 బ్యాటరీ ప్యా్క్‌తో వస్తుంది. 625 km రేంజ్‌ కలిగి ఉంటుంది. ఈ కారు డ్యూయల్‌ మోటార‌్లు 536 bhp శక్తి మరియు 745 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.7 సెకన్లలో 0-100km/h వేగాన్ని అందుకుంటుంది.

మెర్సిడెస్‌ బెంజ్‌ AMG EQS 107.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. మరియు 751 bhp శక్తి, 1020 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.4 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 17, 2023, 20:14 [IST]
English summary
Electric cars which are available in india market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+