భారీ డిమాండ్‌ ఉన్నా.. Ritz కారును మారుతి సంస్థ ఎందుకు నిలిపేసింది..?

భారత ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ సంస్థ. మారుతి సంస్థ అనేక వేర్వేరు రకాల కార్లను కలిగి ఉంది. అందులో అనేక వాహనాలు మార్కెట్‌లో విజయవంతం అయ్యాయి. అయితే కొన్ని మోడల్‌ కార్లను మారుతి సంస్థ నిలివేసింది. అందులో భారీగా ఆదరణ పొందిన Maruti Suzuki Ritz కారు కూడా ఉంది.

మారుతి సుజుకి రిట్జ్‌ కారును 2009లో విడుదల చేశారు. సుమారు 2017 వరకు కొనుగోలుకు అందుబాటులో ఉండేది. భారత్ మార్కెట్‌లో సుమారు 4 లక్షల యూనిట్ల రిట్జ్‌ కార్లను విక్రయించింది. రిట్జ్‌ కారు డిజైన్‌ చాలా మందిని ఆకర్షించింది. మారుతి రిట్జ్‌ పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌లో విక్రయంచబడింది.

	 why Maruti Suzuki Ritz discontinued

మారుతి సుజుకి సంస్థ రిట్జ్‌ కారు స్థానంలో కొత్త స్పోర్టీ డిజైన్ కలిగిన ఇగ్నిస్‌ను ప్రవేశపెట్టింది. తన కారు పోర్ట్‌ఫోలియోను రీఫ్రెష్‌ చేయడంలో భాగంగా రిట్జ్‌ను నిలిపేసింది. అయితే మారుతి రిట్జ్‌ కారు అత్యంత ప్రజాదరణ పొంది హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి. ఈ కారు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో తనదైన ముద్రవేసింది. అయితే ఇంటీరియర్స్‌, ప్రీమియం లుక్‌ కలిగినా.. రిట్జ్‌ను నిలిపేసింది.

మారుతి సుజుకి రిట్జ్‌ కారు స్విఫ్ట్‌ మాదిరిగా అదే ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇందులో 1.2 పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. దాంతోపాటు 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్ కూడా ఉంది. ఈ కారు పెట్రోల్‌ ఇంజిన్లు 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, 4- స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. అదే డీజిల్‌ ఇంజిన్‌ 6- స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

why Maruti Suzuki Ritz discontinued

అయితే ప్రారంభంలో రిట్జ్‌ గణనీయమైన విక్రయాలను కలిగి ఉన్నా.. అనంతర కాలంలో కొత్త మోడళ్లలో పోటీ పడలేకపోయింది. దీంతోపాటు అప్‌గ్రేడ్‌ కూడా లేకపోవడంతో గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇది కూడా రిట్జ్‌ విక్రయాలు నిలిపివేతకు కారణం. అయితే సంస్థ విక్రయాల్లో మారుతి రిట్జ్‌ పాత్ర ఉంది.

మారుతి సుజుకి రిట్జ్‌ కారు ధర రూ.4.48 లక్షల నుంచి రూ.6.58 లక్షలుగా ఉండేది. ఈ కారు డ్రైవర్‌ సైడ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు సహా యాంటీ లాక్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ సహా అనేక స్టాండర్డ్‌ ఫీచర్లను కలిగి ఉంది. మరియు సురక్షితమైన కారుగా గుర్తింపు పొందింది. రిట్జ్‌ కారు స్ట్లైల్, కంఫర్ట్‌, ఫర్మార్మెన్స్‌ ను అందించింది.

why Maruti Suzuki Ritz discontinued

రిట్జ్‌ కారు కేవలం సిటీలోనే కారు, హైవే సహా లాంగ్ డ్రైవ్‌లకు కూడా సులభంగా హ్యాండిల్‌ చేయగలిగింది. విశాలమైన క్యాబిన్‌లోనూ రిట్జ్‌ కారు తన ప్రత్యేకతను చాటుకుంది. అయితే ఈ కారు అమ్మకాల నిలిపేసిన సంవత్సరాల తర్వాత కూడా ఈ కారు మంచి రీసేల్‌ విలువను కలిగి ఉంది. ఇదే రిట్జ్ కారు ప్రత్యేకతను నిదర్శనం.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, September 14, 2023, 12:51 [IST]
English summary
Even when demand was high why maruti suzuki ritz discontinued
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+