15 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. 33 శాతం ఖర్చు ఆదా..
ఇటీవల ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ(Exponent Energy) ఎలక్ట్రిక్ వాహనాల కోసం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఆవిష్కరించింది. ఈ సాంకేతికత బ్యాటరీ ప్యాక్ (ఇ ప్యాక్), ఛార్జింగ్ స్టేషన్ (ఇ పంప్) మరియు ఛార్జింగ్ కనెక్టర్ (ఇ ప్లగ్)ని ఉపయోగించి కేవలం 15 నిమిషాల్లో ఈవీలను వేగంగా పూర్తి ఛార్జింగ్ చేయగలదు. అదేవిధంగా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ కోసం మొదటిసారిగా సాధారణ LFP సెల్‌ల నుంచి దీనిని తయారు చేశారు.
ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలు 30 శాతం తక్కువ ధరలకు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. అదనంగా, దాని 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ EV ఛార్జింగ్ ఖర్చులను 33 శాతం తగ్గించగలదని పేర్కొంది. వాటర్ బేస్‌డ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా బ్యాటరీని 15 నిమిషాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తుంది. డ్రైవ్‌స్పార్క్ పాఠకులకు దీని గురించి మరిన్ని వివరాలను అందించడానికి వీడియోను అందిస్తున్నాం.
ఈ కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడిన ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అరుణ్ వినాయక్.. ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపడంతో, వినియోగదారులకు వేగంగా ఛార్జ్ చేసే EVలు అవసరమని అన్నారు. తక్కువ ఖర్చుతో అధిక రేంజ్ అందించడం తమ ప్రత్యేకత అని పేర్కొన్నారు. 15 నిమిషాల వేగవంతమైన ఛార్జింగ్‌తో సంప్రదాయ ఎలక్ట్రిక్ వాహనాల కంటే 30 శాతం వరకు తక్కువ ధరలో లభిస్తుందని వెల్లడించారు.

గత 3 నెలల్లో, ఎక్స్‌పోనెంట్ ఎనర్జీ 25,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ సెషన్‌ల ద్వారా బెంగళూరులో 200 కంటే ఎక్కువ EVల ఎక్స్‌పోనెంట్ ఎనర్జీతో 10,00,000 కిలోమీటర్లకు పైగా పూర్తి చేసింది. అలాగే, బెంగళూరులోని మహదేవ్‌పూర్‌లోని తమ ఇ పంప్‌లో ఒకే రోజులో 41 ఛార్జింగ్ సెషన్‌లను పూర్తి చేయడం ద్వారా కంపెనీ EV పరిశ్రమలో కొత్త మైలురాయిని చేరుకుంది. ప్రస్తుతం బెంగళూరులో 30 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది.


Click it and Unblock the Notifications








