డిప్యూటీ సీఎం మెచ్చిన హెడ్రోజన్‌ పవర్డ్‌ కారు.. 1 లీటర్‌పై 250 కి.మీ వెళ్లొచ్చట, ఇంకా ఎన్నో ప్రత్యేకతలు.!!

ఆటో మొబైల్‌ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు పెట్రోల్‌, డీజిల్‌ కార్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు వస్తున్నాయి. అంతేకాకుండా హైడ్రోజన్‌తో నడిచే బస్సులు కూడా జనాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ రైతు కుమారుడు పూర్తిగా హైడ్రోజన్‌తో నడిచే కారును తయారుచేసి యావత్‌ దేశాన్ని ఆశ్చర్యపరిచాడు.

ఫ్యూయెల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు, హైడ్రోజన్‌ పవర్‌ ఆధారిత వాహనాలు, ఇథనాల్‌తో నడిచే వాహనాలపై ఆటో మేకర్లు దృష్టి సారిస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించే డీజిల్‌ వాహనాలపై కేంద్రం ఉక్కు పాదం మోపుతుండటంతో మరికొన్ని సంవత్సరాలలో ఇక డీజిల్‌ కార్ల ఉత్పత్తి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.

Hydrogen-Powered-Car

ఈ నేపథ్యంలో ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో హెడ్రోజన్‌ బస్సులను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఫ్యూయెల్‌తో నడిచే వాటికి ప్రత్యామ్నాయంగా వాహనాల తయారీకీ కేంద్రం సబ్సిడీలు కూడా అందించడంతో ఆ తరహా వాహనాల తయారీలు కూడా ఊపందుకుంటున్నాయి. కాగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు కుమారుడు గతేడాది హైడ్రోజన్‌ పవర్‌తో నడిచే కారును తయారుచేసి వార్తల్లో నిలిచాడు.

తక్కువ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన డిజైన్‌తో ఈ కారును రూపొందించారు. అయితే ఇప్పుడు ఏడాది తర్వాత ఈ హైడ్రోజన్ కారు.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆకర్షించింది. ఈ హైడ్రోజన్ కారును చంద్రాపూర్‌కు చెందిన హెర్షల్ నక్షణే తయారుచేయగా అతనిని కలిసిన ఫడ్నవీస్.. ఆ కారు తయారీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Hydrogen-Powered-Car

హెర్షల్‌ తయారుచేసిన ఈ కారు గురించి డిప్యూటీ సీఎం.. 'X' (ట్విట్టర్) లో షేర్‌ చేశారు. ఇంట్లోనే స్వయంగా కృత్రిమ మేధస్సు (AI) పవర్డ్ గ్రీన్ హైడ్రోజన్ కారును తయారు చేసిన యువకుడిని ఆయన అభినందించి.. శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా హైడ్రోజన్‌తో నడిచే కారును టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తూ అందుకు సంబంధించిన పలు చిత్రాలను పంచుకున్నారు.

కాగా హెర్షల్ తయారు చేసిన ఈ కారు ప్రస్తుతం ఉత్పత్తిలో ఉన్నట్లు సమాచారం. దీనిని హైడ్రోజన్ పవర్‌తో నడిచే మోడల్‌గా కావడంతో.. కేవలం 1 లీటర్ ఇంధనాన్ని మండించడం ద్వారా 250 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చేలా దీనిని తయారు చేశారు. ఇంకా ఈ కారు గరిష్ఠంగా గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ కారును తయారు చేసేందుకు రూ. 25 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

Hydrogen-Powered-Car

ఇక ఈ హైడ్రోజన్ కారు ప్రత్యేకతల విషయానికొస్తే.. ఈ కారును ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ (AI) ద్వారా నియంత్రించవచ్చు. ఇంకా ఇందులో సెల్ఫ్‌ డ్రైవింగ్ ఫీచర్‌ ఉంది. ఈ కారును ఆకర్షణీయమైన గ్రీన్ కలర్‌లో అందుబాటులో ఉంటుంది. ఇంకా హోమ్ మేడ్ సిజర్ డోర్స్, సన్‌రూఫ్‌ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది.

హెర్షల్ బృందం ఈ కారును భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కార్లను ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తే వాటి ధర కూడా తగ్గుతుందని హెర్షల్ అన్నారు. ప్రస్తుతం దీని ధర బాగా పెరగగా.. ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. కాగా ఈ కారు ఎప్పుడు లాంచ్‌ అవుతుందనే వివరాలు అందుబాటులో లేవు.

Hydrogen-Powered-Car

ఈ కారు తయారీకి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటిస్తూ త్వరగా కస్టమర్లకు అందాబుటులోకి వస్తే.. ఇది రికార్డు సృష్టించే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ కి.మీ ప్రయాణించేలా దీనిని రూపొందించడంతో కస్టమర్లకు ఈజీగా ఆకర్షిస్తుంది. ఇంకా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ కారు కావడంతో చాలా మంది బెస్ట్‌ ఆప్షన్‌గా నిలిచే సూచనలు కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2023, 17:56 [IST]
English summary
Farmer s son invented hydrogen powered ai car maharashtra dy cm praises him
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+