మహీంద్రా కారులో లేని టాటా కార్లలో ఉన్న ఈ ప్రత్యేక ఫీచర్ల గురించి తెలుసా..!

భారత్‌ మార్కెట్‌లో టాటా సంస్థ ఇటీవలే ఫేస్‌లిఫ్టెడ్‌ హారియర్‌, సఫారీ కార్లను విడుదల చేసింది. కొత్త మోడల్‌ కార్లు గతం కంటే మెరుగైన డిజైన్‌, భద్రతా, ఇతర స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి.

టాటా హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ ధర రూ.15.49 లక్షల నుంచి రూ.26.44 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అదే టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ కారు రూ.16.19 లక్షల నుంచి రూ.27.34 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. టాటా హారియర్‌, సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్లు మహీంద్రా XUV700 SUVలో లేని కొన్ని మెరుగైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Tata safari facelift

టచ్‌స్క్రీన్‌ : మహీంద్రా XUV700 కారులో డ్యూయల్‌ ఇంటిగ్రేటెడ్ 10.25 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ కారు విడుదల సమయంలో ఈ ఫీచర్‌ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత ఇదే సెటప్‌తో చాలా కార్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే టాటా హారియర్‌, సఫారీ కార్లు ఇంటిగ్రేటెడ్‌ టచ్‌స్క్రీన్ సెటప్‌ కలిగి లేదు. అయితే 12.3 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

వెంటిలేటెడ్‌ సీట్లు : టాటా కొత్త హారియర్‌, సఫారీ ఎస్‌యూవీలు, మహీంద్రా XUV700 వాహనం కూడా డ్యూయల్‌ జోన్‌ క్లైమెట్ కంట్రోల్‌ను కలిగి ఉంటాయి. అయితే హారియర్‌, సఫారీ ముందు సీట్లకు వెంటిలేటెడ్‌ సీట్లను కలిగి ఉన్నాయి. ఇవి మహీంద్రా SUVలో అందించలేదు. అయితే సఫారీ 6 సీటర్‌ వేరియంట్ రెండో వరుస సీట్లకు కూడా వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్‌ ఉంటుంది.

tata safari 2023

పాడిల్ షిఫ్టర్లు : మహీంద్రా XUV700 ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్నా గానీ టాటా సఫారీ కొత్త వెర్షన్‌ మాత్రమే పాడిల్‌ షిఫ్టర్లను అందిస్తుంది. అయితే ఈ ఫీచర్‌ మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుందని తెలుస్తోంది.

ఆటో డిమ్నింగ్ IRVM : టాటా సఫారీ ఫేస్‌లిఫ్టెడ్‌ వెర్షన్‌ మాత్రమే ఆటో డిమ్మింగ్ IRVM ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ ఫీచర్‌ చాలా ఉపయోగపడుతుంది. వెనుక కార్ల లైట్ల వల్ల డ్రైవర్‌ ఇబ్బంది పడకుండా ఈ ఫీచర్ సాయం చేస్తుంది. ఫలితంగా ప్రయాణికుల భద్రతను మెరుగుపరుస్తుంది.

Tata safari and harrier SUV 8 features

4 వే అడ్జస్టబుల్‌ ఫ్రంట్‌ ప్యాసింజర్ సీట్లు : టాటా సఫారీ, మహీంద్రా XUV 700 కార్లు 6 వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్‌తో వస్తాయి. అయితే సఫారీ ఫేస్‌లిఫ్ట్‌ SUV మాత్రమే 4 వే అడ్జస్టబుల్ ఫ్రంట్‌ ప్యాసింజర్‌ సీట్‌ను కలిగి ఉంటుంది.

పవర్డ్‌ టెయిల్‌గేట్‌ : టాటా సఫారీ, హారియర్‌ కొత్త వెర్షన్లు పవర్డ్‌ టెయిల్‌గేట్‌లను కలిగి ఉంటాయి. అదే మహీంద్రా XUV 700 లో ఈ ఫీచర్‌ లేదు.

tata harrier 2023

అల్లాయ్‌ వీల్స్‌ : టాటా సఫారీ హై స్పెక్‌ వేరియంట్‌ 19 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. మెరుగైన అనుభూతిని అందిస్తుంది.

రెండో వరుస కెప్టెన్‌ సీట్లు : రెండు టాటా కొత్త వెర్షన్‌ కార్లు కెప్టెన్‌ సీట్లను కలిగి ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ ఫీచర్‌ కారణంగా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే మహీంద్రా వాహనంలో ఈ ఫీచర్‌ లేదు. అయితే రెండో వరుసలో బెంచ్‌ సీట్లను కలిగి ఉంటుంది.

tata safari new 2023

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, October 23, 2023, 15:11 [IST]
English summary
Features in tata safari and harrier suv but absent in mahindra xuv700
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+