హెల్మెట్‌ లేదని కారు యజమానికి చలాన్.. కారులో హెల్మెట్ పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు

బైక్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌, కారు నడిపేటప్పుడు సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి. వీటితో పాటు వాహనదారుడి వద్ద సంబంధింత ధ్రువపత్రాలు కూడా ఉండాలి. ఇవేవీ లేకపోతే జరిమానా విధించడం ట్రాఫిక్‌ పోలీసుల వంతు. కానీ ఇన్ని ఉన్నా ఓ యువకుడికి జరిమానా విధించారు మన పోలీసులు. కారు నడుపుతూ హెల్మెట్‌ ధరించలేదని ఓవర్‌ టేక్‌ చేసి మరీ ఫైన్‌ వేశారు. ఆ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

రాజస్థాన్‌లోని బిహివాడ దగ్గరలోని కోహ్రీ కుర్ద్‌కు చెందిన ఖలీల్ మహ్మద్‌ అనే యువకుడికి హ్యుందాయ్ క్రెటా కారు ఉంది. ఇటీవల ఓ రోజు మధ్యాహ్నం ఖలీల్‌ తన కారులో బిహివాడి వైపు వెళ్తున్నారు. అలా వెళ్తుండగా సదరు యువకుడికి ఓ షాక్‌ తగిలింది. ఓ కారు ఖలీల్‌ కారును ఓవర్‌టేక్ చేసి వాహనానికి అడ్డుగా నిలిచింది. బిత్తిరిపోయిన ఖలీల్‌ వెంటనే తన కారు ఆపారు. పోలీసులు తన కారును నిలువరించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

fine on car owner

ఓవర్‌ టేక్‌ చేసిన కారులో నుంచి దిగిన పోలీసులు ఖలీల్‌ వద్దకు వచ్చి రూ.2000 అడిగారు. కారణం లేకుండా డబ్బులు అడిగితే ఇచ్చేందుకు ఖలీల్‌ నిరాకరించారు. కారుకు సంబంధించిన పత్రాలు చూపించమంటే చూపించారు. పత్రాలు సరిగ్గా ఉన్నా మళ్లీ డబ్బులు ఈ సారి పోలీసులు తమ ఏకంగా జరిమానా రశీదు ఇచ్చి వెళ్లిపోయారు. ఈ ఉదంతాన్ని చూస్తున్న యువకుడు ఏమీ చేయాలో తెలియక తల పట్టుకున్నాడు.

జరిమానా రసీదు చూడగానే ఖంగు తిన్న ఖలీల్‌.. వెంటనే బిహివాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హెల్మెట్‌ లేకుండా కారు నడుపుతున్నందుకు జరిమానా విధించినట్లుగా పోలీసులు రసీదులో పేర్కొన్నట్లు ఖలీల్‌ ఆరోపించారు. తన కంప్లెయింట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా హెల్మెట్‌ పెట్టుకుని కారు నడుపుతూ ఆ జరిమానా విధించిన పోలీసులకు ఝలక్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారత్‌లో ఇలా హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడుపుతున్న వారికి జరిమానా విధించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. ఈ తరహా ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

అంతే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించకుండా పోలీసులు లంచం తీసుకుంటున్న సంఘటనలూ ఎక్కువగా ఉన్నాయి. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేదే. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసులపై బాధితులు వీడియో ఆధారాలతో పట్టుకున్నప్పటికీ వారిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ట్రాఫిక్ పోలీసులు విచక్షణారహితంగా జరిమానాలు విధించడం, హెల్మెట్ పెట్టుకోనందుకు కారులో వచ్చే వ్యక్తికి జరిమానా, బైక్‌పై నడిపే వ్యక్తి సీటు బెల్ట్ పెట్టుకోనందుకు జరిమానా విధించడం వారు వృత్తి పట్ల ఎంత నిబద్ధతగా ఉన్నారో తెలుస్తోంది. ఇలా నిర్లక్ష్యంగా పని చేసే పోలీసులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 15, 2023, 15:55 [IST]
English summary
Fine on car owner for not wearing helmet incident took place in rajasthan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+