Hydrogen Bus: తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ బస్సు ప్రారంభం.. త్వరలో అందుబాటులోకి మరో 15 బస్సులు

దేశంలో తొలి గ్రీన్‌ హైడ్రోజన్‌ బస్‌ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయెల్‌ సెల్ బస్సును(Green Hydrogen Fuel Cell) ప్రారంభించారు. ఢిల్లీ NCRలో త్వరలో 15 అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు.

ఇండియా గేట్‌ వద్ద కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి రెండు బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. న్యూ జెన్‌ FCEV బస్సులు భారతదేశంలో గ్రీన్ మొబిలిటీకి ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ అన్నారు. హైడ్రోజన్ యొక్క శక్తివంతమైన సామర్థ్యాన్ని శక్తి వాహకంగా ఉపయోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తు ఇంధనంగా హెడ్రోజన్‌ మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. భారత్‌ డీకార్బనైజేషన్‌ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

Green-Hydrogen-Bus

'భవిష్యత్తులో ప్రపంచ డిమాండ్ నాలుగు నుండి ఏడు రెట్లు పెరిగి 2050 నాటికి 500 నుండి 800 మిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా.' దేశీయ డిమాండ్ ప్రస్తుతం 6 మిలియన్ టన్నుల నుంచి 2050 నాటికి 25 నుండి 28 MTకి నాలుగు రెట్లు పెరగవచ్చు. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని PSUలు 2030 నాటికి దాదాపు 1 MMTPA గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయగలవు.' అని మంత్రి అన్నారు.

"ఈ గ్రీన్ హైడ్రోజన్ పవర్డ్ బస్సు దేశంలో పట్టణ రవాణా వ్యవస్థను మారుస్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను నిశితంగా పర్యవేక్షిస్తాం. శుద్ధి కర్మాగారాల్లో గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి మరియు ఉపయోగించేందుకు మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మంత్రిత్వ శాఖ తన ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది" అని మంత్రి చెప్పారు.

Green-Hydrogen-Bus

ఈ హెడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ పవర్డ్‌ బస్సులో 350-బార్ హైడ్రోజన్ స్టోరేజ్ సిస్టమ్, 70 Kw ఫ్యూయెల్‌ సెల్ స్టాక్, ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్‌తో కూడిన సేఫ్టీ, ఇంటిలిజెంట్‌ రవాణా వ్యవస్థ, టెలిమాటిక్స్ ట్రాకింగ్‌తో పాటు సమర్థవంతమైన రూమి ఇంటీరియర్ ఉన్నాయి.

హైడ్రోజన్‌ ఫ్యూయెల్‌ సెల్‌ పవర్డ్‌ బస్సుల తయారీ కోసం ప్రస్తుతం సహజ వాయువు పైప్‌లైన్‌లలో హైడ్రోజన్ కలపడం, ఎలక్ట్రోలైజర్ ఆధారిత సాంకేతికతల స్థానికీకరణ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి జీవసంబంధ మార్గాలను ప్రోత్సహించడం వంటి ప్రాజెక్టులు దూకుడుగా కొనసాగుతున్నాయి. హైడ్రోజన్ బస్సుల్లో, ఫ్యూయెల్‌ సెల్‌ హైడ్రోజన్, గాలిని ఉపయోగించి బస్సుకు శక్తినివ్వడానికి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

Green-Hydrogen-Bus

కాబట్టి ఈ విధానం ద్వారా బస్సు విడుదల చేసే వ్యర్థం నీరు మాత్రమే. గ్యాసోలిన్ పవర్డ్ ఇంజిన్లతో పోలిస్తే దీని ఫ్యూయెల్‌ సెల్స్‌ మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. డీజిల్ మరియు పెట్రోల్‌తో నడిచే సంప్రదాయ బస్సుల మాదిరిగా కాకుండా ఇవి చాలా పర్యావరణ అనుకూలమైన రవాణా విధానమని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ తెలిపారు.

లీటరుకు 2.5 కి.మీ నుంచి 3 కి.మీ మైలేజ్‌ని ఇచ్చే డీజిల్ బస్సులతో పోలిస్తే, ఈ బస్సులు కిలో హైడ్రోజన్‌కు 12 కి.మీ ఇంధన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇంకా, హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనానికి నిమిషాల వ్యవధిలోనే ఫ్యూయెల్‌ ట్యాంక్‌లో ఇంధనం నింపుకోవచ్చు. భవిష్యత్తులో ఈ బస్సుల రాకతో పర్యావరణానికి మరింత మేలు జరుగుతుందన ఆశించవచ్చు.

Green-Hydrogen-Bus

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 26, 2023, 11:45 [IST]
English summary
First hydrogen fuel powered bus launch in delhi by union minister hardeep singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+