సెకండ్‌ హ్యాండ్‌ కార్‌ మార్కెట్లో ఈ రెండు మోడల్‌ కార్లకు విపరీతమైన క్రేజ్‌.. వీటినే ఎందుకు కొంటున్నారంటే.!!

భారత్‌లో ప్రస్తుతం కార్లకు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ పరంగా, ఆఫీస్‌ పరంగా కారు తప్పనిసరిగా అయిపోయింది. అందుకే కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్‌లో కార్లను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో కొత్త కార్లతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు కూడా డిమాండ్‌ పెరుగుతోంది.

కొత్త కారును ఎక్కువ బడ్జెట్‌లో కొనుగోలు చేయలేని వారు.. సెకండ్‌ హ్యాండ్‌లో లభించినా మంచి కారును చూసి కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి దిగుతున్నాయి. కొత్త కార్లతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కూడా విక్రయిస్తున్నాయి. ప్రత్యేక షోరూమ్‌ల ద్వారా యూజ్‌డ్‌ కార్లను విక్రయిస్తున్నాయి.

Hyundai-Grand-I10

దీంతో సెకండ్ హ్యాండ్ కార్లకు భారత మార్కెట్లో ప్రజాదరణ పెరుగుతోంది. కాగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్లో రెండు పాత కార్ల మోడళ్లకు విశేష ఆదరణ లభిస్తున్నట్లు సమాచారం. మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునేవారు ముఖ్యంగా ఆ రెండు కార్ల మోడళ్లకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ కారు మోడల్స్‌ ఏంటో చూద్దాం...

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10(Hyundai Grand i10) మరియు మారుతి సుజుకి స్విఫ్ట్(Maruti Suzuki Swift) సెకండ్‌ హ్యాండ్‌ కార్ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న కార్ మోడల్స్ ఇవే అని ఆటో నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు, రెనాల్ట్‌ సంస్థకు చెందిన క్విడ్ కారు కూడా కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతోంది.

Maruti-Swift

కాగా భారత్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డీజిల్ కార్ల కంటే పెట్రోల్ కార్లకే డిమాండ్ ఎక్కువగా ఉంటోందట. కొత్త కార్ల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో 30 వయసు పై బడిన వారు, మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఎక్కువగా సెకండ్‌ హ్యాండ్‌ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.

అంతే కాకుండా భారత ప్రభుత్వం కూడా డీజిల్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటుండటంతో.. సెకండ్‌ హ్యాండ్‌ కార్లలో పెట్రోల్‌తో నడిచే కార్లకే ఎక్కువగా ఓటేస్తున్నారని వెల్లడైంది. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లు కూడా ఎక్కువగా ఉన్నారని నివేదికల్లో తేలింది. చాలా మంది ఆటోమేకర్లు ఈ ఏడాది రెండంకెల అమ్మకాల వృద్ధిని చూస్తున్నారు.

Renault-Kwid

ముఖ్యంగా సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్ పెద్ద ఎత్తున పెరగుతోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో, మొదటిసారి కారు కొనుగోలుదారులలో 57 శాతం మంది యూజ్‌డ్‌ కార్లనే కొనుగోలు చేయగా.. మూడో త్రైమాసికంలో ఈ సంఖ్య 63 శాతానికి పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అందువల్ల, మొదటిసారిగా కారు కొనాలనుకునేవారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తేలింది.

అయితే కస్టమర్లు సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేయడానికి ధర మాత్రమే కాకుండా వేరే కారణాలు కూడా ఉన్నాయని వెల్లడైంది. యూజ్‌డ్‌ కార్లు డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటాయని కస్టమర్లు నమ్ముతున్నారు. ఎప్పుడైనా కారును అరుదుగా ఉపయోగించే వారు కూడా సెకండ్‌ హ్యాండ్‌ కార్లకే ప్రాధాన్యత ఇస్తున్నారట. స్పిన్నీ అనే వెబ్‌సైట్ ప్రచురించిన సమాచారం ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా 100 శాతం యూజ్డ్ కార్ల విక్రయాల్లో 70 శాతం అమ్మకాలు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయని ఆటో మేకర్లు అంటున్నారు. అదేవిధంగా, మొత్తం డెలివరీల్లో 32 శాతం హోం డెలివరీలు ఉంటున్నాయని చెబుతున్నారు. దీంతో పాటు డిజిటల్‌ పేమెంట్స్‌ చెల్లించే వారి సంఖ్య కూడా స్వల్పంగా పెరుగుతోందని పేర్కొన్నారు.

21 శాతం మంది కస్టమర్లు తమ డబ్బును ఆన్‌లైన్‌లో చెల్లిస్తున్నారని ఆటో కంపెనీలు చెబుతున్నాయి. సరసమైన ధరలో లభించే కార్ల మాదిరిగానే, ప్రీమియం, లగ్జరీ బ్రాండ్‌ల ఆదరణ సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో చాలా రెట్లు పెరుగుతోంది. ముఖ్యంగా జీప్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తులకు భారత కస్టమర్ల నుంచి భారీ స్పందన వస్తోందంటున్నారు.

దేశంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ప్రముఖ కంపెనీలే కాకుండా చిన్న కంపెనీలు కూడా ఈ సెక్టార్‌లో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా తక్కువ ధరలో కొత్త కారు కొనుగోలు చేయలేని వారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, November 11, 2023, 8:59 [IST]
English summary
First time car buyers give preference to buy these two used cars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+