CNG Cars: సీఎన్‌జీ కారు కొనాలని చూస్తున్నారా.. ఈ ఏడాది విడుదలైన టాప్‌ 5 కార్లపై ఓ లుక్కేయండి.!!

మరికొద్ది రోజుల్లో 2023 సంవత్సరం ముగియనుంది. కొత్త ఏడాది సందర్భంగా కొత్త కారును కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ఈ క్రమంలో మీరు CNG వెర్షన్‌ కారును కొనాలని చూస్తే.. ఇదే మీకు మంచి అవకాశం. ఈ ఏడాది విడుదలైన 5 కొత్త సీఎన్‌జీ కార్ల వివరాలు ఇక్కడ ఇస్తున్నాం.. ఫీచర్లు, భద్రత విషయంలో ఈ కార్లు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు.

పెట్రోల్‌, డీజిల్‌ వెర్షన్‌ కార్ల తర్వాత సీఎన్‌జీ కార్లు మరింతగా ప్రజాదరణ పొందుతున్నాయి. కస్టమర్లు కూడా ఇప్పుడు ఎక్కువగా సీఎన్‌జీ కార్లపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎకో ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు మంచి మైలేజ్‌ని అందిస్తాయి. ఈ క్రమంలో మీరు కొత్త సీఎన్‌జీ కారు కొనాలనుకుంటే 2023లో విడుదలైన ఈ టాప్ కంపెనీలకు చెందిన ఫీచర్‌ లోడెడ్‌ కార్లపై ఓ లుక్కేయండి.

Maruti-Suzuki-Brezza

మారుతి బ్రెజ్జా(Maruti Brezza): మారుతి సుజుకి నుంచి ప్రముఖ సబ్-4m SUV బ్రెజ్జా సీఎన్‌జీ వెర్షన్‌. Brezza CNGలో సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా అల్లాయ్ వీల్స్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త మారుతి సుజుకి బ్రెజ్జా సీఎన్‌జీ వెర్షన్‌.. 1.5-లీటర్ మోటారుతో పనిచేస్తుంది. 88 PS మరియు 121.5 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మారుతి బ్రెజ్జా CNG మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 25.51 కి.మీ\ కేజీ మైలేజ్‌ అందిస్తుంది. ధర రూ. రూ. 9,24,000.

Tata-Altroz-iCNG

Tata Altroz iCNG: ఈ ఏడాది లాంచ్‌ అయిన మరో కొత్త కారు 2023 టాటా ఆల్ట్రోజ్ iCNG. ఇది ప్రత్యేకమైన ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో పనిచేస్తుంది. టాటా ఆల్ట్రోజ్ iCNG వెర్షన్‌ ప్రారంభ ధర రూ. 7,55,400 గా ఉంది. ఇందులో 8-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కారు ఫీచర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, సన్‌రూఫ్, 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఇంకా ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ & మారుతి గ్రాండ్ విటారా: గ్రాండ్ విటారా(Grand Vitara) కాంపాక్ట్ SUV.. CNG వెర్షన్‌ పవర్‌ట్రెయిన్‌ను పొందిన మొదటి కాంపాక్ట్ SUV. ఈ కారు టాప్‌ ఎండ్‌ మోడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులను సేఫ్టీ ఫీచర్‌గా మారుతి సుజుకి అందించింది. మారుతి గ్రాండ్‌ విటారా సీఎన్‌జీ వెర్షన్‌ ధర రూ. 12,85,000 నుంచి రూ. 14,84,000 మధ్య ఉంది.

Toyota-Urban-Cruiser-Hyryder

టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌(2023 Toyota Urban Cruiser Hyryder) ఎక్స్‌ షోరూమ్‌ ధర రూ. 13.23 లక్షల నుంచి రూ. 15.29 లక్షల మధ్య ఉంది. మైలేజ్‌ 26.6 km/kg ఇస్తుందని అంచనా. ఫీచర్లు, సేఫ్టీ విషయంలో ఏ మాత్రం రాజీ పడని ఎస్‌యూవీలు ఇవి.

టాటా పంచ్‌ ఐసీఎన్‌జీ(Tata Punch iCNG): దేశీయ మార్కెట్లో టాటా పంచ్‌ సీఎన్‌జీ వెర్షన్‌ ప్రారంభ ధర రూ. 7,09,900 గా ఉంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, సన్‌రూఫ్, USB టైప్ C పోర్ట్‌లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, LED DRLలతో కూడిన ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. .

Tata-Ounch-iCNG

Altroz ​​iCNG మాదిరిగానే టాటా పంచ్‌ iCNG కూడా అదే డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. టాటా పంచ్ iCNG వెర్షన్‌ 1.2-లీటర్ 3-సిలిండర్ యూనిట్‌తో పనిచేస్తుంది. 73.4 PS మరియు 102 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. .

హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌: హ్యుందాయ్‌ నుంచి సరికొత్త మోడల్‌ Exter. ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఎన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, బ్లాక్‌ అండ్ వైట్ కలర్స్‌లో డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Hyundai-Exter

టాటా పంచ్‌కు పోటీగా ఉన్న హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ CNG మోడ్‌లో 1.2-లీటర్ నాలుగు-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 69 PS మరియు 95.2 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ CNG వేరియంట్‌ల ప్రారంభ ధర రూ. 8,23,990.

More from DriveSpark

Article Published On: Thursday, December 21, 2023, 17:55 [IST]
English summary
Five best cng cars launched this year 2023 brezza to hyundai exter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+