దీపావళికి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా కారు కొనాలనుకుంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి.!!
పండుగ సీజన్ సందర్భంగా దీపావళి సంబరాలు మొదలయ్యాయి. ఈ దీపావళిని కొత్త కారు కొనుగోలు చేసి పండుగను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని చాలా మంది ప్లాన్ చేసుకుంటారు. అయితే పండుగ సీజన్‌లో కార్లకు భారీ డిమాండ్ ఉండటంతో వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో మీరు వెంటనే కారును ఇంటికి తెచ్చుకోవాలంటే ఇలా చేయండి..
పండుగ సీజన్‌లో కార్ల లాంగ్ వెయిటింగ్ పీరియడ్‌తో కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అయితే కొన్ని కార్ల మోడల్స్.. తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో అనేక మోడల్స్ కార్లు రావడంతో.. కస్టమర్లు తమకు నచ్చిన కార్లను ఇట్టే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ వెయిటింగ్ పీరియడ్‌తో అందుబాటులో ఉన్న మోడళ్ల వివరాలు ఈ కథనంలో అందిస్తున్నాం.

Skoda Kushaq: స్కోడా ఆటో వోక్స్‌వ్యాగన్ ఇండియా 2021 లో స్కోడా కుషాక్‌ను ప్రారంభించింది. మంచి సేల్స్‌తో మార్కెట్లో విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. స్కోడా కుషాక్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది.1.0 లీటర్ 3 సిలిండర్ TSI ఇంజిన్‌తో పనిచేస్తుంది. 115 bhp వద్ద 178 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
స్కోడా కుషాక్ మరో ఇంజిన్ 1.5 లీటర్ 4 సిలిండర్ ఆప్షన్‌తో పనిచేస్తుంది. 150 hp వద్ద 250 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా దేశీయ మార్కెట్లో స్కోడా కుషాక్ SUV ధర రూ. 10.89 లక్షల వద్ద అందుబాటులో ఉంది.

Hyundai Grand i10 Nios: దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్‌గా పేరొందింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 83 బీహెచ్‌పీ వద్ద 113.8 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ సీఎన్‌జీ వేరియంట్(CNG Variant)లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ 69 bhp వద్ద 95.2 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వెర్షన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తతో జత చేయబడి ఉంటుంది.

Tata Tiago: భారత మార్కెట్లో మరో ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో. ఈ పండుగ సీజన్‌లో ఈ కారును ఈజీగా ఇంటికి తీసుకెళ్లవచ్చు. 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 86 hp వద్ద 113 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
Maruti Suzuki Jimny: మార్కెట్లోకి కొత్తగా విడుదలైన మారుతి సుజుకి జిమ్నీ.. ఆఫ్ రోడ్ SUV. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎంట్రీ లెవెల్ SUV జీటా ట్రిమ్ కాగా టాప్ స్పెక్ ఆల్ఫా ట్రిమ్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆల్ఫా ట్రిమ్ వేరియంట్ కనీస వెయిటింగ్ పీరియడ్ లేకుండా అందుబాటులో ఉంది.

మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్ రోడ్ SUV.. 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 105 hp వద్ద 134 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా జీటా వేరియంట్‌పై రూ. లక్ష వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో రూ. 50 వేల నదగు తగ్గింపుతో పాటు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద మరో 50 వేలు తగ్గనుంది.
Renault Kwid: దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెనాల్ట్ క్విడ్ ఒకటి. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.0 లీటర్ 800 సీసీ ఇంజిన్.. 53 hp వద్ద 72 nm గరిష్ఠ టార్క్‌ను, 67 hp వద్ద 91 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెనాల్ట్ క్విడ్ SUV బేస్ స్పెక్, మిడ్ స్పెక్ వేరియంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ కార్లు అందుబాటులో లేవనే చెప్పవచ్చు. కానీ రూ. 5.67 లక్షల బేస్ ధరతో ప్రారంభమయ్యే RXT వేరియంట్‌ను ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. అయితే ఈ కార్లన్నీ ఆయా డీలర్ షీప్‌లలో లభ్యత బట్టి కొనుగోలు చేయగలరని గుర్తించాలి.



Click it and Unblock the Notifications








