రాత్రి పూట డ్రైవింగ్ చేసేవారి కోసం ప్రత్యేకం.. ఈ టిప్స్ తప్పకుండా ఉపయోగపడతాయి
ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి రాత్రి సమయంలో (నిద్ర వచ్చేసమయంలో) డ్రైవింగ్. నిద్ర వచ్చే సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నిజానికి నిద్ర వచ్చేటప్పుడు వాహనాన్ని నడపడం చాలా ప్రమాదం. ఇలాంటి డ్రైవింగ్ వల్ల కేవలం వాహనం నడిపేవారి మాత్రం కాకుండా వాహనంలో ప్రయాణించే ఇతరులకు కూడా ప్రాణాంతకమే. అంతే కాకుండా మీరు నిద్ర వచ్చే సమయంలో ఇతర వాహనాలను ఢీ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ యొక్క 2005 స్లీప్ ఇన్ అమెరికా పోల్ ప్రకారం 60% వయోజన డ్రైవర్లు గత సంవత్సరంలో మగతగా డ్రైవింగ్ చేసినట్లు నివేదించారు.

అంతే కాకుండా ఒక సర్వే ప్రకారం, ప్రతి 25 మంది పెద్దలలో ఒకరు డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రపోతారని సూచించింది. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, 2017 లో నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల 91,000 యాక్సిడెంట్స్ సంభవించాయని ఇందులో 50,000 మంది గాయపడ్డారని, దాదాపు 800 మంది మరణించారని తెలిసింది. నిజానికి నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే అంచనా వేయడం కూడా కష్టమే.
పగలు నిద్ర పోవాలి:
రాత్రి పూట డ్రైవింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా పగటి పూట నిద్రపోవాలి. ఇలా పగటి పూట నిద్రపోతే రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు హుషారుగా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. నిద్ర వచ్చినపుడు శరీరం తప్పకుండా విశ్రాంతి కోరుకుంటుంది. కావున రాత్రి నిద్ర పోకుండా ఉండటానికి పగలు నిద్ర పోవాలి. అంతే కాకుండా రాత్రి సమయంలో ఎక్కడైన అలసిపోనట్లు అనిపిస్తే కొంత సేపు వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవడం మంచిది.

మద్యం సేవించి వాహనం నడపకూడదు:
నిజానికి వాహనం నడిపేటప్పుడు మద్యం సేవించకూడదు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. భారతదేశంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ భాగం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉన్నాయి. కావున డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మద్యం సేవించకూడదు. మద్యం సేవించి వాహనం నడపటం చట్టరీత్య నేరం కూడా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకుంటే భారీ జరిమానాలు కూడా చెలించాల్సి ఉంటుంది.
మ్యూజిక్ విస్మరించండి:
రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు తప్పకుండా రోడ్డు మీద ద్రుష్టి పెట్టాలి. కావున డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కావున ఎటువంటి పరిస్థితుల్లోనూ పరధ్యానంలో ఉండకూడదు. పదే పదే మొబైల్ కూడా చూడకూడదు పెద్దగా మ్యూజిక్ కూడా పెట్టుకోకూడదు. ఒక వేళా మ్యూజిక్ వినాలనిపించినప్పుడు తప్పకుండా హుషారైన పాటలు వినటం మంచిది. అలాంటి పాటలను ముందుగానే సెలక్ట్ చేసుకోండి. ఇవి తప్పకుండా నిద్ర నుంచి కొంత ఉపశమనం కలిగిస్తాయి.

పరిమితమైన వేగంతో డ్రైవ్ చేయండి:
రాత్రి పూట రోడ్లు కాలీగా ఉంటాయని మితిమీరిన వేగంతో డ్రైవింగ్ చేయకూడదు. తప్పకుండా మీరు ఒక పరిమితమైన వేగంతో వాహనం డ్రైవ్ చేయాలి. రాత్రి సమయంలో రోడ్లు అంత స్పష్టంగా కనిపించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎదురుగా కూడా అనేక వాహనాలు వస్తూ ఉంటాయి, వాటి లైట్ వెలుతురు వల్ల సరిగ్గా డ్రైవ్ చేయలేరు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది.
వాహనంలో లైట్స్ పనిచేస్తాయా లేదా అని నిర్థారించుకోండి:
ఇప్పటి వరకు పైన చెప్పిన అన్ని సూచనలు ఒక ఎత్తు అయితే, ఇది మాత్రం ఒక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే ప్రయాణం రాత్రి పూట జరిగేటప్పుడు తప్పకుండా వాహనంలో ఉన్న లైట్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తాయా.. లేదా అని నిర్థారించుకోండి. వాహనాల్లో లైట్స్ అన్నీ సరిగ్గా పనిచేస్తాయి అని నిర్దారించుకున్నప్పుడు ప్రయాణం ప్రారభించవచ్చు, అలా కాకుండా లైట్స్ సరిగ్గా పనిచేయకపోతే మీ ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications








