Force Citiline 10 మంది సులభంగా ప్రయాణించే అధునాతన కారు.. 3 సం' వారంటీ
దేశంలో మినీ బస్సు, అంబులెన్స్ తో పాటు ఇతర మల్టీ పర్పస్ వెహికిల్స్ వంటి వాటికి ఫోర్స్ మోటార్స్ సంస్థ బాగా పేరొందింది. పూణెకు చెందిన ఈ ప్రముఖ భారతీయ బహుళజాతి వాహన తయారీ సంస్థ.. తాజాగా 10-సీట్ల SUV 2023 సిటీలైన్‌ను విడుదల చేసింది. ఈ మోడల్ ఫోర్స్ ట్రాక్స్ క్రూయిజర్ నుంచి నవీకరించబడిన వెర్షన్ గా రాబోతుంది. దీనికి సంబంధించిన విశేషాలు మీకోసం..
ఈ సిటీలైన్ ఫ్రంట్ ప్రొఫైల్ మునుపటి మోడల్ ట్రాక్స్ కంటే ముందు అనేక మార్పులతో సంస్థ తీసుకువచ్చింది. ఈ ఫోర్స్ సిటీలైన్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ నుంచి తీసుకోబడిన FM 2.6 కామన్ రైల్ డీజిల్ ఇంజన్ అమర్చబడింది. ఈ ఇంజన్ 1400-2400rpm వద్ద 91hp మరియు 250 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది వేగంగా పరుగెత్తేందుకు సహకరించనుంది. దీని ధర 15.39 లక్షలుగా ఉంది.

తాజాగా ఈ కారుకి ఫాగ్ ల్యాంప్‌లకు అనువుగా ఉండే ప్లాస్టిక్ బాడీ-కలర్ ఫ్రంట్ బంపర్‌ను అందించింది. కానీ ఇది యాక్సెసిరీస్‌లో భాగంగా అదనంగా చెల్లించడం ద్వారా అమర్చవచ్చు. ఈ కొత్త ఫోర్స్ సిటీలైన్ కారు రిఫ్లెక్టర్ ఆధారిత హాలోజన్ బల్బ్ అమర్చిన ల్యాంప్‌తో వస్తుంది. సిటీలైన్ హెడ్‌ల్యాంప్‌లు భారీగా రానున్నాయి. ఇవి ఫోర్స్ కి మరింత లుక్ ని ఇవ్వనున్నాయి.
ఇందులో టర్న్ ఇండికేటర్లను, హెడ్‌ల్యాంప్‌లు పొందవచ్చు. చాలా పొడవుగా.. ఎక్కువ మంది కూర్చునేలా పెద్ద సంఖ్యలో ప్రజలకు వసతి కల్పించడానికి.. అలానే వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు గమనించవచ్చు. ప్రత్యేక డిజైన్ తో ఈ ఎంవీయూ రానుంది. ప్రతీ విభాగంలో స్ప్లిట్ వెనుక కిటికీలు, వెనుక టెయిల్‌గేట్‌ను కలిగి ఉండనుంది.
అలానే రెండు చివర్లలో హాలోజన్ టెయిల్‌లైట్‌లతో రానుంది. ఫోర్స్ సిటీలైన్ కారులో కేవలం డ్రైవర్ మాత్రమే తన సీటును మాత్రమే సర్దుబాటు చేసుకోవగలడు. అన్ని సీట్లను సర్దుబాటు చేసేలా సదుపాయం లేదు. ఈ ఫోర్స్ సిటీలైన్ 4 వరుసలు ఉన్న 10 సీట్ల కాన్ఫిగరేషన్‌తో ప్రత్యేకంగా తయారు చేసింది. ఇది కస్టమర్లకు అనుకూలంగా ఉండనుంది.
ఇక సీటింగ్ విషయానికి వస్తే ఈ కారులో మొదటి వరుసలో ఇద్దరు కూర్చుంటారు. ఆపై మూడు సీట్ల బెంచ్ ను కలిగి ఉంటుంది. దీని తర్వాత మరో రెండు కెప్టెన్ స్థానాలుగా, ఆ తర్వాత చివర స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు ఫోర్స్ సిటీలైన్ కారు సాధారణ, ప్రాథమిక డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను పొందుతుంది. ఇక పవర్ విండోస్, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌తో ఈ అధునాతనంగా రాబోతుంది.
ఈ ఇంజన్ 3 సంవత్సరాలు లేదా 3,00000 కిమీల వారంటీ అవకాశాన్ని సంస్థ కల్పించనుంది. ప్రతీ 20000 కి.మీల తర్వాత ఆయిల్ మార్పు తప్పనిసరి అని సంస్థ తెలిపింది.. ఈ SUV 5120mm పొడవు, 191mm గ్రౌండ్ క్లియరెన్స్ ను పొందుతుంది. ఫోర్స్ మోటార్స్ నుంచి ఆకర్షణీయమైన గ్రిల్ కలిగి ఉంది. సరికొత్త టెక్నాలజీతో ఈ MUVతో ఫోర్స్ సేల్స్ మరింత పెరగనున్నాయి. ఇప్పటికే ఈ మోడల్స్ లో ఫోర్స్ గట్టీ పోటీదారుగా కొనసాగుతోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








